NZB: ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ వినయ్‌కుమార్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. నియోజకవర్గంలోని రోడ్లు, బ్రిడ్జిల ప్రస్తుత పరిస్థితిని మంత్రికి వివరించారు. రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఈ విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.