తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమా సెట్స్‌లో గన్లు ఉండటం సహజమే. కానీ చెన్నై పోలీసులు మాత్రం నిజమైన స్మగ్లింగ్ అనుకుని షాకయ్యారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా అశోక్ నగర్ వద్ద ఒక వ్యాన్‌ను ఆపగా, అందులో 10కి పైగా AK-47 రైఫిళ్లు కనిపించాయి. తీరా ఆరా తీస్తే, అవి లోకేష్ నటిస్తున్న ‘DC’ మూవీ కోసం వాడిన డమ్మీ ప్రాప్స్ అని తేలింది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.