RR: ఓటరు జాబితాలో తప్పుల సవరణ బాధ్యత బీఎల్వోలదని, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా జాబితాను సిద్ధం చేయాలని కేశంపేట తహసీల్దార్ ఆజం ఆలీ అన్నారు. మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన బీఎల్వోల శిక్షణ శిబిరంలో తహసీల్దార్ పాల్గొని మాట్లాడారు. ఎవరైనా రెండు చోట్ల ఓటును కలిగి ఉన్నట్లైతే అలాంటి వారిని గుర్తించి ఒకే ఓటు ఉండేలా చూడాలన్నారు.