ప్రకాశం: జరుగుమల్లి మండలం కె. బిట్రగుంటలోని కేజీబీవీ పాఠశాలలో గురువారం నిర్వహించిన తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యంతో పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. అనంతరం కొందరిని సన్మానించారు.