JGL: గురు పౌర్ణమి సందర్భంగా కోరుట్ల పట్టణంలోని సాయిబాబా ఆలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. సాయిబాబాకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. సాయిబాబా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.