MBNR: మైనార్టీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో ప్రవేశాలకు ఈనెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ అధికారి శంకరాచారి బుధవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. 2025- 26 విద్యా సంవత్సరానికి ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. తెల్ల రేషన్ కార్డు, టీసీ, బోనఫైడ్ 1.5 లక్షల వార్షిక ఆదాయ ధ్రువపత్రం రెండు ఫోటోలు సమర్పించాలన్నారు.