టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి తన నటన, కామెడీ టైమింగ్స్‌తో ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. పలు యూట్యూబ్ వీడియోలతో పాటు షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి విజయం సాధించాడు. అదే ఏడాదిలో చిచోరే మూవీతో హిందీలో ఎంట్రీ ఇచ్చాడు. ఇక తెలుగులో జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి సినిమాలు తీశాడు.