NZB: తెలంగాణ యూనివర్సిటీలో బుధవారం కెమిస్ట్రీ విభాగం, హెటిరో సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నేడు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు HOD సాయిలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ పరిధిలో కెమిస్ట్రీ విభాగంలో పీజీ విద్యనభ్యసించిన విద్యార్థులు జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేసి ధృవ పత్రాలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.