»Junior Ntr Reached Mumbai For The Filming Of War 2 Photos Are Viral
NTR: వార్-2 చిత్రీకరణ కోసం ముంబయి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఫోటోలు వైరల్
జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్2లో నటిస్తున్న చిత్రం వార్2. హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఎన్టీఆర్ నటిస్తుండడంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటున్నారు. ఆ షూటింగ్ కోసం తాజాగా ముంబై వెళ్లిన ఎన్టీఆర్ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
Junior NTR reached Mumbai for the filming of War-2.. Photos are viral
NTR: గ్లోబల్ స్టార్, టాలీవుడ్ స్టార్హీరో జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో ఆయన వార్-2 చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తుండగా ఎన్టీఆర్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్-2 చిత్రం రూపొందుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ముంబయి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కూడా షర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదల చేసిన మూవీ గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న దేవర ఈ ఏడాది అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. వార్-2 చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ స్పై క్యారెక్టర్లో నటిస్తున్నట్లు సమాచారం.