మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు భాను భోగవరపు రూపొందిస్తున్న సినిమా ‘మాస్ జాతర’. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 26న ఇది విడుదల కానున్నట్లు సమాచారం. ఇక శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి. 2025 మే 9న రిలీజ్ కానుంది.