Best Motivational Film | Movie Explained In Telugu
12 Fail: ఓపెన్ చేస్తే.. 1997 చంబల్ ప్రాంతంలోని బిల్గామ్ అనే గ్రామంలో మనోజ్ ది ఒక చిన్న కుటుంబం. 12 th పాస్ అవడానికి అతను చిట్టీలు ఏర్పాటు చేసుకుంటాడు. అదే సమయంలో అక్కడికి ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి మనోజ్ తండ్రి రాంబీర్ ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు అని ఉత్తరం ఇవ్వడానికి వస్తాడు. దాన్ని తీసుకొను అని రాంబీర్ అంటే నాకు ఇవ్వు అని రాంబీర్ తల్లి పోస్ట్ మ్యాన్ కు చెబుతుంది. అతను దగ్గరకి వెళ్లగానే అతని చేయిపట్టుకొని కమ్లేష్ ను గన్ తీసుకురా అని పిలిస్తుంది. నా కొడుకును ఉద్యోగం నుంచి తీసేస్తారా.. కాల్చిపడేస్తా అంటుంది. కట్ చేస్తే ఆఫీస్లో విత్తనాల పంపిణీ ఫైల్ పై ఎందుకు సంతకం చేయలేదని రాంబీర్ ను మేనేజర్ అడుగుతాడు. అవి నకిలీ విత్తనాలు అని నువ్వు, ఆ ఎమ్మెల్యే కలిసి ప్రజలను మోసం చేస్తున్నారు అని తన చెప్పుతీసుకొని కొడుతాడు. దాంతో మేనేజర్ రాంబీర్ సస్పెన్షన్ టైమ్ చేయమంటాడు. ఇంకో చెప్పుతో మళ్లీ కొడుతాడు రాంబీర్. ఆ విషయాన్ని రాంబీర్ తల్లికి పోస్ట్ మ్యాన్ చెప్తాడు. దీనిపై నేను కోర్టులో పోరాడుతా అని రాంబీర్ అంటాడు. తరువాత కమ్లేష్ కోపంతో గన్ ఫైర్ చేస్తాడు అది గాల్లో పేలుతుంది. మనోజ్ భయపడుతాడు. రాంబీర్ సస్పెండ్ అయినట్లు ఇంటికి నోటీసు అంటించి వెళ్తాడు. తరువాత మనోజ్ వాళ్ల నాన్నమ్మ వచ్చి ఆ నోటీసును చించేస్తుంది.
చదవండి:Aamir Khan Daughter: ఘనంగా అమీర్ ఖాన్ కూతురి పెళ్లి, డిఫరెంట్ కాస్ట్యూమ్ లో వరుడు
నెక్ట్స్ సీన్లో మనోజ్ ఫ్యామిలీ అన్నం తింటుంటారు. తన ఉద్యోగం గురించి హై కోర్టులో పోరుడుతా అని రాంబీర్ అంటాడు. మరీ ఇళ్లు ఎలా గడుస్తుంది అని తన భార్య అంటుంది. నన్ను ఫెంక్షన్ డబ్బులు మాత్రం అడగొద్దు నేను మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని రాంబీర్ తల్లి అంటుంది. నేను 12th పాస్ అయితే ఆఫీస్ బాయ్ గా ఉద్యోగం వస్తుంది నేను ఫ్యామిలీని చూసుకుంటా అని మనోజ్ అంటాడు.
తరువాత సీన్లో మనోజ్ ఎగ్జామ్ హాల్లో కూర్చొని చిట్టీలు బల్లపై పెట్టుకుంటాడు. అక్కడే ఉన్న ఇన్విజిలేటర్ చిట్టీలు బయటపడేయండి. అలా రాసినా కూడా మీరు పాస్ అవట్లేదు. ఈ సారీ ఆన్సర్స్ అన్నీ బోర్టు మీద రాస్తాను త్వరగా రాసుకోండి అని చెప్తాడు. స్టూడెంట్స్ అంతా ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతారు. అదే సమయంలో అక్కడికి డీఎస్పీ వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటాడు. ప్రిన్సిపల్ డీఎస్పీకి నమాస్కారం పెట్టి.. తన చాంబర్ కు తీసుకుపోతాడు. వీళ్లు ఇలా పాస్ ఏదో చిన్న చిన్న జాబ్ లు చేసుకుంటారు, లేదంటే దొంగలుగా, బందిపోట్లుగా మిగిలిపోతారు అని అంటాడు. అదే సమయంలో ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు అని డీఎస్పీకి ఫోన్ ఇస్తే దాన్ని పెట్టేస్తాడు. దాంతో ప్రిన్సిపల్ ఇది చంబల్ ఏరియా, బందీపోట్ల పిల్లలు కూడా ఇదే స్కూల్ లో ఉన్నారు. వాళ్లు గానీ ఫెయిల్ అయితే మీకే ప్రమాదం అని హెచ్చరిస్తాడు. అయినా డిఎస్పీ వినడు. కూర్చో అని చెప్పి లంచం ఇస్తాడు. డబ్బులు బయటపెట్టి ఫోటో తీసుకొని ప్రిన్సిపల్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు. ఈ సంవత్సరం పిల్లలు అందరూ 12th ఫెయిల్ అవుతారు.
నెక్ట్స్ సీన్లో రాంబీర్ సిటీకి వెళ్లడానికి అన్ని సిద్ధం చేసుకుంటాడు. మనోజ్ ఫెయిల్ అయ్యాడు. మీరు సిటీకి వెళ్తా అంటున్నారు మా గురించి ఎమన్నా ఆలోచించారా అని అంటుంది. నేను దేశం గురించి ఆలోచిస్తున్నా అని రాంబీర్ అంటాడు. మరీ డబ్బులు ఎలా అని అంటే ఎక్కడి నుంచి అయినా తెచ్చుకోవాలి కానీ నేను ఫెంక్షన్ డబ్బులు మాత్రం ఇవ్వను అని రాంబీర్ తల్లి అంటుంది. తరువాత రాంబీర్ తన తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతాడు. అదే సమయంలో అతని భార్య పరుగెత్తుకుంటు వెళ్లి పోరాడండి అని తనకు క్యారెజ్ ఇచ్చి కాళ్లకు దండం పెడుతుంది. రాంబీర్ వెళ్లిపోతాడు.
తరువాత సీన్లో మనోజ్, కమ్లేష్ డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ల అమ్మకు ఇస్తారు. ఇక నుంచి మన కష్టాలు తీరిపోతాయి, అన్నయ్య సర్వీస్ ఆటో నడుపుతున్నాడు నేను కండక్టర్ గా చేస్తున్నా అని సంతోషపడుతుంటాడు. వాళ్ల అమ్మ కూడా సంతోషపడుతుంది. కట్ చేస్తే ఆటోలో ప్యాసింజర్లను తీసుకొని వెళ్తుంటే దారీలో ఎమ్మెల్యే మనుషు అడ్డుపడుతారు. ఆయన బస్సు కాళీగా ఉందనీ, వాళ్ల ప్యాసింజర్లను తమ బండ్లో ఎక్కించమని గొడవ చేస్తారు. దాంతో కమ్లెష్ అతన్ని చెప్పుతో కొడుతాడు. తరువాత ప్యాసింజర్లను తీసుకొని వెళ్తుంటే పోలీసులు అన్నదమ్ములిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఎమ్మెల్యే మనుషులంటే లెక్కలేదా అని పోలీసులు అరుస్తుంటే.. ఎమ్మెల్యే చెంచాలు అయితే మేము ఎందుకు భయపడాలి అని కమ్లేష్ అంటాడు. దాంతో పోలీసు కమ్లెష్ కొడుతుంటాడు. అదే సమయంలో మనోజ్ మీరు ఇలానే చేస్తే మా తాతా గన్ తెచ్చి కాల్చేస్తా అని అంటాడు. అయితే గన్ తెచ్చి కాల్చు లేదంటే మీ అన్నను చంపేస్తా అని పోలీసు చెప్తాడు. దాంతో మనోజ్ బయటకు పరుగెత్తుకుంటూ వస్తాడు.
అలా పరుగెత్తుకుంటూ డీఎస్పీ దుష్యన్ సర్ ఇంటికి వెళ్తాడు. దుష్యన్ సర్ అని అరుస్తుంటాడు. అక్కడ గార్డ్ మనోజ్ ను ఆపుతాడు. పై నుంచి కుక్క అరుస్తుంది. దుష్యన్ వచ్చి ఏం జరిగిందంటే.. మా అన్నయ్యను అరెస్ట్ చేశారు. సర్వీస్ ఆటో పోలీసులు లాక్కున్నారు అని చెప్తాడు. రేపు పొద్దున వచ్చి కంప్లైంట్ ఇవ్వు అని దుష్యన్ వెళ్లిపోతాడు. దాంతో మనోజ్ అరుస్తాడు.. మాకు అవసరం వచ్చిందంటే ఇలా చేస్తారా.. మొన్న మీరు స్కూల్ కు రాకపోయింటే 12th పాస్ అయ్యి ఎదైనా జాబ్ చేసుకునే వాడిని, ఈ నైట్ మీరు రాకుంటే మా అన్నయ్యను చంపేస్తా అంటున్నారు అని అరుస్తాడు. దాంతో దుష్యన్ బయటకు వస్తాడు. కట్ చేస్తే స్టేషన్ కు జీపు వస్తుంది. అక్కడ డ్యూటీ ఎస్ఐ గమనించి సాక్షీని కర్చో అని చెప్పి తన డ్రెస్ సర్దుకుంటాడు. దుషన్ లోపలికి వచ్చి ఏం జరిగిందంటే.. ఆటోలో మత్తుపదార్థాలు తీసుకెళ్తున్నారు. ఏంటని అడిగితే నా కాలుమీదనుంచి ఆటో వెళ్లనిచ్చారు అని చెప్తాడు. దాంతో దుష్యన్ ఇదేనా అని కొడుతాడు. తరువాత కమ్లెష్ ను బయటకు తీసుకొచ్చి ఇద్దరిని వెళ్లిపోండి అని చెప్తాడు.
ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే దుష్యన్ సర్ జీపు వస్తుంది. వాళ్లిద్దిరిని ఇంటి వద్ద దిగబెడుతా అని ఎక్కమంటాడు. మనోజ్ దుష్యన్ నే చూస్తుంటాడు. నీలో చాలా ధైర్యం ఉందని దుష్యన్ అంటాడు. తరువాత వాళ్ల నాన్న కూడా నిజాయితీగా వర్క్ చేసేవాడని, దాని వలన ఎక్కువగా సస్పెండ్ అయ్యేవాడని మనోజ్ చెప్తాడు. కానీ సరైన మనిషి చేతిలో అధికారం ఉంటే ఎలా ఉంటుందో ఈరోజు చూశాను అని చెప్తాడు. తరువాత ఇళ్లు వచ్చిందని దిగుతారు. దుష్యన్ వెళ్లబోతుంటే.. నేను మీలా అవ్వాలంటే ఏం చేయాలి అని మనోజ్ అడుగుతాడు. దాంతో నిజాయితీగా ఉంటే సరిపోతుంది అని చెప్తాడు. తరువాత ఖర్చుగురించి ఆలోచించకు నువ్వు బాగా చదువుకో అని తన అన్న అంటాడు.
దుష్యన్ సర్ సస్పెండ్ అవుతాడు. మళ్లీ స్కూల్ లో చీటింగ్ జరుగుతుంది. ఈ సారీ మనోజ్ మాత్రం చీటింగ్ చేయడు. సొంతంగా చదువుకొని రాస్తాడు. తరువాత బీఏ పాస్ అవుతాడు. ఆ సమయంలో తన ఖర్చుల కోసం ఇంట్లో ఉన్న ఆవులను వాల్ల అమ్మ అమ్మేస్తుంది. ఒక రోజు మనోజ్ ను వాళ్ల నాన్న పిలిచి తాను దాచుకున్న ఫెంక్షన్ డబ్బులను ఇస్తుంది. అది చూసి మనోష్ ఎమోషనల్ అవుతాడు. నువ్వు పోలీసులు ఆఫీసర్ అయితే మీ తాతా ఆత్మ సంతోషపడుతాడు అని చెబుతుంది. తరువాత పై చదువుల కోసం గ్యాలియర్ వెళ్తాడు. బస్సు ఎక్కితే మనోజ్ కు ఒక మహిళ చోటు ఇస్తుంది. తనతో మాట్లాడుతూ అలానే నిద్రపోతాడు. కట్ చేస్తే గ్యాలియర్ వచ్చిందని కండక్టర్ అరుస్తుంటాడు. మనోజ్ బ్యాగ్ కనిపించదు. దాని కోసం వెతుకుతుంటే నీ పక్కన కూర్చున్నామే తనదని తనతోపాటే తీసుకెళ్లింది అని చెప్తాడు. మనోజ్ కిందకు దిగి వెతుకుతుంటే తాను మూడు గంటల ముందే దిగిపోయింది అని చెప్తాడు. మనోజ్ కు ఏం చేయాలో అర్థం కాదు.
కోచింగ్ సెంటర్ ముందు కూర్చొని ఉంటాడు. మార్నింగ్ కోచింగ్ సెంటర్ ఓపెన్ చేస్తే మరో మూడు సంవత్సరాల వరకు ఎలాంటి రిక్రూట్ మెంట్ లేదు అని కోచింగ్ ఆపేశారు అని చెప్తాడు. దాంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కూరుకుపోతాడు. తరువాత ఒక రోజు ఆకలిని భరించలేక హోటల్ కు వెళ్లి పనిచేసే పెడుతాను ప్లేట్ భోజనం ఇప్పించండి అని అడుగుతాడు. ప్రీతమ్ అనే వ్యక్తి ముందు కూర్చొని ఆకలిగా ఉన్నాడు కాబట్టి తొందరగా తినేశాడు మనోజ్. తరువాత ఏదైనా పనిచెప్పండి అంటే హోటల్ మేనేజర్ వద్దు అంటాడు. లేదు నేను పనిచేసి తీరాల్సిందే అని మనోజ్ అంటే నేను నీ డబ్బులు కడుతాలే అని ప్రీతమ్ అంటాడు. నువ్వెందుకు నా డబ్బులు కడుతావు అని మనోజ్ అంటాడు. నేనే కూడా కోచింగ్ తీసుకోవడానికే వచ్చాను, ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్తున్నాను అని ప్రీతమ్ చెప్తాడు. నాకు ఒక టికెట్ కొనిపెట్టవా నీకు ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తాను అని అంటాడు. అక్కడ ఎక్కడ ఉంటావు అని అడిగితే ఎలాగోలా ఉంటా నన్ను తీసుకెళ్లు అంటాడు. కట్ చేస్తే ఇద్దరు ఢిల్లీకి వెళ్తారు.
ఢిల్లీలో యూపీఎస్ ఎగ్జామ్స్, సివిల్స్ ప్రీపేర్ అయ్యేవాళ్లు చాలా మంది ఉంటారు. ఇంతమందిని చూస్తే భయం వేస్తుందని ప్రీతమ్ తో అంటాడు మనోజ్. అదే సమయంలో మీ లాంటి వారికోసం గౌరి అన్న ఉన్నాడు అని అతని దగ్గరకు తీసుకెళ్తాడు టోటర్. అక్కడ చాలా మందికి గౌరి క్లాసెస్ తీసుకుంటూ ఉంటాడు. వీళ్లను పరిచయం చేస్తే ఐపీఎస్ ఎగ్జామ్ అనేది వైకుంఠపాళి ఆటలాంటిది అని చెప్తాడు. ప్రిలీమ్స్, మెయిన్స్, ఇంటర్వూ ఉంటాయి అని వివరంగా చెప్తాడు. తరువాత మనోజ్ కు డబ్బులు లేవని ఏదైనా పని ఉంటే చూసి పెట్టండి అని చెప్తాడు. టైలెట్స్ కడిగే జాబ్ ఉంది చేస్తావా అని అంటే చెస్తా అంటాడు. కట్ చేస్తే ఒక లైబ్రెరీలో టాయిలెట్స్, బుక్ ర్యాక్స్ శుభ్రంగా ఉంచాలి దాని కోసం 250 రూపాయాలతో పాటు గదీ కూడా ఇస్తాను అని ఒక అతను చెప్తాడు. దానికి మనోజ్ సంతోషపడుతాడు.
ఉద్యోగం వచ్చిన సందర్భంగా ప్రీతం పార్టీ ఇస్తాడు. మనోజ్ తాగను అంటాడు. తరువాత ప్రీతమ్ వాల్ల నాన్న ఓ లంచగొండి గవర్నమెంట్ ఆఫీసర్ అని, తనను కూడా వాళ్ల నాన్న అలాగే చూడాలనుకుంటున్నాడని చెప్తాడు. కానీ తనకు టీవీలో కనిపించడం అంటే ప్యాషన్ అని చెప్తాడు. వాళ్ల అమ్మకు చెప్తాదమన్నా తాను బతికి లేదని ఎమోషనల్ అవుతాడు. తరువాత సీన్లో రిజల్ట్ వస్తుంది. గౌరి తన పేరు కోసం బోర్డు వెతుకుతాడు. కానీ తన పేరు ఎంతకు కనిపించదు. ఈ అటెప్ట్ లో కూడా గౌరి సెలెక్ట్ అవలేదు. అదే సమయంలో మరో టాపర్ దగ్గరకు ప్రీతం వెల్తాడు. మనోజ్ మాత్రం గౌరితోటే ఉంటాడు. ఇప్పుడు గౌరి అన్న ఏం చేస్తాడో అని టోటర్ భయపడుతుంటాడు. కట్ చేస్తే రిస్టాట్ అనే టీ స్టాల్ పెడుతాడు. అక్కడే స్టూడెంట్స్ కు ఫ్రీగా కోచింగ్ ఇస్తాడు.
అక్కడే చాలా మంది పూర్ స్టూడెంట్స్ కు కోచింగ్ ఇస్తుంటాడు. ప్రిలీమ్స్ ఎగ్జామ్ వస్తుంది. మనోజ్ కూడా రాస్తాడు. కానీ ఫస్ట్ అటప్ట్ లో ఫెయిల్ అవుతాడు. చాలా బాధపడుతాడు. అక్కడికి గౌరి వచ్చి రిస్టార్ట్ అవు అని మోటివేట్ చేస్తాడు. తరువాత మళ్లీ గౌరి కోచింగ్ ఇస్తాడు. ఒక రోజు డీప్ మోహన్ ప్రీతమ్ ఫ్రెండ్స్ కు మోటివేట్ చేస్తుంటే అక్కడికి టీ తీసుకొని మనోజ్ వస్తాడు. డీప్ మోహన్ చోటు అని పిలవగానే.. అతను చాయ్ బాయ్ కాదు తన ఫ్రెండ్ అని ప్రీతమ్ చెప్తాడు. తాను కూడా ఐపీఎస్ స్టూడెంట్ అని చెప్తాడు. దాంతో డీప్ మోహన్ సారీ చెప్పి ఎదైనా అవసరం ఉంటే అడుగు అని అంటాడు. మరో సీన్లో ప్రీతమ్ గౌరి టీ స్టాల్ కూర్చొని పూర్ పీపుల్స్ అందరికీ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వలని ఉంటుంది కానీ ఎప్పటికి అవ్వలేరు అని మాట్లాడుకుంటారు. అదే సమయంలో గౌరి ఇలాంటి విద్యార్థుల గురించి చెప్తాడు. వీళ్లకు డబ్బులు లేకపోయినా ఏదో సాధించాలనే లక్ష్యంతో ఇక్కడికి వస్తారు. బాత్రుంలు కడుగుతూ కూడా వాళ్లు కాన్సంట్రెషన్ పక్క దారి పట్టనివ్వరు అని చెప్తాడు. తరువాత ప్రిలిమ్స్ రాయడానికి మనోజ్ ను వెళ్తాడు.
తరువాత రిజల్ట్ వస్తుంది. మనోజ్ తన రిజల్ట్ చూసుకుంటాడు. ప్రీతం తన తండ్రితో ఈ సారీ మిస్ అయిందని, నెక్ట్స్ టైమ్ పక్క పాస్ అవుతానని చెప్తాడు. అదే సమయంలో మనోజ్ బయటకు వచ్చి అమ్మకు ఫోన్ చేసి పాస్ అయ్యాను అని చెప్పాలి ఫోన్ ఇవ్వు అంటాడు. దాంతో గౌరి తనను ఎత్తుకుంటాడు. ప్రీతమ్ కూడా సంతోషపడుతాడు. ఓ మంచి కోచింగ్ సెంటర్ చూసుకొని జాయిన్ అవమని గౌరి సలహా ఇస్తాడు. కట్ చేస్తే ఓ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవడానికి వెళ్తాడు. వాళ్లతో బేరాలు ఆడుతుంటే వేరే స్టూడెంట్ వస్తుంది. తనును ఫోటోలు తగిలించమని చెప్తుంది. అదే సమయంలో డీప్ మోహన్ ఫోటో ఉంటుంది. తాను ఇక్కడ చదవలేదని చెప్తాడు మనోజ్. దాంతో ఆ అమ్మాయి లోపలికి వచ్చి అది అడ్వర్ టైజ్మెంట్.. ఆ ఫోటో కోసం లక్షన్నర ఇచ్చాము, పని చూస్కో అని చెప్పి మళ్లీ వాళ్లతో మాట్లాడుతుంది. తరువాత డీప్ మోహన్ ఇక్కడ చదవలేదా.. అతని అడ్మిషన్ చూపించండి అని అమ్మాయి ఫాదర్ అడుగుతాడు. అదే సమయంలో మనోజ్ వచ్చి అతను ఇక్కడ చదువలేదు నాకు బాగా తెలుసు అని నా అడ్మిషన్ కాన్సిల్ చేయండి అని డబ్బలు తీసుకుంటాడు. తరువాత అమ్మాయితో మనం ఒక మంచి కోచింగ్ సెంటర్ ను వెతికి పట్టుకుందామని చెప్తాడు. ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, సెల్ఫ్ స్టడీ అని చెప్పగానే అమ్మాయి ఆశ్చర్యపడి పేరు అడుగుతుంది. తరువాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మనోజ్ తో ఫస్ట్ టైమ్ ఒక అమ్మాయి తన పేరు అడిగినందుకు తాను సంతోషంగా ఉంటాడు.
తనను వెతుకుతూ లైబ్రరీకి వస్తుంది శ్రద్ద. తాను ఎరోనాటికల్ ఇంజనీరింగ్ బుక్ చూస్తుంటే మీరు ఇంజనీరింగ్ చేశారా, అందుకే ప్రిలిమ్స్ క్లియర్ చేశారు అని పొగుడుతుంది. మనోజ్ నిజం చెప్పకుండా దాచేస్తాడు. తరువాత తాను ఓ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినట్లు చెప్తుంది. ఇద్దరు మాట్లాడుకుంటుంటే లైబ్రేరియన్ మనోజ్ పై అరుస్తాడు. తాను మార్నింగ్ పని చేస్తాను, రాత్రిళ్లు చదువుకుంటాను అని శ్రద్ధకు చెప్తాడు. కట్ చేస్తే ఇద్దరు కలిసి కొచింగ్ సెంటర్లో మాట్లాడుకుంటారు. అదే సమయంలో అక్కడికి లెక్చరర్ వస్తాడు. ఐపీఎస్ అవడం తెలికే కానీ వచ్చాక నిజాయితీగా పని చేయడం చాలా కష్టం అని చెప్తాడు. తరువాత మనోజ్ ను పిలుస్తాడు. తాను భయపడుతూ స్టేజ్ పైకి వెళ్తాడు. టెర్రరిజమ్ గురించి చాలా బాగా రాశాడు అని రెండు చాక్లెట్స్ ఇస్తాడు. అందరూ క్లాప్స్ కొడుతారు. అందులో ఒకటి శ్రద్దకు ఇస్తాడు. తరువాత ఇంకో చాక్లెట్ కూడా ఇస్తాడు.
తరువాత సీన్లో ఫ్రెండ్స్ తో ట్రూత్ ఆర్ డేర్ ఆడుతారు. ప్రీతం కవిత్వం చెబుతాడు. నెక్ట్స్ శ్రద్దకు టాస్క్ వస్తుంది. తాను సాంగ్ పాడుతుంది. అబ్దుల్ కలాం బుక్ తీసుకోవాలని ఆశపడుతాడు దానిమీద రేటు చూసి బుక్ అక్కడే పెట్టేస్తాడు. అది శ్రద్ద గమనిస్తుంది. తరువాత సాంగ్ స్టార్ట్ అవుతుంది. తాను టీకోసం వెళ్తాడు. తరువాత తనకు బుక్ ఇస్తుంది. ఇద్దరూ మాట్లాడుకుంటారు. నెక్ట్స్ క్లాస్ లో రాకెట్ సైన్స్ గురించి సర్ చెప్తుంటే.. మనోజ్ ఎరోనాటికల్ ఇంజనీర్ అని తాను అన్సర్ చెప్తాడు అని అంటుంది. అప్పుడు మనోజ్ తాను తెలుగులో బీఏ చదివాడని నిజం చెప్తేస్తాడు. దాంతో శ్రద్ద ఫీల్ అవుతుంది. మనోజ్ కూడా ఫీల్ అవుతాడు.
నెక్ట్స్ సీన్లో తన లైబ్రెరీలో స్క్రాప్ అమ్మిన డబ్బుల్లో తేడా ఉందని వాళ్ల సర్ అడుగుతాడు. అంతే వచ్చింది తాను ఏది దాచుకోలేదని అంటాడు. ఇప్పుడే ఇలా ఉన్నావు అంటే రేపు ఐపీఎస్ అయిన తరువాత ఎలా ఉంటావో.. అని నీ బాబు కూడా నీలానే దొంగ అయి ఉంటాడు అని అంటాడు. దాంతో మనోజ్ అతని మీదికి చెప్పు లేపుతాడు. తరువాత అక్కడినుంచి వెళ్లిపోతాడు. అతన్ని వెతుక్కుంటూ ప్రీతమ్ వస్తాడు. ఒక పిండిమర ఉండే చోట చదువుకుంటుంటాడు. శ్రద్ద ప్రిలిమ్స్ కు వాళ్ల ఊరు వెళ్తుంది. వెళ్లి సారీ చెప్పు అంటే మెయిన్స్ రాసి చెప్తా అంటాడు. తరువాత ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. టెర్రిరిజమ్ గురించి ఎస్ఐ ఆన్సర్ బాగా రాశాను అని చెప్తాడు. అయితే తనకు ఇంగ్లీష్ సరిగా రాకపోవడం వలన టూరిజాన్ని టెర్రరిజమ్ అని తప్పుగా అర్థం చేసుకుంటాడు. దాంతో మనోజ్ ఏడుస్తాడు.
తరువాత శ్రద్ద కోసం మసూరీలో వాళ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడ తాను ఉండదు. ఫోన్లో మాట్లాడుతాడు. ఐలవ్ యూ అని చెప్తాడు. తాను మనోజ్ ను ఢిల్లీ వెళ్లిపో అని అంటుంది. తరువాత మనోజ్ వాళ్ల ఊరుకు వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్ కలుస్తాడు. తరువాత వాళ్ల చెల్లెలు వస్తుంది. నాన్నమ్మ ఎక్కడ అని అడిగితే తాను ఏడుస్తుంది. డోర్ తీస్తాడు. మంచం మీద వాళ్ల నాన్నమ్మ ఉండదు. నాన్నమ్మ చనిపోయిన విషయాన్ని తనకు ఎందుకు చెప్పలేదని వాల్ల అమ్మతో గొడవ పడుతాడు. నాన్నమ్మే చెప్పొద్దన్నది అని అంటుంది. తరువాత మనోజ్ జుట్టుకు నూనే పెడుతూ మేము చాలా బాగున్నాము అని అంటుంది. మనోజ్ ఎమోషనల్ అయి ఏడుస్తుంటాడు. ఈ సారి వచ్చేప్పుడు డ్రెస్ లోనే వస్తావు కదా అని అంటుంది. ఇద్దరు ఏడుస్తుంటారు.
నెక్ట్స్ సీన్లో మనోజ్ చదువుకునే చోటుకు వాళ్ల నాన్న వస్తాడు. నిజాయితీగా బతికి ప్రయోజనం లేదని, తిరిగి ఊరుకు వెళ్దాం అని చెప్తూ ఏడుస్తాడు. ఓటమిని ఒప్పుకోకూడదు అని వాల్ల నాన్న చెప్పిన మాటలను గుర్తు చేస్తాడు. ఇద్దరు ఎమోషనల్ అవుతారు. ఆ రోజు నుంచి 15 గంటలు పనిచేసి, 6 గంటలు చదువుకొని, 3 గంటలు మాత్రమే నిద్రపోయేవాడు. అదే సమయంలో శ్రద్ద వస్తుంది. తరువాత మనోజ్ తో మాట్లాడుతుంది. మనోజ్ మాట్లాడడానికి ఇష్టపడడు. తనకు చాలా బాధ్యతలు ఉన్నాయని అక్కడి నుంచి వెల్లిపోతాడు. తరువాత ప్రిలిమ్స్ రిజల్ట్స్ వస్తాయి. మళ్లీ ప్రీతం పాండ్య ఫెయిల్ అయినట్లు వాళ్ల నాన్నతో చెప్తాడు. అదే సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ థాన్య పాస్ అయినట్లు చెబితే పాండ్య అరుస్తాడు. తాను వెళ్లిపోతుంది. అదే సమయంలో శ్రద్ద వస్తుంది. మనోజ్ ఎక్కడ రిజల్ట్ కూడా చూసుకోవడానికి రాలేదు అని అతను ఉన్న చోటుకు వెళ్తుంది. అక్కడ మనోజ్ పిండి మరలో పనిచేస్తాడు. శ్రద్దను చూసి తనతో మాట్లాడుతాడు. ఇలాంటి చోట నువ్వు మెయిన్స్ చదవలేవు, నా దగ్గర డబ్బులు ఉన్నావి అంటుంది. తనకు చాలా బాధ్యతలు ఉన్నాయని ఇక్కడనుంచే మెయిన్స్ క్లియర్ చేస్తా అంటాడు.
నెక్ట్స్ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. మళ్లీ మనోజ్ ఫెయిల్ అవుతాడు. అదే సమయంలో రిస్టార్ట్ టీ స్టాల్ బయట మనోజ్ ను శ్రద్ద ఓదారుస్తుంది. పాండ్య ఫ్రెండ్ మెయిన్స్ క్లియర్ అయిండని పార్టీ చేసుకొని వస్తారు. అక్కడ మనోజ్ ను చూసి అమ్మాయిలు ఫెయిల్యూర్స్ తో ఉండరు. నన్ను వదిలి థాన్య వెళ్లిపోయింది కదా అలానే వెళ్లిపోతారు అని అంటాడు. దాంతో శ్రద్ద ఏడుస్తూ అక్కడినుంచి వెళ్లిపోతుంది. మనోజ్ వెనుకాలే వెళ్లి ఏదో ఎక్స్ ప్లైన్ చేస్తుంటే.. నేను ఐ లవ్ యూ చెప్తే ప్రపంచాన్ని మార్చేస్తా అన్నావ్ గా అని, ఐలవ్ యూ చెప్తుంది. మనోజ్ అక్కడి నుంచి పరుగెడుతాడు. డీప్ మోహన్ దగ్గరకు వెళ్తాడు. అతనితో మాట్లాడాలి అంటాడు. ప్రిలిమ్స్ పాస్ అవుతున్నాను కానీ మెయిన్స్ పాస్ అవడం లేదని అంటాడు. దానికి మనోజ్ శర్మ అనే టాపిక్ మీద 200 వర్డ్స్ ఎనిమిది నిమిషాల్లో రాయమంటాడు. తను చాలా ఈజీ అనుకొని స్టార్ట్ చేస్తాడు. కానీ రాయలేకపోతాడు. ఐపీఎస్ నీ వల్ల కాదు అని డీప్ మోహన్ అంటాడు.
నెక్ట్స్ సీన్లో ఇలానే టీ స్టాల్ దగ్గర, పిండి మర దగ్గర పనిచేస్తే నీ వల్ల కాదని అంటాడు గౌరి. ఈ రోజు నుంచి అక్కడ పని మానేసి, నా రూమ్ లో చదువుకో అని, ఇంటికి నేను డబ్బులు పంపిస్తా అని చెప్తాడు. అలా ఎందుకు అంటే అప్పుగా అనుకో అని కాదంటే కొడుతా అని చెప్తాడు. ఇది నీ ఒక్కడి విజయమే కాదు, నువ్వు గెలిస్తే మనలాంటి వాళ్లెందరికో ఇన్స్ పైర్ అవుతావు అని చెప్తాడు. మనోజ్ ఒక రూమ్ లోకి షిప్ట్ అయి చదువుకుంటాడు. అదే సమయంలో శ్రద్ద వచ్చి స్టాప్ వాచ్ ఇస్తుంది. తరువాత సిరీయస్ గా చదువుకుంటాడు. అదే సమయంలో శ్రద్ద లాస్ట్ టెన్ ఇయర్స్ పేపర్స్ ఇచ్చి తాను మెయిన్స్ కోసం వెళ్తున్నట్లు చెప్పి హగ్ ఇస్తుంది. తరువాత మనోజ్ మళ్లీ చదువుతుంటాడు. గౌరి వచ్చి శ్రద్ద మెయిన్స్ క్లియర్ అయినట్లు చెప్తాడు. మనోజ్ సంతోషంగా ఉంటాడు. తరువాత చదువుతుంటే కరెంట్ పోతుంది. విధీ లైట్స్ కింద చదువుకుంటుంటే టోటర్ వచ్చి శ్రద్దకు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చినట్లు చెప్తాడు. తాను సంతోషపడుతాడు. తరువాత మనోజ్ మెయిన్స్ ఎగ్జామ్స్ పూర్తి అవుతుంది. రిజల్ట్ వస్తుంది. తరువాత ప్రీతం మళ్లీ ఫెయిల్ అయినట్లు వాల్ల నాన్నతో చెప్తుంటే శ్రద్దకు ఫోన్ చేయాలి అంటాడు మనోజ్. దాంతో ప్రీతం ఫ్రస్టేషన్ లో మాట్లాడుతాడు. తరువాత వాల్ల పేరెంట్స్ మాట్లాడుతాడు. తాను మెయిన్స్ క్లియర్ అయినట్లు చెప్తాడు.
తరువాత శ్రద్దకు కాల్ చేస్తే వాళ్ల అమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి శ్రద్ద లేదని చెప్తుంది. శ్రద్ద ఫోన్ కోసం మనోజ్ వెయిట్ చేస్తుంటాడు. శ్రద్ద ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్తుంది. వాళ్ల నాన్నకు ఎవరో ఫోన్ చేసి మనం లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నామని చెప్పాడట దాన్ని నమ్ముతున్నాడని చెప్తుంది. తరువాత ప్రీతం గుర్తుకు వచ్చి అతనికి కాల్ చేస్తే అతడు పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు తెలుసుకొని వెళ్తాడు. అక్కడి నుంచి తన ఫ్రెండ్ ను విడిపించి ఫోన్ చెక్ చేస్తే తానే చేసినట్లు నెంబర్ చేస్తాడు. దాంతో ఇంకోసారీ నీ మొఖం చూపించకు అని చెప్పి వెళ్లిపోతాడు.
తరువాత శ్రద్ద ఇంట్లో.. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా అని వాళ్ల నాన్నతో అంటుంది. నేను అనుకుంటే ఇప్పుడు ఢిల్లీ వెల్లగలను అని కానీ నీ ట్రస్ట్ ని ఎప్పటికి బ్రేక్ చేయలేను అంటుంది. మరో సీన్లో ఇంటర్వూ కోసం రెడీ అవుతుంటే శ్రద్ద వస్తుంది. ఇద్దరు హగ్ చేసుకుంటారు. తరువాత ఎయిర్ కట్ చేయించుకొని ఇంటర్వూకు వెళ్లె ముందు ప్రీతంను కలువడానికి ఇంటికి వెళ్తాడు. దాంతో ప్రీతం చాలా ఎమోషనల్ అవుతాడు. తరువాత మీ నాన్నకు ఫోన్ చేసి చెప్పింది నేనే అంటాడు ప్రీతం. దానికి పర్లేదు అంటుంది శ్రద్ద. కార్లో వెళుతూ తనకు ఒక లెటర్ ఇస్తుంది. ఒంటిరిగా ఉన్నప్పుడు చదువు అంటుంది. తరువాత ఇంటర్వూకి అటెండ్ అవుతారు.
అక్కడ మనోజ్ నేమ్ పలిచినప్పుడు ఏదో ఆలోచించుకుంటూ ఉంటాడు. తరువాత వెళితే 12th లో ఫెయిల్ అయ్యావా అని అంటే అవును అంటాడు. అక్కడ ఉండే ప్యూన్ అలా ఫెయిల్ అయినా అని చెప్పకు, మీ తాతా పోయాడు అని అబద్దం చెప్పు అంటాడు. తరువాత ఇంటర్వూలో కూర్చుంటాడు. నువ్వు 12th లో ఫెయిల్ అయ్యావా అంటే అవును అంటాడు. మా ఊరికి కొత్త డీఎస్పీ దుష్యన్ సర్ వచ్చి చీటింగ్ ఆపేశారు అని చెప్తాడు. దాంతో ఇంటర్వూ ఐపోయింది నువ్వు వెళ్లిపో అంటాడు. మనోజ్ వెళ్తుంటే 2 నిమిషాలు బయట వెయిట్ చేయండి అని మేడమ్ అంటుంది. మనోజ్ బయటకు వచ్చి తన సూట్ తీస్తాడు. అందులో లెటర్ ఉంటుంది.
మనోజ్ నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయినా, పిండి మరలో పనిచేసినా నేను మాత్రం నీతోనే ఉంటా అని రాస్తుంది. అదే సమయంలో అతన్ని మళ్లీ లోనికి పిలుస్తారు. ఫెయిల్ ఎందుకయ్యావు అంటే ఆ సంవత్సరం మా స్కూల్లో చీటింగ్ జరగలేదు అని వాళ్ల స్కూల్ పరిస్థిని గురించి చెప్తాడు. తాను నిజాయితీగా పాస్ అయినట్లు చెప్తాడు. తనకు అవకాశం ఉంటే చీటింగ్ లేని వాతవరణాన్ని సృష్టిస్తాను అని అంటాడు. లంచం తీసుకోను తీసుకోనివ్వను అని చెప్తాడు. ఐపీఎస్ సెలెక్ట్ అవకపోతే ఏంటి పరిస్థితి అంటే నేను ఓటమిని ఒప్పుకోను, యుద్దాన్ని ఆపను అని చెప్తాడు. తాను సూర్యడిలా ప్రకాశించడం కన్నా… ఒక వీధి లైట్ లా నలుగురికి ఉపయోగపడుతానని చెప్తాడు. దాంతో ఇంటర్వూ ముగిసింది అని హెడ్ చెప్తాడు. మనోజ్ వెళ్లిపోతుంటే వేస్ట్ ఆఫ్ టైమ్ అని అంటాడు. కట్ చేస్తే రిజల్ట్ డే.. మనోజ్ తాను సెలెక్ట్ కాను, ఆరోజు సర్ వేస్ట్ ఆఫ్ టైమ్ అని అన్నాడు అని ఎంత చెప్తున్న శ్రద్ద రిజల్ట్ చూడడానికి వెళ్తుంది.
ట్రైనింగ్ అయితే తాను చాలా విషయాలు నేర్చుకుంటాడు అని వాళ్లు మాట్లాడుకొని మనోజ్ ను సెలెక్ట్ చేస్తారు. తాను సెలెక్ట్ అయినట్లు శ్రద్ద చెప్తుంది. మనోజ్ ఏడుస్తాడు. అక్కడికి గౌరి, టోటర్, ప్రీతం పాండ్య వస్తారు. డ్రెస్ తీసుకొని వస్తారు. పాండ్య లైవ్ కెమెరా పెడుతాడు. కట్ చేస్తే ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి తాను ఐపీఎస్ కు సెలెక్ట్ అయినట్లు చెప్తాడు. వాళ్లనాన్న మాట్లాడి ఐపీఎస్ తండ్రితో పెట్టుకుంటాడా అని మేనేజర్ చౌహాన్ దగ్గరకు వెళ్తాడు. మనోజ్ అమ్మ మాట్లాడుతూ సంతోషంగా ఏడుస్తుంది. అక్కడికి కోచింగ్ సెంటర్ అవిడా డబ్బులు ఇస్తే తను వద్దని చెప్తాడు. కట్ చేస్తే మనోజ్ ఆఫీసర్ అయిన తరువాత డీసీపీ దుష్యన్ దగ్గరకు వెళితే అతను సెల్యూట్ చేస్తాడు. తన ఫస్ట్ వెడ్డింగ్ కార్డు అని ఇస్తాడు. తాను అలా చూస్తుంటే నన్ను గుర్తుపట్టలేదా సర్ అని చంబల్ కుర్రాడిని అని చెప్తాడు. దాంతో దుష్యన్ సెల్యూట్ చేస్తాడు. తరువాత హగ్ చేసుకుంటాడు. చంబల్ గ్రామంలో మనోజ్, శ్రద్దల పెళ్లి జరుగుంది. దీన్ని ప్రీతం రికార్డు చేస్తాడు. తరువాత ఒరిజినల్ మనోజ్ కుమార్ శర్మ, శ్రద్దల వెడ్డింగ్ ఫోటోలను చూపిస్తారు. ఇదే 12th ఫెయిల్ స్టోరీ.