HNK: జిల్లా కేంద్రంలో గురువారం వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వైద్యురాలు రమ్య మాట్లాడుతూ.. వరుస వర్షాలతో వాతావరణంలో మార్పులు రావడంతో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. కాలనీ వాసులు స్వీయ పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో వైద్య సహాయం తీసుకోవాలని ఆమె సలహా ఇచ్చారు.