Guntur Kaaram: ఓటీటీలోకి రాబోతున్న గుంటూరు కారం.. ఎప్పుడంటే?
డైరక్టర్ త్రివిక్రమ్, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబోలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీ డేట్‌ను కూడా లాక్ చేసుకుంది.
Guntur Kaaram: డైరక్టర్ త్రివిక్రమ్, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబోలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ గుంటూరు కారం. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్ వచ్చిన ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ డేట్ కూడా లాక్ చేసుకుంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసుకుంది. ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ.. రౌడీ రమణని 70ఎంఎంలో చూశారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో చూడటానికి సిద్ధమవ్వండి. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్కు రానుందని మేకర్స్ తెలిపారు.
Rowdy Ramana ni cinemascope 70 mm lo choosaaru. Ippudu Netflix lo choodandi 🎬😎 Guntur Kaaram, coming to Netflix on 9 February in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi.#GunturKaaramOnNetflixpic.twitter.com/VL5Rb4Wioj
ఈ చిత్రం కథ విషయానికొస్తే.. గుంటూరులో హీరో నాన్న సత్యం(జయరామ్)కు మిర్చి యార్డ్లు ఉంటాయి. ఆయన వ్యాపార శత్రువు అయిన జగపతిబాబు తన యాడ్స్‌ని తగలబెడుతాడు. ఆ గొడవలో జగపతిబాబు అన్న సునిల్ చనిపోతాడు. ఆ నేరం సత్యం మీద పడుతుంది. ఆ సమయంలో తన కొడుకు రమణ(మహేష్ బాబు)ను విడిచి తన తండ్రి వైరా వెంకట సూర్యానారాయణ (ప్రకాష్ రాజ్) దగ్గరకిి వసుంధర వెళ్లాల్సి వస్తుంది. మరో పెళ్లి చేసుకొని పార్టీలో చేరి మంత్రి అవుతుంది. తనకు ఒక కొడుకు ఉంటాడు. అతన్ని ఎంపీ చేయాలనేది సూర్యానారాయణ కల.
ఈ కల కోసం భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు రమణకు, తన తల్లి వసుంధరకు ఎలాంటి సంబంధం లేదని ఓ సంతకం కోసం రమణకు ఫోన్ చేస్తారు. ఇక రమణ సంతకం చేశాడా? కొడుకును వదిలి వసుంధర ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దీనికి ముఖ్య సూత్రదారి ఎవరు? వసుంధరను పొలిటికల్‌గా డీఫేమ్ చేయడానికి కాటా మధు(రవి శంకర్) ఏం చేస్తాడు? ఈ కథలో శ్రీలీల పాత్ర ఏంటి? కుటుంబంలో ఉన్న ఈ మొత్తం చిక్కుల్ని రమణ ఎలా ఎదుర్కొన్నాడు అనేది గుంటూరు కారం కథ.