చాలా మూవీలకు హీరీలు మారడం, డైరెక్టర్లు మారడం, హీరోయిన్లు మారడం సర్వ సాధారణం. చాలాసార్లు ముందు ఒక హీరోతో అనుకున్న సినిమా, తర్వాత మరో హీరోతో చేయాల్సి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో మహేష్ చేయాల్సిన ఓ సినిమా ఇప్పుడు బాలీవుడ్ హీరో హృతిక్ ఖాతాలోకి పోయింది.
ఇంతకీ మ్యాటరేంటంటే. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయన అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ అయిపోయాడు. ఆ తర్వాత, బాలీవుడ్ లోనూ సేమ్ సినిమా తీసి, అక్కడ కూడా సత్తా చాటాడు. ఆ హిట్ లతో ఆయన తో సినిమాలు చేయడానికి చాలా మంది హీరోలు ముందుకు వచ్చారు. వారి జాబితాలో మహేష్ పేరు కూడా వినపడింది. ఓ స్పై మూవీని ఆయన మహేష్ తో చేయాలని అనుకున్నారట. స్టోరీ కూడా చెప్పారట. అయితే, ఆ స్టోరీ తనకు నప్పేలా లేదని మహేష్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
దీంతో, ఆయన బాలీవుడ్ హీరో హృతిక్ కి ఈ కథ వినిపించాడట. ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో హృతిక్ ది డ్యూయల్ రోల్ అని తెలుస్తోంది. ఇది భారీ బడ్జెట్ సినిమా అవుతుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా, రణ్ బీర్ కపూర్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. యానిమల్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మూవీతో ఆయన ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.