KMR: పెద్ద కొడఫ్గల్, పిట్లం మండలాల్లో జొన్న పంట వివరాల నమోదులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ సీరియస్ అయ్యారు. అధికారులు వాస్తవానికి విరుద్ధంగా పంట వివరాలను నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. తక్షణమే విచారణ చేసి నివేదికను సమర్పించాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు.