NRML: జిల్లాలోని గాజులపేట, బర్కత్పుర, టీచర్స్ కాలనీ, యాహియ కాలనీలో అంతర్గత, ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి. మట్టి రోడ్లు ఉండటంతో వర్షం వస్తే కాలనీ వాసులకు నరకయాతన తప్పడం లేదు. పురపాలక సంఘం వారు తాత్కాలికంగా మరమ్మతులు చేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షం కురిస్తే నడవలేకపోతున్నామన్నారు. అధికారులు స్పందించాలని కోరారు.