TG: సీఎం రేవంత్ రెడ్డితో ఇవాళ పలువురు సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి హాజరుకాలేదు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ వార్త బయటకొచ్చింది. చిరు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారట. అందువల్లే ఆయన సీఎంను కలవలేదట. కాగా, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో చిరు మాట్లాడారని సమాచారం.