మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్‌కు పెద్ద కండీషనే పెట్టినట్టు తెలుస్తోంది. అయినా రామ్ అందుకు సై అంటున్నాడట. ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ అందుకున్న రామ్.. ఆ తర్వాత ‘రెడ్’ సినిమాతో పర్వాలేదనిపించాడు. కానీ రీసెంట్గా లింగుసామి దర్శకత్వంలో.. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ది వారియర్’ మూవీతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దాంతో రామ్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. రామ్ కూడా అప్ కమింగ్ ప్రాజెక్ట్‌తో ఎలాగైనా హిట్ అందుకోని.. ఫ్యాన్స్‌కు కిక్ ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకోసం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ సినిమా కమిట్ అయ్యాడు.
శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో.. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా.. ఇటు రామ్, అటు బోయపాటికి ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కానుంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇక ఈ సినిమాను భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్లాన్ చేస్తున్నాడట బోయపాటి. అందుకోసం రామ్‌కు భారీగానే కండీషన్స్ పెడుతున్నాడట. ఈ సినిమాలో రామ్ డ్యూయెల్ రోల్లో కనిపించనున్నాడట. ఈ రెండు పాత్రల కోసం కొత్తగా మేకోవర్ అవుతున్నాడట రామ్. ఈ క్రమంలో ఓ రోల్ కోసం దాదాపు 11 కేజీల వరకు బరువు పెరగాలని సూచించాడట బోయపాటి. రామ్ కూడా అందుకు ఓకే చెప్పడమే కాదు.. ప్రస్తుతం బరువు పెరిగే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో బోయపాటి కోసం రామ్ ఎంత రిస్క్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. మరి బోయపాటి-రామ్‌కు ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్టార్డమ్ అందిస్తుందేమో చూడాలి.