GNTR: మాదక ద్రవ్యాలు, గంజాయి తీసుకోవడం వలన జీవితాలు నాశనం అవుతాయని మంగళగిరి SI వెంకట్ అన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ఫలితాలపై మంగళగిరిలోని ఓ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. అనంతరం కళాశాలలో తనిఖీ చేసి, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాలు ఎవరైనా విక్రయించినా, తీసుకున్నా తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.