హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం నవంబర్ 14న రిలీజై మిక్సిడ్ టాక్కే పరిమితం అయింది. అయితే ‘కంగువా’ రిలీజ్కు ముందు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ కాగా.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు టాక్.