కోనసీమ: రావులపాలెం ఆర్టీసీ డిపో మేనేజర్‌గా YVN కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన GBV రమణ తుని డిపోకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో కుమార్ నియమితులయ్యారు. ఈయన ఇంతకుముందు కొవ్వూరు డిపో మేనేజర్‌గా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ యూనియన్ల నాయకులు, ఉద్యోగులు, గ్యారేజ్ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.