ఎమర్జెన్సీపై కాంగ్రెస్ MP శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా అభివర్ణించిన ఆయన, దాని నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలని అన్నారు. ఆ సమయంలో స్వేచ్ఛను అణచివేశారని, ఆ కాలం ప్రస్తుత భారతదేశంలా లేదని పేర్కొన్నారు. సంజయ్ గాంధీ జోక్యం వల్ల బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయని రాసుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే అప్రమత్తత ముఖ్యమని సూచించారు.