ఆర్ఆర్ఆర్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.. ముఖ్యంగా హాలీవుడ్‌ను భారీ స్థాయిలో అట్రాక్ట్ చేసింది ఆర్ఆర్ఆర్. అందుకే ఆస్కార్ రేసులో నిలబెట్టేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఇటీవలె జపాన్‌లో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి తమ ఫ్యామిలీలతో కలిసి ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లారు.
ఇండియాలో ఎలా అయితే సందడి చేశారో.. అక్కడ కూడా అదే రేంజ్లో ప్రమోట్ చేశారు. దాంతో జపాన్‌లో కూడా ఆర్ఆర్ఆర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా ప్రమోషన్ కోసం విదేశాలకు వెళ్లనున్నాడని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్కు ముందు పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించింది పుష్ప మూవీ. ప్రపంచ వ్యాప్తంగా పుష్పకు భారీ క్రేజ్ వచ్చింది.
దాంతో ‘ఆర్ఆర్ఆర్’ లాగే పుష్పని కూడా ఇతర భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇంగ్లీష్, రష్యన్ సబ్ టైటిల్స్‌తో మాస్కో ఫిలిం ఫెస్టివల్లో పుష్ప మూవీని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ రావడంతో.. రష్యన్ భాషలో డబ్బింగ్ చేయించి భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్లో పుష్ప రష్యా వెర్షన్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్-సుకుమార్.. రష్యా వెళ్లనున్నారని సమాచారం. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.