Salman Khan: మురుగదాస్, సల్మాన్ ఖాన్ సినిమా టైటిల్ ఫిక్స్!
వరుస ఫ్లాపుల్లో ఉన్న తమిళ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ నెక్స్ట్ సినిమాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్‌తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేశారు.
Salman Khan: స్టార్ డైరెక్టర్ ఏఆర్. మురుగదాస్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో మురుగదాస్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబుతో తెరకెక్కించిన స్పైడర్ మూవీ ఘోర పరాజయం పాలయింది. ఆ తర్వాత వచ్చిన విజయ్ సర్కార్, రజనీ దర్బార్ సినిమాలు కూడా మురుగదాస్‌ను కాపాడలేకపోయాయి. అక్కడి నుంచి మురుగదాస్‌కు హీరో దొరకడం కష్టంగా మారింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. ఇప్పుడు సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవడానికి ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తున్నాడు మురుగదాస్.
నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్‌తో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అనౌన్స్మెంట్ వచ్చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి.. లేటెస్ట్గా రంజాన్ సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు ‘సికందర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ ఈద్‌కి ‘మైదాన్’, ‘బడేమియా చోటేమియా’ సినిమాలు రిలీజ్ అయ్యాయి.. కానీ వచ్చే ఈద్‌కి ‘సికందర్’ మిమ్మల్ని కలుస్తాడు.. అంటూ సల్మాన్ ఖాన్ తెలిపాడు. ఇక ఈ చిత్రానికి సల్మాన్ సన్నిహితుడు సాజిద్ నదియాద్ వాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందని తెలుస్తోంది. మరి సల్మాన్ ఖాన్‌తో మురుగదాస్ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.