నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్-4’కు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వచ్చారు. తాజాగా ఈ షోకు స్టార్ హీరో వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ ఈ నెల 27న రాత్రి 7 గంటలకు ఆహాలో టెలికాస్ట్ కానుంది. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వెంకీతో పాటు అనిల్ రావిపూడి ఈ షోకు వచ్చారు.