ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ చేసిన రెండు సినిమాలు పోయాయి. ముఖ్యంగా లింగుసామి డైరెక్షన్లో వచ్చిన 'ది వారియర్' డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో మాసివ్ హిట్ కోసం గట్టిగా చేస్తున్నాడు రామ్. అందుకే ఈ సారి ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేశాడు.
అఖండ వంటి హిట్ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో.. స్కంద పై హై ఓల్టేజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన స్కంద ట్రైలర్, సాంగ్స్‌కు మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో.. స్కంద పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాలో ఉన్న భారీ యాక్షన్‌కు తగ్గట్టుగా ఉన్న ఎమోషన్ వర్కౌట్ అయితే సినిమా మామూలుగా ఉండదని హీరో రామ్ చెబుతున్నాడు. అందుకు తగ్గట్టే సినిమా పై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ రోజు కరీంనగర్లో కల్ట్ జాతర పేరుతో మాస్ ఈవెంట్ వీ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో 25 అడుగుల రామ్ భారీ కటౌట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్ట్ U/A సర్టిఫికెట్ ఇచ్చింది. రన్ టైం వచ్చేసిన 2 గంటల 47 నిమిషాలకు లాక్ అయినట్టుగా తెలుస్తోంది. సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్‌గా ఉంది. స్కందలో రామ్ విశ్వరూపం చూపించాడట. బోయపాటి మార్క్ యాక్షన్.. రామ్, శ్రీలీల కాంబినేషన్.. థమన్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ అని అంటున్నారు.
సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అదిరిపోయిందని టాక్. దీంతో స్కంద మూవీ బోయపాటి, రామ్ కెరీర్ బెస్ట్ హిట్‌గా నిలుస్తుందనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవగా.. టికెట్స్ హాట్ కేకుల్లా మారాయి. మరి సెప్టెంబర్ 28న థియేటర్లోకి రానున్న స్కంద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.