కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్యపై ఆమె భర్త తండ్రి బుచ్చిరెడ్డి స్పందించారు. శోభితను కన్నబిడ్డలా చూసుకున్నట్లు తెలిపారు. ‘పెళ్లి అయ్యేంత వరకూ ఆమె సెలబ్రెటీ అని మాకు తెలియదు. నా కుమారుడు సుధీర్ రెడ్డి, కోడలు శోభిత అన్యోన్యంగా ఉండేవారు. వారిద్దరి మధ్య ఎప్పుడూ ఎలాంటి గొడవలు లేవు. స్వల్ప కాలంలో మా ఇంట్లో సొంత కూతురులా మెలిగింది. సినిమాల్లో నటించకూడదని మేము ఎప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయలేదు’ అని పేర్కొన్నారు.