నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు (dil raju) ఓ హీరోయిన్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ (tollywood) వర్గాలు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ను ఆరంభించిన దిల్ రాజు ఆ తర్వాత నిర్మాతగా ఎదిగి.. టాలీవుడ్‌ను శాసించేస్థాయికి ఎదిగారు. ఆయన కెరీర్లో విజయాలే ఎక్కువ. రికార్డులు సృష్టించిన సినిమాలు ఉన్నాయి. నిర్మాతగా సినిమాలు తీస్తూనే.. డిస్ట్రిబ్యూటర్‌గాను కొనసాగుతున్నారు. గత ఏడాది చివరలో వచ్చిన లవ్ టుడే సినిమా తెలుగులో డబ్ చేశారు. తమిళంలో హిట్ అయిన ఈ సినిమాను రూ.2 కోట్లకు కొనుగోలు చేసి, అంతకు నాలుగు రెట్ల లాభాలను ఆర్జించారు దిల్ రాజు. ఈ సినిమాలో హీరోగా ప్రదీప్ రంగనాథం, హీరోయిన్గా ఇవానా (ivana) నటించింది. ఈ సినిమాతో ఇవానాకు తెలుగులో యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది. దీనిని గుర్తించిన దిల్ రాజు ఆమె ఇమెజ్‌ను క్యాష్ చేసుకుందామనుకుంటున్నాడట.
ఆమెతో వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమైనట్లుగా టాలీవుడ్ కోడై కూస్తోంది. మొదటి సినిమా కోసమే రూ.1 కోటి ఆఫర్ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఆయన ఆఫర్‌కు ఆమె కూడా ఓకే చెప్పిందట. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఇవానా ఆ తర్వాత తమిళంలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసింది. లవ్ టుడేలో మాత్రం లీడ్ రోల్లో (Lead debut) నటించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. తమిళంలో వరుసగా సినిమాలు చేస్తోంది. 2019లో బెస్ట్ డిబట్ యాక్ట్రస్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డులు పొందింది.