ASR: లక్షలాదిమంది విద్యార్థులతో అతిపెద్ద విద్యార్థి సంఘంగా 1949 జూలై 9న అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఆవిర్భవించిందని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ఏబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాడేరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. దశాబ్దాలుగా ఏబీవీపీ అనేక విద్యారంగ సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు.