Movie: ఎట్టకేలకు మురుగదాస్ కొత్త ప్రాజెక్ట్ కన్ఫామ్!
ప్రస్తుతం స్టార్ట్ డైరెక్టర్ మురుగదాస్ బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు. రజనీకాంత్ 'దర్బార్' సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. చివరికీ కొత్త ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేసింది.
Murugadoss: మహేష్ బాబు ‘స్పైడర్’ రిజల్ట్ చూసిన తర్వాత మురుగదాస్‌తో సినిమాలు చేయడానికి భయపడ్డారు స్టార్ హీరోలు. అయినా విజయ్, రజనీ కాంత్ లాంటి సూపర్ స్టార్స్ చాన్స్ ఇచ్చారు. సర్కార్, దర్బార్ సినిమాలతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు మురుగదాస్. అప్పటి నుంచి కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ హీరోల చుట్టు చక్కర్లు కొట్టాడు. ఆ మధ్య ఖాన్ త్రయంలో ఎవరో ఒకరితో మురుగదాస్ సినిమా ఉంటుందని వినిపించించి. మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ఏ ఒక్క స్టార్ హీరో కూడా మురుగదాస్‌ని నమ్మలేదు.
ఎట్టకేలకు కోలీవుడ్ యంగ్ హీరోతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు మురుగదాస్. యంగ్ హీరో శివకార్తికేయన్ మురుగదాస్‌తో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. ఆ మధ్యే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటికి రాలేదు. ఫైనల్‌గా సెప్టెంబర్ 25న, అంటే ఈ రోజు మురుగదాస్ బర్త్ డే సందర్భంగా.. బర్త్ డే విష్ చేస్తూ ప్రాజెక్ట్ కన్ఫామ్ చేశాడు శివ కార్తికేయన్. ‘ప్రియమైన మురుగదాస్ సార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. సార్ నా 23వ సినిమాను మీతో చేయడం చాలా ఆనందంగా ఉంది. మీ కథ విన్న తర్వాత నేను రెట్టింపు ఆనందాన్ని పొందాను. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా మురుగదాస్‌కు బర్త్ డే విష్ చేస్తున్నారు. అలాగే శికార్తికేయన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.