తన సినిమాల్లో తల్లి పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వరంటూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా వీటిపై సందీప్ స్పందించారు. నిజ జీవితంలో తాను తల్లితోనే ఎక్కువ చనువుగా ఉంటానని చెప్పారు. తమ బంధంలో ఎలాంటి సమస్యలు లేకపోవడం వల్లే సినిమాల్లో ఆ డ్రామాను తీసుకురాలేకపోతున్నాని తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.