Falimy Movie Explained: ఓపెన్ చేస్తే జనార్దన్ బస్సులో రైల్వేస్టేషన్ కు వెళ్తాడు. కాశి టికెట్ తీసుకుంటాడు. స్టేషన్లో ట్రైన్ ఎక్కుదామని వెళ్తుంటే అక్కడ తన మనువడు అభి కనిపిస్తాడు. అభి నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తాడు. కానీ అతను దగ్గరకు వచ్చి ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఇలా వెళ్లిపోవడం ఏంటి తాతా, ఇది మూడోసారి. ఎక్కడ అని వెతకాలి, కాశికి పోవాలంటే ఇలా చెప్పచేయకుండా పారిపోవాలా అని తన తాతాను ఆటోలో తీసుకెళ్తాడు మనువడు అభి. అక్కడ నుంచి ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్న వాళ్ల అమ్మ ప్రేమ దగ్గరకు తీసుకెళ్లి ఆటోకు డబ్బులు అని చెప్పి డబ్బులు తీసుకుంటాడు. ఆటో ఛార్జీ కన్న ఎక్కువ ఉన్నాయిరా అని వాళ్ల అమ్మ అంటే పర్లేదు నాకు ఖర్చులు ఉంటాయి అనుకుంటూ తాతాను తీసుకెళ్తాడు. నెక్ట్స్ సీన్లో అనుప్ డబ్బింగ్ చెబుతుంటే అతనికి అభి కాల్ చేసి ఆటోలో తాతాను తీసుకొని స్టూడియోకు వెళ్తాడు. తాతా లగేజ్ పెట్టుకున్నాడు మళ్లీ కాశికి వెళ్తున్నాడా అంటే.. అలా వెళ్తేనే స్టేషన్ లో పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చా అని చెప్తాడు. ఇక్కడికెందుకు అని అన్న అడిగితే ఆటో డబ్బులు ఇవ్వాలి కాదా అని అతన్ని దగ్గర తీసుకుంటాడు. నెక్ట్స్ ఆటోలో తాతాను ఇంటికి తీసుకెళ్లి ఆటో డ్రైవర్ తో బేరం ఆడీ తాతా దగ్గర డబ్బులు లాక్కొని ఆటో అతనికి ఇచ్చి పంపిస్తాడు. మిగిలిన డబ్బులు తన జేబులో పెట్టుకుంటాడు. ఇంట్లో టీవీ పెట్టి చంద్రన్ నిద్రపోతూ ఉంటాడు. నాన్న అని లేపీ విషయం చెప్తాడు అభి. ఇలా చెప్ప చేయకుండా ఇంట్లో నుంచి వెళ్లడం ఇది మూడో సారి అని, అయినా కాశికి తీసుకెళ్తా అన్నకదా అని చంద్రన్ అంటాడు. ఇక జనర్దన్ చేసేది ఏం లేక తన గదికి వెళ్లి తాను ఐరన్ తీగలో తయారు చేసిన ఓ బొమ్మ స్ప్రింగ్ ను చూస్తాడు. అదే సమయంలో చంద్రన్ రెడీ అయి బయటకు వెళ్తాడు. ముందు తాగుతాడు. ఏ పని చేయకుండా ఊరికే టైమ్ పాస్ చేస్తుంటాడు.
చదవండి:Devara: గుంటూరు కారంను పక్కకు తోసి.. కొత్త రికార్డు క్రియేట్ చేసిన దేవర
అనుప్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రతి రోజు డబ్బింగ్ చేప్తూ ఉంటాడు. ఇక అభి కాలేజీ పోకిరి కుర్రాడు. సిగరేట్స్ తాగడం, ఫ్రెండ్స్ తో సరదాగా తిరగడం చేస్తుంటాడు. ఇక వాళ్ల అమ్మ డిజటల్ ప్రెస్ లో పని చేస్తుంది. వాళ్ల తాతా ఐరన్ తీగలతో బొమ్మలు చేస్తుంటాడు. అభి గర్ల్ ఫ్రెండ్ లండన్ వెళ్తుందని, అతన్ని వదిలేస్తుంది చెప్తుంది. దాంతో అభికి యూకే వెళ్లీ చదువుకోవాలనేది డ్రీమ్. రాత్రుల్లు ఇంటికి లేటుగా వచ్చిన అభి అన్నకు తెలియకుండా రూమ్ లో పడుకుంటాడు. ఈ కుటుంబంలో రోజు జరిగే పరిస్థితి ఇది.
నెక్ట్స్ సీన్లో పక్కింట్లో ఉన్న ఓ వృద్ధుడు జనార్దన్ స్నేహితుడు వీల్ చైర్లో వచ్చి అభివాళ్ల ఇంట్లో ఒక గోలి విసురుతాడు. అది చూసి జనర్దన్ కిటికి దగ్గరకు వస్తాడు. ఈసారి ఎవరు చూశారంటే పక్కింట్లో లత చూసి మా కోడలుకు చెబితే అభి స్టేషన్ కు వచ్చాడు అలా దొరికిపోయా అంటాడు. వీళ్లు తీసుకపోరు. నన్ను వెళ్లనివ్వరు అంటాడు. మరో సారి ప్రయత్నించు అని తన ఫ్రెండ్ సలహా ఇస్తాడు.
అనుప్ ఆఫీస్ కు వెళుతున్న సమయంలో వాళ్ల నాన్న చంద్రన్ పడుకొని ఉండడం చూసి అతనికి చిరాకు వేస్తుంది. దాంతో వెళ్లెప్పుడు డోర్ గట్టిగా వేసి వెళ్తాడు అనుప్. చంద్రన్ ఉలికిపడుతాడు. తరువాత బ్యాంక్ కు వెళ్లాల్సిన విషయం నిద్రపోతున్న ఆయనకు కూడా చెప్పమని అమ్మతో ఫోన్ లో చెప్తాడు. కట్ చేస్తే బ్యాంక్ లో చంద్రన్ కుటుంబం ఉంటుంది. ఇదివరకే చాలా కారణాలతో లోన్స్ తీసుకున్నారు. ఇకపై అలా కుదరదు. ఆ ప్రెస్ అమ్మితే అన్ని అప్పులు తీరుతాయి అని బ్యాంక్ మేనేజర్ అంటాడు. దాంతో ప్రెస్ ను అమ్మడం ఇష్టం లేక చంద్రన్ వెళ్లిపోతాడు. తరువాత ఫ్యామిలీ అలానే చూస్తూ ఉంటారు.
నెక్ట్స్ సీన్లో ఉషా ఆంటీ ప్రేమతో అనుప్ పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతుంది. అదే సమయంలో అనుప్ వచ్చి ఆ అమ్మాయిని చూసి 3 నెలలు అవుతుంది. అప్పుడు ఇష్టం లేదు, ఇప్పుడెలా నేను ఇష్టం అని అంటుంది అని ఉషాతో అంటుంటాడు. తాను టీచర్ జాబ్ చేస్తుంది. ఇప్పుడు నచ్చావు అంటుంది అని ఉషా అంటుంది. అమ్మాయికి ఆ రోజే నచ్చితే వాట్సప్ లో మెసేజ్ కు రిప్లై ఇవ్వలేదని అనూప్ తన మెసేజ్ ను చూపిస్తాడు. అప్పుడు ఏదో ఎగ్జామ్ టెన్షన్లో సరిగా పట్టించుకోలేదట, మీ ఇద్దరి పైర్ బాగుంటుంది అని చెప్పి ఉషా వెళ్తుంది. వాళ్ల ఇష్ట ప్రకారమే మనం ఉండాలంటే ఎలా, అయిన నాకు చదువుకునే అమ్మాయే అవసరం లేదు దీనింతటికి కారణం ఉషా అనే సరికి ఉషా బ్యాగ్ కోసం వస్తుంది. దాంతో అందరూ సైలెంట్ గా ఉంటారు. తరువాత తనతో ఇప్పుడే మాట్లాడి వచ్చాను టీచర్ ఉద్యోగం చేస్తుంది. ఆ సంబంధం నీకు బాగా సెట్ అవుతుంది అని వెళ్తుంది.
తరువాత అనుప్ తన డ్రెస్ మార్చుకుంటూ ఉండగా అభి వస్తాడు, అమ్మ షేర్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. నాన్న ఆ ప్రెస్ ను అమ్మితే దానితోనే యూకే వెళ్లాలి అనుకుంటున్నట్లు చెప్తాడు. తరువాత ఇన్ని సంబంధాలు తీసుకొస్తున్నా ఒక్కటి సెట్ అవట్లేదు నువ్వు గే నా అడుగుతాడు. అనుప్ సైలెంట్ గా ఉంటాడు. తరువాత ఏదో ఒకటి చెప్పు అని ప్రేమ అడుగుతుంది. వాళ్లు ఒకే చెప్పడానికి ఇంత టైమ్ తీసుకున్నారు కాదా మనం కూడా తీసుకుందాం అని చెప్తాడు. నెక్ట్స్ సీన్లో డబ్బింగ్ చెప్తుంటే అనగ నుంచి మెసేజ్ వస్తుంది. ఆ రోజు తాను మెంటల్ గా ప్రిపేర్ కాలేదు అని తరువాత ఆలోచించుకున్నాను. మా అమ్మనాన్నకు ఓకే అని చెప్పాను అని పంపిస్తుంది. దాంతో అనుప్ సంతోష పడుతుంటాడు. తనతో పరిచయం పెంచుకుంటాడు. ఫోన్లు మాట్లాడుతుంటాడు. తరువాత అనగ వాళ్లింటికి కుటుంబంతో సహా వెళ్లి మాట్లాడి వస్తారు. ఒక రోజు స్కూల్ దగ్గర పర్సనల్ గా కలుస్తాడు. అలా ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఏర్పడుతుంది.
పెళ్లి అవగానే నిన్ను కాశికి తీసుకెళ్తాను అని అనుప్ తాతాతో అంటాడు. దానికి జనర్దన్ నవ్వుతాడు. నిజమే చెబుతున్న అక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయని అనగ చెప్పింది అంటాడు. నెక్ట్స్ సీన్లో ఇంటిని శుభ్రం చేసే వాడు వస్తాడు, అతనితో క్లీన్ చేయించి డబ్బులు ఇవ్వండి అని చంద్రన్ కు ప్రేమ ఫోన్ చేస్తుంది. దాంతో అతన్ని పంపించి తన ఫ్రెండ్ ను పిలిపించి, ఆ డబ్బులతో మందు తెచ్చుకొని ఇల్లంతా క్లిన్ చేస్తారు. నెక్ట్స్ డబ్బింగ్ స్టూడియో దగ్గర అనుప్ ను ఒక వ్యక్తి వింతగా చూస్తాడు. అదే సమయంలో లంచ్ కోసం బయటకు వెళ్తుంటే అతను కూడా ఫాలో అవుతాడు. అతనికి యాక్సిడెంట్ అవుతుంది. దాంతో తాను మనల్నే ఫాలో అవుతున్నాడు, ఏదో చెప్పాలని చూస్తున్నాడని అనుప్ తన ఫ్రెండ్ తో అంటాడు. అదేం లేదు అని తన ఫ్రెండ్ పెద్దగా పట్టించుకోడు. తరువాత యాక్సిడెంట్ అయిన వ్యక్తి క్యాప్ పైన హిట్ మ్యాన్ అని రాసి ఉంటుంది.
చంద్రన్ కటింగ్ షాప్ లో మీసాలను సవరించుకుంటుండగా.. పెళ్లికోసం ఎంత డబ్బులు దాచావు అని తన ఫ్రెండ్స్ అడుగుతారు. చంద్రన్ సైలెంట్ గా ఉంటాడు. తరువాత ఎంగేజ్ మెంట్ కోసం అనగ వాళ్లింటికి కుటుంబం, బంధువులతో వెళ్తుంటారు. అలా షాట్ కట్ లో వెళ్తుంటే దారి మిస్ అవుతారు. మళ్లీ వెనక్కి తిరిగి వస్తుంటే హిట్ మ్యాన్ కనిపిస్తాడు. తరువాత ఎంగేజ్ మెంట్ కు అందరూ సిద్ధం అవుతారు. హిట్ మ్యాన్ తన ఫ్రెండ్స్ తో తాగుతూ.. ఎంగేజ్ మెంట్ జరిగే చోటుకు వచ్చి హీరోయిన్ ను చెంపమీద లాగి కొడుతాడు. అనుప్ షాక్ అవుతాడు. అతన్నిపట్టుకొని అందరు కొడుతుంటారు. అనగ ను 5 నెలల నుంచి ప్రేమించినట్లు చెప్తాడు. గొడవ చేస్తుంటాడు. దాంతో అభి కుర్చితో కొడుతాడు. వాడు కిందపడిపోతాడు. కట్ చేస్తే అనుప్ ఫ్యామిలీ పోలీసు స్టేషన్లో ఉంటారు. కంప్లైంట్ ఇవ్వండి, అభిని జాగ్రత్తగా ఉండమని పోలీసు చెప్తుండగా అనుప్ బయటకు వచ్చేస్తాడు.
తరువాత సీన్లో జరిగింది ఎంగేజ్మెంటే కదా పెళ్లయితే కాలేదు కదా అని చుట్టాలు అందరూ మాట్లాడుకుంటుంటారు. అది విని అనూప్ డోర్ వేసుకుంటాడు. చుట్టాలంతా తాను ఏం అన్నా చేసుకుంటాడేమో అని భయపడుతారు. తాను నార్మల్ గానే ఉంటాడు. అదే సమయంలో అభి కిటికి బద్దలు కొడుతాడు. ఆ తరువాత అనుప్ వర్క్ మీద ఫోకస్ చేయడు. చాలా డిస్టర్బ్ గా ఉంటాడు. అభి కాలేజీ నుంచి వచ్చి కార్లో వెళ్లే వాల్లను చూసి Falimy భయపడుతాడు. ప్రేమ కూడా తన పనిలో పెద్దగా కాన్సంట్రేషన్ చేయదు. అలాంటి సమయంలో అనగ వచ్చి ఇది పెద్ద సమస్యల చూస్తున్నావా.. ఎవడో ఒకడు 5 నెలలు వెనక తిరిగితే అది రిలేషన్ షిప్ అని ఎలా డిసైడ్ అవుతావు అని ఎంగేజ్మెంట్ ఉంగురం అక్కడ పెట్టేసి వెళ్తుంది. దాంతో అనుప్ బాధపడుతాడు.
తరువాత వర్షం పడుతుండగా తను ఫ్రస్టేట్ తో గట్టిగా అరుస్తాడు. ఇంట్లో అన్నం లేదని అందరిమీద అరుస్తాడు. అదే సమయంలో తాతాయ్య మళ్లీ కాశికి వెళ్లే ప్రయత్నంతో స్టేషన్ కు బ్యాగ్ తో సహా వెళ్లాడని చంద్రన్ ఫ్రెండ్ ఇంటి వద్ద దిగబెడుతాడు. దాంతో కాశికి వెళ్దామని అనూప్ చెప్తాడు. వచ్చే వాళ్లు రావొచ్చు అని అంటాడు. అభిని వెతుకుతూ కొందరు వెంటపడుతారు. వాళ్లనుంచి తప్పించుకొని ఇంటికి వస్తాడు. ఫ్రెండ్ కు ఫోన్ చేసి తన దగ్గరకు వస్తాను అంటాడు. వాడు వద్దంటాడు. అదే సమయంలో డోర్ కొడుతారు. తన వెంటపడ్డవాళ్లేమో అనుకుంటాడు. కాని వచ్చింది అనుప్. కాశికి వెళ్తున్నాము నువ్వు వస్తావా అని అడుగుతాడు. ఇప్పుడే పోదాం పదా అని అభి అంటాడు. తరువాత ఫ్యామిలీ అంతా కలసి స్టేషన్ కు వెళ్తారు.
అందరు ట్రైన్ లో బయలు దేరుతారు. స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగినప్పుడల్లా చంద్రన్ ఏదోటి తిని డబ్బులు ఇవ్వకుండా ట్రైన్ కదులుతున్నప్పుడు ఎక్కేస్తుంటాడు. అలా ఏది పడితే అది తిని తన స్టమక్ దెబ్బతింటుంది. తరువాత ఒక స్టేషన్లో టీ కోసం దిగుతాడు చంద్రన్. ఆ సమయంలో టీ పోసే అబ్బాయి డబ్బులు తీసుకొని పరుగెడుతుంటాడు. ఆ పిల్లోన్ని పట్టుకోవడానికి చంద్రన్ పరుగెట్టి ట్రైన్ కదులుతుంది. ప్రేమ పిలుస్తుంది. అతను పరుగెత్తుకుంటూ వచ్చి ప్రేమ చేయిపట్టుకొని తనను కూడా కిందికి లాగుతాడు. వాళ్లను చూసి అనుప్, అభి ఇద్దరు కూడా దిగుతారు. తరువాత ట్రైన్ లో తాతా ఉండిపోతాడు. ఇదే విషయాన్ని ట్రైన్ మాస్టర్ కు చెబితే తరువాత స్టేషన్లో తాతాను దింపేస్తా అని చెబుతాడు. అదే స్టేషన్ లో టీ అబ్బాయి కనిపిస్తాడు. చంద్రన్ అరవవగానే అతడు డబ్బులు పడేసి వెళ్తాడు. తరువాత డబ్బులు తీసుకుంటాడు చంద్రన్.
నెక్ట్స్ ఆటోలో వెళ్లి ఫ్యామిలీ అంతా బస్సులో ఎక్కుతారు. బస్సులో ఉన్న వాళ్లంత పొగతాగడం, గుట్కానమలడంతో ప్రేమకు వాంతికి వస్తుంది. దాంతో ఫ్యామిలీని రోడ్డుమీద వదిలేసి బస్సు వెళ్తుంది. ఈ రోడ్లో వెహకిల్స్ గురించి చూసి చూసి నడుచుకుంటూ వెళ్తారు. ఒకరిని ఒకరిని తిట్టుకుంటూ ఉంటారు. తరువాత రోడ్డుమీద మేకు వేద్దామని తాతా ప్లాన్ చేస్తాడు. అదే సయమయంలో అనూప్ తన రెడ్ టీషర్ట్ తో వాహనాలను ఆపడానికి ట్రై చేస్తుంటాడు. చివరికి ఒక బండి ఆగుతుంది. అతను వీళ్లను ఎక్కించుకుంటాడు. కానీ అతని బండ్లో స్మగుల్ థింగ్స్ ఉన్నాయని అతను చెక్ పోస్ట్ ను విరగ్గొట్టి బండి స్పీడ్ గా తీసుకెళ్తాడు. ప్రాణబయంతో వీళ్లు అరుస్తుంటారు. దాంతో ఫ్యామిలీ అంతా కంగారు పడుతారు. ఆపండి అని అరుస్తారు. వీళ్లను ఒక ప్రదేశంలో దిగబెట్టి వాళ్లను తిట్టేసి వెళ్లిపోతాడు వ్యాన్ డ్రైవర్.
మళ్లీ రోడ్డుమీద నిలబెడుతారు. ఒక వాహనం ఎక్కి ఒకరిని ఒకరు తిట్టుకుంటారు. అదే సమయంలో పక్కింట్లో ఉన్న జనార్దన్ ఫ్రెండ్ చనిపోయాడు అని చంద్రన్ కు ఫోన్ వస్తుంది. దాంతో జనర్ధన్ విపరీతంగా ఏడుస్తాడు. తరువాత అందరు కలిసి వారణాసికి వెళ్తారు. అక్కడ ఒక హోటల్ తీసుకొని ఉంటారు. ఉదయం లేచి చూసేసరికి జనార్ధన్ కనిపించడం లేదని ప్రేమ ఫ్యామిలీతో చెప్తుంది. అందరూ కలిసి వెతుకుతుంటే పోలీసు వాళ్లను పిలిచి స్టేషన్ కు తీసుకెళ్తాడు. వీళ్లు ఒకే ఫ్యామిలీ కాదని పోలీసులు అంటారు. మేమంత ఒకటే అని వీరు అంటారు. అయితే అనూప్ కు కాల్ చేయమని చంద్రన్ ను అడుగుతారు పోలీసులు. చంద్రన్ ఫోన్ చేస్తే నెంబర్ సేవ్ అయి ఉండదు. దీంతో పోలీసు అనుమానం నిజం అవుతుంది. మళ్లీ అనుప్, చంద్రన్ ఇద్దరు గొడవ పడుతుంటారు. తరువాత ప్రేమ వాళ్ల గ్రూఫ్ ఫోటోను చూపించి, ఇతను మా మామ ఇతని కోసమే వెతుకుతున్నాము అని చెప్తారు. దాంతో పోలీసులు వాళ్లను వదిలేస్తారు. తరువాత మళ్లీ వెతుకుదాం అని మాట్లాడుతుండగా.. నా వల్ల కాదు వెతకడం నాన్న హోటల్ వచ్చేసి ఉంటాడు అని షేర్ ఆటో ఎక్కుతాడు చంద్రన్. తన ఎక్కడి వెళ్లాలి అని అడిగితే హోటల్ అంటాడు. దాని పేరు తెలియదు. ఇక్కడ తన స్వార్థమే చూసుకున్నాడు అని ఫ్యామిలీ అనుకుంటారు.
తరువాత అందరు కలిసి హెటల్ కు వెళ్లి అడిగితే జనార్దన్ ఇంకా రాలేదని చెప్తారు. తరువాత వీధి అంతా వెతుకుతుంటారు. తరువాత మైక్ లో అనౌన్స్ చేస్తారు. అలా ఎంత చేసిన ఫలితం ఉండదు. దాంతో పోలీసు కంప్లైంట్ ఇస్తారు. అక్కడికి ప్రమోదు వచ్చి మీ వాయిస్ కు పెద్ద ఫ్యాన్ అని అనుప్ తో చెప్పి హెల్ప్ చేస్తా అంటాడు. తరువాత అక్కడికి చాలా మంది తమ శేష జీవితాన్ని గడపడానికి వస్తారు అని తెలుగు వాళ్లు ఉండే ఒక సత్రానికి వెళ్లి జనార్ధన్ గురించి అడిగితే అలాంటి పేరుతో ఒకరు ఉన్నారు అని లోపలికి వెళ్తారు. అక్కడ వీళ్ల తాతా ఉండరు. వేరే పర్సన్ ఉంటారు. తన వాళ్ల ఫ్యామిలీ కాదని, తన కోసం ఎవరు రాలేదని అతను చాలా బాధపడుతాడు. ఫ్యామిలీ అంతా ఆలోచనలో పెడుతారు. తరువాత చందన్, అనుప్ ఇద్దరు మాట్లాడుకుంటారు. తండ్రిని దెప్పిపొడుస్తాడు అనుప్. దాంతో తాను సంపాదించకపోవడంతోనే నన్ను ఇలా చూస్తున్నారు అని అంటాడు. నువ్వు మా కోసం ఏం చేయలేదు, చివరికి ఆ మూతబడ్డ ప్రెస్ ను అమ్మేస్తే మన కష్టాలు తీరుతాయి అని అంటే దానికి కూడా అడ్డుపడుతావు అని అనుప్ అనగానే.. దాన్ని అమ్మడానికి అన్ని ఏర్పాట్లు చేశాను ఆ డబ్బు నీకే ఇస్తా ఏం చేసుకుంటావో నీ ఇష్టం. నీకు ఇచ్చేది అదొక్కటే అని ఎమోషనల్ అవుతాడు.
తరువాత మళ్లీ తాత కోసం వెతుకుతారు. అదే సమయంలో చంద్రన్ వాళ్లు వెతికిన వైపు వెళుతుంటే మొదటి సారి నాన్న అని పిలుస్తాడు అనుప్. ఎంత వెతికనా దొరకరు. ఒక చోట ప్రమోద్ వాళ్లతో మాట్లాడుతాడు. మీరంత ఆయన మీద ఆశ వదిలేసి కర్మ చేసి తిరిగి వెళ్లిపోండి అంటాడు. దానికి అనుప్ సిరియస్ అవుతాడు. అదే సమయంలో తాతా నడుచుకుంటు వచ్చినట్లు కల గంటాడు. అదే రాత్రి తాతను వెతుక్కుంటూ వెళ్తాడు అనుప్. చివరకు తన తాత బొమ్మను పట్టుకొని కాటికపారినికి అడుగుతాడు. అందులో ఇకడు ఇతన్ని నిన్నే కాల్చాము అని చెప్తాడు. అదే సమయంలో అక్కడ వాళ్ల తాత చెప్పు ఒకటి దొరకుతుంది. దాన్ని పట్టుకొని ఏడుస్తుంటాడు. కట్ చేస్తే ట్రైన్ లో తీగలతో ఒక బొమ్మను చేసి దాన్ని ఒక పాపకు ఇస్తాడు జనార్దన్. ఇంటికి వెళ్లి చనిపోయిన తన ఫ్రెండ్ ఫోటోను చూస్తాడు. వాళ్లు మాట్లాడుకున్న చోట నిలబడి చూస్తాడు. అనుప్ తాతాయ్య అని ఏడుస్తాడు. పరుగెత్తుకుంటూ వెళ్లి ఇంట్లో వాళ్లకు చెప్తాడు. అందరూ పరుగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తారు.
ఇక్కడ కాశిలో వాళ్ల నాన్న చనిపోయాడు అని కర్మ చేసి గుండు గీచుకుంటాడు చంద్రన్. గంగలో స్నానం చేస్తున్నప్పుడు తన ఫ్రెండ్ ఫోన్ చేసి తాత ఇంటికి వచ్చాడు మీరు ఇంకా కాశిలోనే ఉన్నారా అని చెప్తాడు. దాంతో అందరూ ఆశ్చర్యపోతారు. వాళ్ల నాన్న బతికున్న విషయాన్ని చంద్రన్ కు చెప్తారు. జనార్ధన్ అలా చూస్తూ ఉండిపోతారు. ఇంటికి బయలు దేరెప్పుడు వాళ్లు పూర్తిగా మారిపోతారు. అనగ చేసింది తప్పు ఏం లేదు, మనమే తనను అపార్థం చేసుకున్నాము అని అనుప్ అంటాడు. దాంతో మేము కాదు నువ్వే తనను అపార్థం చేసుకున్నావు అంటుది ప్రేమ. తరువాత అందరు కలిసి ఇంటికి వెళ్లి జనార్ధన్ కోసం చూస్తుంటే.. పక్కింట్లో ఉండే అతను తన నాన్న అస్తికలు తీసుకొని వారణాసికి వెళ్లినట్లు చెప్తాడు. అది వాళ్ల నాన్న చివరి కోరిక అని, తన ఫ్రెండ్ కోరికను తీర్చడానికి జనార్ధన్ కాశికి వెళ్లనున్నట్లు చెప్తాడు. మళ్లీ కుటుంబం అంతా స్టేషన్ కు వెళ్లి జనార్దన్ ను చూస్తారు. అందరూ ఊపిరి పీల్చకుంటారు, ఇంకోసారి వెళ్దాం, ఇప్పుడు కిందకు దిగండి అని మాట్లాడుతారు. తాను దిగను అంటాడు. దాంతో ఫ్యామిలీ అంతా మరో సారి ట్రైన్ ఎక్కుతారు. జనర్ధాన్ వాళ్లను వింతగా చూస్తాడు. వారంత మారిపోయినట్లు చంద్రన్ చెప్తాడు. కాశి నుంచి వారు వస్తుంటే వాళ్లను చీట్ చేసిన క్రిమినల్ ను కొట్టి అన్ని పావురాలను స్వేచ్చగా వదిలేసినట్లు చెప్తారు. దాంతో తాత సంతోషపడుతారు. టికెట్ కలెక్టర్ వస్తే 5 టికెట్లు కాశికి ఇవ్వండి అని అనుప్ అంటారు. ఈసారి కాశి యాత్ర పరిపూర్ణంగా ఉండనుంది. ఇది ఫాలిమి చిత్రం కథ.