ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలోని హాజీపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం ”మెగా పేరెంట్స్ మరియు టీచర్స్” సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా టీడీపీ హనుమంతునిపాడు క్లస్టర్ ఇంఛార్జ్ గాయం తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.