పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న విడుదల కానుంది. US మార్కెట్లో ఈ సినిమా రికార్డు సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ ఇప్పటికే 250K డాలర్ల గ్రాస్ మార్కును దాటినట్లు డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. ప్రీమియర్లకు ఇంకా ఒకరోజు సమయం ఉండగానే ఈ స్థాయి వసూళ్లు రావడం ఈ మూవీ గ్రాండ్ ఓపెనింగ్స్‌కు సంకేతమని సినీ వర్గాలు తెలిపాయి.