ప్రజెంట్ ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ కాలంలో అమ్మడికి వచ్చినన్ని ఆఫర్లు మరో హీరోయిన్‌కి రాలేదనే చెప్పాలి. అయితే.. శ్రీలీల విషయంలో ఇది నిజమేనని తెలుస్తోంది.
Srileela: యంగ్ బ్యూటీ శ్రీలీల క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తక్కువ కాలంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్టాటస్ సొంతం చేసుకుంది అమ్మడు. అస్సలు గ్యాప్ ఇవ్వకుండా.. నెలకో సినిమాతో అలరించించింది. పెళ్లి సందడి తర్వాత ధమాకా సినిమాతో హిట్ అందుకున్న శ్రీలీల.. ఆ తర్వాత బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాతో మరో హిట్‌ను తనా ఖాతాలో వేసుకుంది. అయితే.. ఇప్పటి వరకు శ్రీలీల చేసిన సినిమాల్లో ధమాకా, భగవంత్ కేసరి తప్పితే మిగతా సినిమాలన్నీ నిరాశపరిచాయి.
చివరగా సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమా హిట్ అని చెబుతున్నప్పటికీ.. శ్రీలీలకు పెద్దగా ఒరిగిందేమి లేదు. ఇక అంతకు ముందు వచ్చిన స్కంద, ఆదికేశవ సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. దీంతో నెక్స్ట్ శ్రీలీల ఆశలన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైనే ఉన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్‌లో హీరోయిన్గా నటిస్తోంది శ్రీలీల. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఇది తప్పితే మరో పెద్ద సినిమా లేదు. కొత్త ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేయడం లేదు. దీంతో శ్రీలీల కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇస్తుందనే మాట.. నిజమేనని అంటున్నారు.
ఓ వైపు సినిమాలతో పాటు ఎమ్‌బీబీఎస్ కూడా చదువుకుంటోంది శ్రీలీల. ఇది కూడా శ్రీలీల బ్రేక్‌కు ఓ కారణం అని చెప్పొచ్చు. కానీ.. కెరీర్, చదువు రెండూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది శ్రీలీల. అయితే.. కొత్త సినిమాల విషయంలో మాత్రం.. తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తానంటోందట. మరి శ్రీలీల నెక్స్ట్ సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.