AP: ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రసన్నకుమార్ మాటలకు ఆగ్రహించి.. ఆయన ఇంటిపై వేమిరెడ్డి అభిమానులు దాడి చేసి ఉండొచ్చని తెలిపారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను వేమిరెడ్డి దంపతులు ఇప్పటికే కోరినట్లు వెల్లడించారు. వారిపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు.