BHPL: మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో మంగళవారం సాయంత్రం ఎస్సై తమాషారెడ్డి ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వాల్ కొటేషన్స్ ద్వారా యువతకు అవగాహన కల్పించారు. “మన ఊరు-మన పోలీస్” కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారిని నియమిస్తున్నామని, ప్రజల సమస్యలను తెలుసుకొని న్యాయం చేస్తామని ఎస్సై తెలిపారు.