Ramcharan: ‘గేమ్ చేంజర్’ ట్రోలింగ్ నుంచి తప్పించుకునేనా?
ఎట్టకేలకు గేమ్ చేంజర్ నుంచి సాలిడ్ అప్డేట్ బయటికొచ్చింది.. అని మెగా ఫ్యాన్స్ అనుకునే లోపే.. డేట్ లేకుండా సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయినా కూడా మెగాభిమానులకు ఇది ఊరటనిచ్చే అప్డేటే. కానీ సాంగ్ పైనే ఎన్నో డౌట్స్ ఉన్నాయి.
హమ్మయ్య.. ఎట్టకేలకు గేమ్ చేంజర్ నుంచి సాలిడ్ అప్డేట్ బయటికి రావడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. అప్పుడెప్పుడో టైటిల్ అనౌన్స్ చేసిన శంకర్.. దసరా సందర్భంగా దీపావళికి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తామని ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. గతంలో లీక్ అయిన జరగండి సాంగ్‌నే ఇప్పుడు రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ పోస్టర్ చాలా కలర్ ఫుల్‌గా ఉంది. అపరిచితుడు సినిమాలో క్లైమాక్స్ సాంగ్‌ను తలపిస్తున్నట్టుగా ఉన్న ఈ సాంగ్.. థియేటర్లో మాస్ ఆడియెన్స్ విజిల్స్ వేసేలా ఉంటుందని.. ఈ ఇక్క పోస్టర్‌తో చెప్పేశాడు శంకర్.
చెవి పోగు, చేతికి కడియాలతో ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉన్నాడు రామ్ చరణ్. కానీ ఇప్పటికే లీక్ అయిన జరగండి సాంగ్ లిరిక్స్ పై మెగా ఫ్యాన్స్ చాలా అప్సెట్ అయ్యారు. అసలు ఆ లిరిక్స్ ఏంట్రా బాబు.. జరగండి జరగండి అంటూ.. దారుణాతి దారుణంగా ట్రోలింగ్ జరిగింది. కానీ ఇప్పుడు ఫైనల్ వెర్షన్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నాడు తమన్. ఎంత మిక్స్ కొట్టి సాంగ్ రెడీ చేసినా కూడా లిరిక్స్ మార్చరు కాబట్టి.. ఈ జరగండి సాంగ్ ఎలా ఉంబోతోందనే ఆసక్తి అందరిలోను ఉంది. ఒకవేళ తమన్ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తే తప్పా.. గేమ్ చేంజర్ సాంగ్ ట్రోలింగ్ నుంచి తప్పించుకునే ఛాన్స్ లేదు. అయితే.. సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్లో మాత్రం చరణ్ లెఫ్ట్ హ్యాండ్లో ఓ బుక్ ఉంది.
అసలు పాటలో బుక్ ఎందుకు? అనేదే ఇప్పడు అందిరి డౌట్. ఖచ్చితంగా శంకర్ మార్క్ ప్రకారం.. పాటకు దానికి ఏదో లింక్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. గతంలో ఈ సినిమాను స్టార్ట్ చేసినప్పుడు కూడా చరణ్‌ను ఫైల్‌తోనే చూపించాడు. ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అందుకే.. ఈ ఫైల్స్, బుక్స్‌ని హైలెట్ చేస్తున్నట్టున్నాడు. ఏదేమైనా.. గేమ్ చేంజర్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.