VZM: రాజాం ఎక్సైజ్ సీఐ జై భీమ్ మంగళవారం వంగర మండలం కొట్టిశలో చేసిన ఆకస్మిక దాడులలో అక్రమంగా మద్యం అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో 29 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశామన్నారు. గత 6 నెలలలో 19 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి 177 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.