కృష్ణా: కృత్తివెన్ను పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాలలు, కాలేజీల సమీపాల్లోని పొగాకు ఉత్పత్తుల విక్రయ దుకాణాలపై ప్రత్యేక డ్రైవ్ గురువారం నిర్వహించారు. ఎస్పీ ఆర్. గంగాధరరావు ఆదేశాలతో ఎస్సై పైడిబాబు నేతృత్వంలో చేపట్టిన ఈ చర్యలో COTPA-2003 చట్ట ఉల్లంఘనలపై జరిమానాలు వేసారు. వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేసి, నిషేధ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.