»Geethanjali Malli Vachindi Movie Review Is Geethanjali Scary
Geethanjali Malli Vachindi Movie Review: మరి గీతాంజలి భయపెట్టిందా?
అంజలి హీరోయిన్గా నటించిన గీతాంజలికి సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఈరోజు రిలీజ్ అయ్యిందిజ ఈ సినిమాకు శివ తుర్లపాటి దర్శకత్వం వహించగా.. కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఇందులో శ్రీనివాసరెడ్డి, సత్య, సునీల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
చిత్రం:గీతాంజలి మళ్లీ వచ్చింది నటులు: అంజలి, సత్య, సునీల్, రాహుల్ మాధవ్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్ దర్శకుడు: శివ తుర్లపాటి రచన:కోన వెంకట్ విడుదల: 11-04-2024
కథ
శ్రీను(శ్రీనివాస్ రెడ్డి), ఆరుద్ర(షకలక శంకర్), ఆత్రేయ(సత్యం రాజేష్) వాళ్లు సినిమా ఛాన్స్ కోసం హైదరాబాద్‌లో కష్టపడుతుంటారు. అయాన్(సత్య) హీరో కావాలని అనుకుంటాడు. దానికోసం తన ఫ్రెండ్స్ అయిన శ్రీను, ఆరుద్ర, ఆత్రేయలకు ఖర్చు పెడతాడు. కానీ హీరో కావాలనే తన కలలు మాత్ర్రం నెరవేరవు. అలాంటి సమయంలో శ్రీనుకు ఊటీలోని వ్యాపారవేత్త విష్ణు(రాహుల్ మాధవ్) మేనేజర్ గోవిందా గోవిందా(శ్రీకాంత్ అయ్యంగార్) నుంచి కాల్ వస్తుంది. ఊర్లో ఉన్న సంగీత్ మహల్లో షూట్ చేయాలని విష్ణు కథను కూడా చెబుతాడు. అక్కడే కాఫీ హోటల్‌ను నడుపుతున్న అంజలి(అంజలి) ఆ సినిమాలో హీరోయిన్గా చేస్తేనే సినిమా తీస్తానని అంటాడు. అసలు అంజలిని హీరోయిన్గా నటించమని ఎందుకు ఒప్పించాలి? సంగీత్ మహల్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అక్కడే జరిగే హత్యల కారణం ఏంటి? విష్ణు ఎవరు? అంజలి, శ్రీను, ఆరుద్ర, ఆత్రేయలను ఎందుకు ఒక చోటుకు తీసుకొచ్చారు? గీతాంజలి ఆత్మ మళ్లీ తిరిగి ఎందుకొచ్చింది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
హారర్ కామెడీ సినిమాల్లో అంతగా కథ లాజిక్స్ ఉండదు. వాటి కోసం ప్రేక్షకులు వెతకకూడదు. అయితే ఈసినిమాలో ప్రేక్షకుల్ని నవ్వించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. గీతాంజలికి సీక్వెల్‌గా అని అర్థమయ్యేలా సినిమా స్టార్ట్ అవుతుంది. సీన్స్ కొత్తగా అనిపించేలా ఉండదు. సత్య కామెడీ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సినిమా అంతా నెమ్మదిగా సాగుతుంది. అసలు కథ ఇంకా స్టార్ట్ కాలే అన్నట్లు ఉంటుంది. ఇంటర్వెల్ సమయానికి అసలు కథ మొదలవుతుంది. సెకండాఫ్‌లో సంగీత్ మహల్లో సినిమా షూట్‌తో ప్ర5ారంభం అవుతుంది. ద్వితీయార్థంలో ప్రతి సీన్ నవ్విస్తుంది. కొన్ని సీన్లు భయపెట్టిన కొన్ని నవ్విస్తుంటాయి. కొన్ని సన్నివేశాల్లో లాజిక్స్ ఉండవు. కాకపోతే కామెడీ అలా పోతుంది అంతే. దెయ్యాలతో చేసే వినోదం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. కాకపోతే క్లైమాక్స్ ఇంకా వేరేలా రాసుకుంటే బాగుండేది.
ఎవరెలా చేశారంటే?
సినిమాలో అంజలికి అంత ఇంపార్టెన్స్ అనిపించదు. హీరోయిన్ ఏదో ఉన్నట్లు ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు సత్య నవ్విస్తాడు. సునీల్ కూడా తన కామెడీతో ఆకట్టుకుంటాడు. రవిశంకర్, ప్రియా పాత్రలు మెప్పిస్తాయి. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్ వాళ్ల పాత్రకు తగ్గట్లు నటించారు.
సాంకేతిక అంశాలు
సాంకేతిక అంశాలు విషయానికొస్తే.. కొన్ని సన్నివేశాలు రిపీట్‌గా ఉంటాయి. సౌండ్ డిజైనింగ్ ఒకే. పాటలు అంతగా ఆకట్టుకోవు. కెమెరా ఒకే. కథను ఇంకా కొత్తగా రాసిఉంటే బాగుండేది. ఎడిటింగ్ ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్
+అంజలి యాక్టింగ్
+సత్య కామెడీ
మైనస్ పాయింట్స్
-కొన్ని సన్నివేశాలు రొటీన్
-దెయ్యాలు థ్రిల్ చేయకపోవడం
-ప్లాష్ కథ అంతగా ఆకట్టుకోకపోవడం