KMM: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కూసుమంచి బీజేపీ మండల అధ్యక్షురాలు చందనబోయిన పుణ్యవతి అన్నారు. గురువారం మండల బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో మండల అధికారులను కలిసి వినతి పత్రం అందించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇటుక బట్టీలకు రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నారని పేర్కొన్నారు.