యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే.. చాలా మార్పు కనిపిస్తుంది. గతంలో కంటే చాలా సన్నబడ్డట్టుగా కనిపించాడు తారక్. దీంతో టైగర్ ఎందుకు తగ్గాడు? ఎన్టీఆర్ 31 ఎంత వరకు వచ్చిందనేది హాట్ టాపిక్‌గా మారింది.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా కోసం వెయిట్ పెరిగాడని గతంలో చాలా సార్లు వినిపించింది. కానీ లేటెస్ట్ లుక్‌లో మాత్రం తారక్ చాలా వెయిట్ లాస్ అయినట్టుగా కనిపించాడు. దీంతో.. దేవర ఎందుకు తగ్గాడు? అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఉన్నట్టుండి ఎన్టీఆర్ ఎయిర్ పోర్టులో కనిపించడంతో.. షూట్ కోసం ఎక్కడికైనా వెళ్తున్నారా? అని అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. ప్రశాంత్ నీల్‌తో కలిసి కనిపించాడు టైగర్. దీంతో ఎన్టీఆర్ 31 కోసం కలిశారా? అనే డౌట్స్ వచ్చాయి. కానీ ఫ్యామిలీతో కలిసి కనిపించడంతో.. అసలు మ్యాటర్ వేరే అని తెలిసింది. ప్రశాంత్ నీల్ ఇంట్లో ఏదో శుభకార్యం ఉండగా ఎన్టీఆర్ బెంగుళూరుకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అందుకే.. తారక్ తన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటు వెళ్లారని సమాచారం.
ఇక.. అదే కార్యక్రమానికి కాంతార హీరో రిషబ్ శెట్టి కూడా తన సతీమణి ప్రగతితో రావడం జరిగింది. అక్కడ ప్రశాంత్ నీల్‌తో కలిసి వారంతా గ్రూప్ ఫోటోలు దిగారు. దీంతో ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కానీ ఈ ఫోటోల్లో టైగర్ కొంచెం సన్నగా కనిపిస్తున్నాడు. దీంతో దేవర కోసమే ఎన్టీఆర్ వెయిట్ లాస్ అయినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు టైగర్. తండ్రి కొడుకులుగా నటిస్తున్నట్టు టాక్ ఉంది. అందుకే.. ఈ వేరియేషన్ అని అంటున్నారు. అయితే.. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో.. ఎన్టీఆర్ 31 చర్చ కూడా జరిగి ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఎన్టీఆర్ 31 ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.