NTR: జిల్లాలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. జిల్లాలో నేషనల్ హెల్త్ పథకం, వివిధ పీహెచ్సీలు, యూపీహెచ్సీల పరిధిలో 27 పోస్టులు ఉన్నట్లు తెలిపింది. అర్హులైన మహిళా అభ్యర్థులు 25 నుంచి 45లోపు వయస్సు కలిగి ఉండి, ఈ నెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.