Parking Movie Explained: ఓపెన్ చేస్తే ఈశ్వర్ అద్దెకు ఇల్లు చూస్తుంటాడు. ఇల్లు చాలా బాగుంటుందని హౌస్ బ్రోకర్ ఈశ్వర్ కు ఎక్స్ ప్లైన్ చేస్తుంటాడు. కింద ఉండే వారు కూడా అద్దెకు ఉండేవారే అని చెప్తాడు. రూమ్స్ ను ఫోటోలు తీసుకుంటాడు ఈశ్వర్. తరువాత తన వైఫ్ కు ఫోన్ చేసి హౌస్ బాగానే ఉందని చెప్తాడు. తాను ఫోటో తీసి పంపించమంటే ఈశ్వర్ ఫోటో తీస్తాడు. టైటిల్స్ పడుతుంటాయి. తరువాత సీన్లో ఇంటికి అన్ని సమాన్లు షిప్ట్ చేస్తారు. ఈశ్వర్ వైఫ్ అతిక బుక్స్ సర్దుతుంటే, అతిక ప్రెగ్నెంట్ తో ఉండడం వలన అవేవి చేయద్దు అని ఈశ్వర్ చెప్తాడు. తరువాత కింద పోర్షన్ లో ఉన్నవారిని పరిచయం చేసుకుందాం అని కిందికి వెళ్తారు. డోర్ కొడితే అపర్ణ డోర్ ఓపెన్ చేసి లోపలికి రమ్మంటుంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఏకరాజ్ రెడీయో రిపేర్ చేస్తుంటాడు. వాళ్ల వైఫ్ కుమారిని పిలుస్తాడు. తరువాత టీ ఇస్తారు. ఈశ్వర్ తాగుతూ తనతో మాట్లాడుతుంటాడు.
చదవండి:Devara: ‘దేవర’ ఆడియో పై సాలిడ్ అప్డేట్!
తరువాత సీన్లో అతిక ఈశ్వర్ వాళ్ల అమ్మతో ఫోన్ మాట్లాడుతుంది. ఏం పనులు చేయకు అని అంటుండగా ఈశ్వర్ ఫోన్ తీసుకుంటాడు. అమ్మాయివాళ్ల పేరెంట్స్ ఇంకా ఎవరు మాట్లాడడం లేదా అంటే లేదు అని చెప్తాడు. తరువాత అతికతో ప్రేమగా మాట్లాడుతుంటాడు. నెక్ట్స్ సీన్లో ఏకరాజ్ తన బైక్ ను క్లీన్ చేస్తుంటాడు. అదే సమయంలో ఇస్త్రి చేసే బట్టలు తన కంపోండ్ వాల్ మీద పెట్టారని గణేష్ అని పిలిచి తీయమని చెప్తాడు. అలాగే అండి ఓనర్ గారు అని ఎటకారంగా అంటూ బట్టలు తీస్తాడు. అదే సమయంలో ఈశ్వర్ వచ్చి అంకుల్ తో మాట్లాడుతాడు. బైక్ లేదా అంటే లేదు అంటాడు ఈశ్వర్. అదే సమయంలో ఏకరాజ్ బావమరిది వచ్చి ప్రసాదం ఇచ్చి ఏదో కాంటాక్ట్ విషయం గురించి అడుగుతాడు. నువ్వు సరిగ్గా కోట్ చేసి ఉంటే వచ్చేది అని వాల్ల అమ్మాయిని పిలుస్తాడు. అపర్ణ వచ్చి బైక్ పై కూర్చుంటుంది. జుట్టు ముడి వేసుకో అని చెప్తా. ఇద్దరు కలిసి బయలు దేరుతారు.
అదే ఈశ్వర్ కూడా క్యాబ్ లో ఆఫీస్ కు వెళ్తాడు. కూతుర్ని బస్ స్టాప్ లో దింపేసి ఏకరాజ్ ఆఫీస్ కు వెళ్తాడు. అక్కడ ఒకడు వచ్చి లంచం ఇస్తా అంటే అతన్ని తిట్టి బయటకు వెళ్లిపో అంటాడు. తరువాత ఒక ఆఫీసర్ ఫైల్ ఇచ్చి సంతకం చేయమంటాడు. అన్ని సరిగ్గా చూశావా అంటే చూశాను అంటాడు. అది చెక్ చేసి డేట్ వేయలేదని చెప్తాడు. తాను పెన్ ఇవ్వమంటే తక్కువ కాస్ట్ పెన్ ఇస్తాడు. దాన్ని అలా చూస్తాడు అతను. ఏకరాజ్ చాలా పిసినారి.. తరువాత సంతకం పెట్టి వెళ్లిపోతుంటే పెన్ అడిగి తీసుకుంటాడు.
మరో సీన్లో ఈశ్వర్ ఆఫీస్ లో అందరిని పరిచయం చేసుకుంటాడు. తరువాత వైఫ్ తో కుకింగ్ లో హెల్ప్ చేస్తుంటాడు. సాంగ్ స్టార్ట్ అవుతుంది. కుమారి, అపర్ణ పైకి వస్తారు. ఫ్రిజ్ చూసి కుమారి సంతోష పడుతుంది. అతికతో మాట్లాడుతారు. వాళ్లిద్దరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారట అని తన హస్బెండ్ తో చెప్తె.. ఎదిగిన కూతురు ముందు ఇలాంటి మాట్లాడకు అని చెప్తాడు. మిక్సీని కూడా తానే రిపేర్ చేస్తాడు. మరో సీన్లో గణేష్ ఈశ్వర్ బట్టలు తీసుకొని వస్తూ ఏకరాజ్ ను చూస్తాడు. తరువాత అందరు కలిసి భోజనం చేస్తారు. అతికను ఆసుపత్రికి తీసుకుపోడానికి క్యాబ్ బుక్ చేస్తే అది క్యాన్సెల్ అయిందని ఆటోలో వెళ్తుంటారు. బేబీ హెల్తీగా ఉందని డాక్టర్ చెప్తుంది. తిరిగి కార్లో వస్తూ నీకు నచ్చిన కలర్ బ్లూనే కదా అని అంటాడు. అవును అంటుంది అతిక. కట్ చేస్తే కారు కొంటాడు ఈశ్వర్. అతిక సంతోషపడుతుంది.
తరువాత సీన్లో ఏకరాజ్ బావమరిది తనకు కాంటాక్ట్ ఇప్పించమని వాళ్ల అక్క కుమారిని అడుగుతుంటాడు. అదే సమయంలో తాను చట్నీ చేయడానికి కొబ్బరి తురుముతుంది. దోశలోకి టమోటో చట్నీ చేయమని చెప్తాడు ఏకరాజ్. కొబ్బరి తురిమేశాను అని కుమారి చెప్తుంది. దాన్ని పక్కకు పెట్టి టమాటో చట్నీ చేయి అంటాడు. దాంతో కుమారి విసుగ్గా అది పక్కకు పెడుతుంది. అదే టైమ్లో కాంటాక్ట్ గురించి అడిగితే.. చట్నీ ఏం చేయాలో కూడా ఆయనే చెప్తున్నాడు నేను ఏం చెప్పగలను అంటుంది. అదే సమయంలో అతిక డోర్ కొడుతుంది. ఏంటమ్మ ఈ టైమ్ లో అంటే కారు కొన్నాము, మీ బైక్ కాస్త తీస్తారా అని అంటుంది. ఏకరాజ్ తన బైక్ ను పక్కన పెడుతాడు. ఈశ్వర్ కారు పార్క్ చేస్తాడు.
తరువాత కుమారి తన భర్తతో కారు చాలా బాగుందని అంటుంది. అప్పు చేసి కారు కొనడం గొప్ప విషయమా అని అంటాడు. అప్పు చేసి అయిన భార్యను బాగానే చూసుకుంటున్నాడు అంటుంది. దాంతో కొప్పడి బయటకు వస్తాడు. ఏంటి ఎకరాజ్ సార్ కారు కొన్నారా అని అకౌంటెంట్ అడుగుతాడు. తాను కాదు అని చెప్పేలోపే మంచి పని చేశారు. ఎండలు మండిపోతున్నాయి అంటాడు. అదే సమయంలో గణేష్ అది పైన ఈశ్వర్ సార్ ది అని అంటాడు. ఎకరాజ్ అవమానంగా ఫీల్ అవుతాడు. పంచర్ మీదనే పంచర్ వేసే మొహం అని గణేష్ మాట్లాడుతుంటే ఏకరాజ్ తన బైక్ తీస్తాడు. అపర్ణ కారు అద్దంలో చూసుకుంటుంది. ఏకరాజ్ రమ్మని కోప్పడుతాడు. తరువాత తన కూతుర్ని ఎక్కించుకొని వెళ్తాడు.
కారు ఎక్కువ స్పీడ్ వెళ్లొద్దని, అలా లాంగ్ డ్రైవ్ వెళితే మైలేజ్ సెట్ అవుతుందని ఈశ్వర్ ఫ్రెండ్స్ చెప్తుంటారు. తరువాత తన వైఫ్ పెయింటింగ్ వేస్తుంటే ఈశ్వర్ డిన్నర్ కు వెళ్లి అలా లాంగ్ డ్రైవ్ వెళ్లోద్దమని చెప్తుంటాడు. అదే సమయంలో ఏకరాజ్ ఫోన్ చేస్తాడు. తన బైక్ పెట్టడం ఇబ్బందిగా ఉందని, కారు కొంచెం పక్కకు పెట్టమని అంటాడు. ఈశ్వర్ కారును కాస్త లోపలికి పెడుతాడు. నెక్ట్స్ సీన్లో ఏకరాజ్ మొక్కలకు నీల్లు పడుతుంటాడు. అదే సమయంలో కారు క్లీన్ చేసే అబ్బాయి ఇంటికి వస్తాడు. కారు తూడ్చడానికి కూడా ఒక మనిషా అంటే నాలుగు మొక్కలకు ఒక తోటమాలి ఉన్నప్పుడు కారుకు ఒక మనిషి ఉండకూడదా అని కారు క్లీన్ చేస్తాడు. అదే రోజు రాత్రి ఏకరాజు తన బైక్ ను పార్క్ చేసే సమయంలో కారుకు స్క్రాచ్ పడుతుంది. మరుసటిరోజు అబ్బాయి కారు తూడిచి కీస్ ఇస్తూ కారుకు స్క్రాచ్ ఉందని చెప్తాడు బాయ్. దాంతో ఈశ్వర్ అది చూసి ఏకరాజ్ తో చెప్తాడు. కొత్త కారు అప్పుడే స్క్రాచ్ ఏంటి బాబు అని అంటుండగా.. మీరు పార్క్ చేసేప్పుడు ఏమన్నా జరిగిందా అంటాడు. దానికి నేను తాగి రాలేదు, నేను ఎందుకు చేస్తా అని సిరీయస్ గా అంటాడు. ఈశ్వర్ కొంచెం కాన్సెట్రేషన్ తో బైక్ ను చూస్తే కారు పేయింటింగ్ బైక్ కు అంటుకొని ఉంటుంది. దాంతో బైక్ తాకడం వలనే అని స్పష్టం అవుంది.
ఏదో పొరపాటున జరిగి ఉంటుంది. దానికి ఎంత అవుతందో చెబితే డబ్బులు ఇస్తాను అంటాడు ఏకరాజ్, డబ్బులేమి అవసరం లేదు, ఇకపై కొంచెం కేర్ ఫుల్ గా ఉండండి అని ఈశ్వర్ అంటాడు. నీ ఉద్దేశం ఏంటి నేను నిర్లక్ష్యంగా ఉంటాననా, లేదా కావాలనే చేశానా అని ఏకరాజ్ అంటాడు. అయినా నీ పాటికి కారు పార్క్ చేసేస్తావు, తరువాత నా బైక్ ఎలా పార్క్ చేసుకోవాలి అని అంటాడు. దాంతో ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ జరుగుతుంది. తరువాత ఈశ్వర్ ఆఫీస్ లో డిస్టర్బ్ గా ఫీల్ అవుతాడు. రాత్రి ఇంటికి వెళ్లే సరికి అప్పుడే ఏకరాజ్ బైక్ పార్క్ చేసి గేట్ పెడుతుంటాడు. ఈశ్వర్ వస్తాడు. కారును చూసి గేట్ ఓపెన్ చేస్తాడు ఏకరాజ్. దాంతో ఈశ్వర్ కిందకు దిగి సారీ చెప్తాడు. కట్ చేస్తే ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తారు.
డ్రింక్ చేస్తూ సేవింగ్స్ గురించి మాట్లాడుకుంటారు. మనకు ఉపయోగపడని సేవింగ్స్ ఎందుకు అని ఈశ్వర్ అంటే, రేపు కూతురు పుడితే నీకు సేవింగ్స్ విలువ తెలుస్తుంది అని ఏకరాజ్ అంటాడు. కూతురిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేయాలంటే ఎంత సేవింగ్స్ చేయాలో తెలుసా అని అంటాడు. దానికి పెళ్లంటే గ్రాండ్ గానే చేయాలని ఏం ఉంది, నేను రిజిస్టర్ మ్యారెజ్ చేసుకున్న, చాలా సంతోషంగా ఉన్నా అని ఈశ్వర్ అంటాడు. నా కూతురికి రిజస్టర్ మ్యారెజ్ చేయమంటావా, నీ లాంటి కుర్రకుంకతో కూర్చొని మందు తాగడమే నేను చేసిన తప్పు అని అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు. అది కాదు సర్ అని ఈశ్వర్ అంటున్నా వినిపించుకోకుండా వెళ్తాడు. ఇంట్లోకి వెళ్లగానే మిక్సి గురించి తన వైఫ్ కుమారి అడుగుతుంది. కొత్తది కొనివ్వమని అడుగుతుంది. దాంతో దాన్ని తీసుకొని కింద కొడుతాడు. కుమారి షాక్ అయి అలానే చూస్తుంది.
తరువాత రోజు ఉదయం కారు వాష్ చేసే అబ్బాయి వస్తాడు. ఏకరాజ్ ఆఫీస్ కు రెడీ అవుతాడు. బైక్ బయటకు తీయడానికి గ్యాప్ ఉండదు. ఈశ్వర్ టిఫిన్ చేస్తుంటాడు. డోర్ బెల్ సౌండ్ అవుతుంది. ఈశ్వర్ డోర్ తీస్తే ఏకరాజ్ కారు తీయమని చెప్తాడు. తింటున్నా 5 మినట్స్ ఆగండి అంటే ఇప్పుడే తీయమని అంటాడు. దాంతో ఈశ్వర్ టైమ్ పడుతుంది వెయిట్ చేయండి అని మొహం మీదనే డోర్ కొడుతాడు. ఏకరాజ్ కిందకు రాగానే కారును వాష్ చేసే అబ్బాయి అపర్ణ మాటలు వింటూ తాను బయటకు వస్తుందేనని ఆశగా చూస్తుంటాడు. దాన్ని ఏకరాజ్ చూసి కొప్పడుతాడు. కట్ చేస్తే ఈశ్వర్ కిందకు వస్తే బైక్ అక్కడే ఉంటుంది. ఈయన ఎక్కడ అంటే నడుచుకుంటే పోయాడు అని బాయ్ చెప్తాడు.
తరువాత సీన్లో ఏకరాజ్ నడుచుకుంటూ ఆఫీస్ కు వెళ్తాడు. ఈశ్వర్ కారుకు డెంటింగ్ చేయిస్తాడు. సాయంత్రం ఏకరాజ్ తిరిగి నడుచుకుంటూ ఇంటికి వస్తాడు. ఇంట్లోకి వెళుతూ తన బైక్ వైపు చూస్తాడు. తరువాత సీన్లో ఈశ్వర్ ఇంటికి వచ్చి కారు పార్క్ చేద్దామనుకుంటాడు. బైక్ మధ్యలో ఉంటుంది. దాంతో దాన్ని పక్కకు జరిపి కారు పార్క్ చేస్తాడు. అనుకోకుండా బైక్ కింద పడుతుంది. ఏకరాజ్ ఉదయం చూసి ఈశ్వర్ ను పిలుచుకొచ్చి చూపిస్తాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇకపై కావాలనే స్క్రాచ్ చేస్తా అని ఏకరాజ్ అంటే, నేను కావాలనే బైక్ కింద పడేస్తా అని ఈశ్వర్ అంటాడు. తరువాత అతిక ఈశ్వర్ ను తీసుకొని వెళ్తుంది. అలాగే ఏకరాజ్ ను తన వైఫ్ తీసుకొని వెళ్తుంది. కట్ చేస్తే ఓనర్ ఇద్దిరితో మాట్లాడుతుంటాడు. కారుకు పార్కింగ్ ప్లేస్ ఇచ్చి బైక్ ను పక్కన పెట్టుకోండి అని ఓనర్ చెప్పి వెళ్తాడు. దాంతో ఏకరాజ్ ఆలోచిస్తాడు. కట్ చేస్తే కొత్త కారు కొనుక్కొని వస్తాడు. ముందుగానే ఇంటికి వచ్చి పార్క్ చేసుకుంటాడు. అదే సమయంలో ఈశ్వర్ వచ్చి కారును చూస్తాడు. నేనే కొన్నాను అని చెప్తాడు. దాంతో కారు బయట పార్క్ చేస్తాడు. ఈశ్వర్ ఫ్రస్టేషన్లో బీర్ తాగుతుంటే పూర్ణిమ వచ్చి సారీ అన్నయ్య అని చెప్తుంది. నా మీద కోపంతో కారు కొనడం ఏంటని అంటుండగా ఫోన్ వచ్చిందని ఏకరాజ్ పిలుస్తాడు.
మార్నింగ్ లేచి చూస్తే కారుపై పిట్టలు రెట్టలు వేస్తాయి. ఈశ్వర్ కు కోపం వస్తుంది. వాటర్ తో క్లీన్ చేసుకొని ఆఫీస్ కు వెళ్తాడు. తరువాత ఏకరాజ్ కూడా ఆఫీస్ కు వెళ్తాడు. కారు పార్కింగ్ గురించి ఆఫీస్ లో తన ఫ్రెండ్స్ జోక్స్ వేస్తుంటారు. తరువాత నైట్ ఇంటికి రాగానే ఏకరాజ్ కారు పార్కింగ్ లో ఉంటుంది. సరే అని వేరే వాళ్ల ఇంటిదగ్గర పార్క్ చేస్తాడు. మార్నింగ్ లేవగానే వాళ్లింటిదగ్గర పార్క్ చేసినందుకు అతను తిడుతాడు. ఇదే విషయం ఆఫీస్ లో ఫ్రెండ్స్ తో మాట్లాడుతారు. వైఫ్ కి ఎమర్జెన్సీ అని చెప్పి ముందే వచ్చి కారు పార్కింగ్ చేస్తాడు. అది ఏకరాజ్ చూస్తాడు. తరువాత రోజు ఏకరాజ్ ఆఫ్టర్ నూన్ ఇంటికి వెళ్లి కారు పెడుతాడు. అదే విషయాన్ని గణేష్ చెప్తాడు. కట్ చేస్తే ఇద్దరు ఒకే సమయంలో కారు పార్క్ చేయడానికి ఇంటికి వస్తారు. ఇద్దరు ఎదురు పడుతారు. అదేసమయంలో కారు హారన్ కొడుతాడు. కుమారి గేట్ ఓపెన్ చేస్తుంది. ఈశ్వర్ తనకంటే ముందే వెళ్లి పార్క్ చేస్తాడు ఆ సమయంలో కారు మిర్రర్ బ్రేక్ అవుతుంది. ఇలా ఎందుకు అని అతిక అడుగుతుంది.
తరువాత సీన్లో ఏకరాజ్ తన కారును పక్కన పార్క్ చేస్తాడు. ఉదయం ఈశ్వర్ ఆఫీస్ కు వెళితే కారు పెట్టుకోవాలని ఏకరాజ్ అనుకుంటాడు. కానీ ఈశ్వర్ కారును అక్కడే పార్క్ చేసి ఆటోలో ఆఫీస్ కు వెళ్తాడు. ఏకరాజ్ ఫీల్ అవుతాడు. అతిక షాపింగ్ చేద్దాం అంటే ఫ్రెండ్ కార్లో వెళ్దాము కానీ కారు తీయను అంటాడు ఈశ్వర్. నెక్ట్స్ సీన్లో కూమారి నీళ్లు అయిపోయాయి, బోరు వేయమంటుంది. దాంతో ఏకరాజ్ కు ఒక ఆలోచన వస్తుంది. కట్ చేస్తే మోటర్ కరాబ్ అయింది. సంపు తీయాలంటే కారు తీయండి అని మెకానిక్ ఈశ్వర్ తో చెప్తాడు. దాంతో ఈశ్వర్ కారు తీస్తాడు. అదే సమయంలో ఆఫీస్ కారు వస్తే దాన్ని వెళ్లిపో అని అంటాడు. టైమ్ అడిగితే 30 మినట్స్ అని చెప్పడంతో ఈశ్వర్ వెళ్లిపోతాడు. త్వరగా రిపెయిర్ చేయండి అని ఏకరాజ్ అంటాడు. సంతోషంతో కారును పార్కింగ్ చేసుకోవాలని కారు తీయగానే ఈశ్వర్ ఫాస్ట్ గా వచ్చి కారును పార్క్ చేస్తాడు. అదే సమయంలో ఏకరాజ్ కంట్రోల్ చేయలేక కారు ఒక గోడను ఢీ కొట్టబోతూ సడన్ బ్రేక్ వేస్తాడు. తరువాత కోపంతో రాయి తీసుకొని ఈశ్వర్ కారును కొడుతాడు. ఈశ్వర్ కోపంతో బయటకు వచ్చి ఏకరాజ్ చొక్కా పట్టుకుంటాడు. ఇద్దరిని అందరూ ఆపుతుంటారు. అమ్మాయిని లేపుకొచ్చిన పోరంబోకు అని ఏకరాజ్ అంటాడు. మంచిగా మాట్లాడు అని ఈశ్వర్ అంటాడు. కోపంతో ఏకరాజ్ బాస్టర్డ్ అంటాడు. కోపంతో ఈశ్వర్ ఏకరాజ్ చెంపపై కొడుతాడు. ఏకరాజ్ లుంగీ ఊడిపోతుంది. అంతలో తన వైఫ్ లుంగీ కట్టుకోండి అందరూ చూస్తున్నారు అని బాధ పడుతుంది. లుంగీ కట్టుకొని నీన్ను ఈ గల్లీలో ఉండనియ్యకుండా చేస్తా అని సవాల్ చేస్తాడు. నేనూ చూస్తా అని ఈశ్వర్ అంటాడు.
ఇంటి ఓనర్ ఫోన్ చేసి సీనియర్ సిటిజన్ మీద చేయి చేసుకోవడం కరెక్ట్ కాదని అంటాడు. ఇష్టం ఉంటే ఉండండి, లేదంటే లేదు అని చెప్తాడు. ఇదే విషయాన్ని ఈశ్వర్ తో చెప్తుంది అతిక. తాను మాత్రం అలా మాట్లాడొచ్చా అని అంటాడు. తరువాత సీన్లో ఆఫీస్ లో తన ఫర్ఫార్మెన్స్ బాగోలేదని టీమ్ లీడర్ అరుస్తాడు. తరువాత సీన్లో అవమానంగా ఫీల్ అయిన ఏకరాజ్ ఈశ్వర్ మీద కంప్లైంట్ ఇవ్వాలని ఆలోచిస్తుంటే వాల్ల బామ్మర్ది ఒక ఆలోచన ఇస్తాడు. కట్ చేస్తే కొట్టడం తప్పే రేపు మార్నింగ్ వెళ్లి సారీ చెప్తా, ఇల్లు కూడా ఖాళీ చేద్దామని ఫ్లాట్ చూస్తుంటే పోలీసు కానిస్టేబుల్ వచ్చి ఈశ్వర్ ను తీసుకెళ్తారు. ఎస్ఐ ఏం జరిగింది అని అడిగి పూర్ణిమతో అసభ్యంగా ప్రవర్తించింది ఇతనేనా అని అడుగుతాడు. ఈశ్వర్ షాక్ అవుతాడు. పూర్ణిమను అడిగితే తాను ఏడుస్తుంది. కార్లో వాళ్ల నాన్న ఇలానే చెప్పమని లేదంటే ఈ అవమానం భరించలేక చనిపోవాలని పిస్తుందని చెప్తాడు. దాంతో భయపడి పూర్ణిమ అవును అని అంటుంది.
కట్ చేస్తే ఇంట్లో పూర్ణిమను తిడుతుంది వాళ్ల అమ్మ. తండ్రి చెబితే మాత్రం ఏ ఆలోచన లేకుండా ఇలానే చేస్తావా అని అంటుంది. మరో సీన్లో పోలీసు స్టేషన్ కు అతిక వెళ్తుంది. పోలీసులను రెక్వెస్ట్ చేస్తుంది. మమ్మల్ని రిక్వెస్ట్ చేసి లాభం లేదు, కంప్లైంట్ ఇచ్చిన వాళ్లతో మాట్లాడండి లేదంటే ఓ లాయర్ ను పెట్టుకోండి అని చెప్తాడు. తరువాత ఏకరాజ్ ను అతిక బతిలాడుతుంది. అతను వినడు. అతిక వెళ్లిపోతుంది. ఏకరాజ్ టేప్ రికార్డులో పాటలు పెట్టుకొని సంతోషపడుతుంటాడు. ఈశ్వర్ జైల్లో ఉండీ బాధ పడుతాడు. కట్ చేస్తే పూర్ణిమ అతన్ని ఎలా విడిపిస్తుంది. కేసు ఎలా వాపస్ తీసుకుంటుందని ఏకరాజ్ బావమరిది అరుస్తుంటాడు. అదే సమయంలో ఈశ్వర్ తన ఫ్రెండ్స్ తో కార్లో వస్తాడు. పూర్ణిమ ఇంట్లోకి వెళ్లగానే ఎవరిని అడిగి వాన్ని తీసుకొచ్చావు అంటాడు. ఎవరిని అడగాల్సి పనిలేదు అని వెళ్తుంది. తరువాత ఈశ్వర్ ను తిడుతుండగా అతిక పైకి తీసుకెళ్లి వాటర్ ఇస్తుంది. కింద అతను తిట్టే మాటలు వినిపిస్తాయి. అతను కిందకు వచ్చి గ్లాస్ తో కొడుతాడు. తనతో ఉన్నవాళ్లు కూడా ఈశ్వర్ పై వస్తుంటే అందరిని కొడుతుంటాడు. అదే సమయంలో ఇంటి ఓనర్ వచ్చి మీ సమస్యలు ఎలాగైనా ఉండనివ్వండి.. పోలీసు స్టేషన్ కు వెళ్లోచ్చావు కాబట్టి ఇల్లు ఖాళీ చేయండి అంటాడు.
తరువాత సీన్లో ఇల్లు ఖాళీ చేసేంత వరకు కారును బయటనే పార్క్ చేసుకుందాం అని చెబుతుంది. తరువాత రోజు తాను షర్ట్ బటన్ సరిగా పెట్టుకోకుండా ఏదో ఆలోచిస్తాడు. అదే సమయంలో అతిక వచ్చి షర్ట్ బటన్ పెట్టి మనకు గొడవలు వద్దు అని చెప్తుంది. దాంతో ఈశ్వర్ కారును బయటకు తీస్తాడు. బయట వెయిట్ చేస్తాడు. అదే సమయంలో ఏకరాజ్ సంతోషపడుతుంటాడు. ఏకరాజ్ నే ఫాలో అవుతూ ఉంటాడు. తరువాతి రోజు ఏకరాజ్ అతిక దగ్గరకు వచ్చి అలా చేసినందు తాను కూడా బాధ పడుతున్నట్లు చెప్పి వెళ్తాడు. ఆఫీస్ లో ఏదో పనిచేసుకుంటుంటే మీకు బాగా కావాల్సిన వారు వచ్చారని క్లర్క్ చెప్తాడు. కట్ చేస్తే అక్కడికి ఈశ్వర్ వస్తాడు. తనతో మాట్లాడి వెళ్తాడు. అతను వెళ్లిన తరువాత డస్ట్ బిన్ లో ఒక కవర్ ఉంటుంది. అందులో డబ్బులు ఉంటాయి. వాటిని ప్యాకెట్ లో పెట్టుకొని అటుఇటు తిరుగుతుండగా విజులెన్స్ ఆఫీసర్స్ వస్తారు. లంచం తీసుకున్నట్లు సమాచారం ఉంది చెక్ చేయాలి అంటారు. అంతా చెక్ చేస్తాడు. తాను డబ్బులను ఫ్యాన్ పై పెడుతాడు. కరెంట్ లేకపోవడం వలన అతను సేఫ్ అనుకుంటాడు. అదే సమయంలో ఫ్యాన్ వేయమంటుంది. ఏకరాజ్ టెన్షన్ పడుతుంటాడు. స్వీచ్ ఆన్ ఉండడం చూసి వాటర్ తాగుతే దాన్ని ఆఫ్ చేస్తాడు. అంతా క్లియర్ గా ఉందని వాళ్లు వెళ్లే సమయంలో కరెంట్ వచ్చిందని క్లర్క్ ఫ్యాన్ వేస్తాడు. డబ్బులు కింద పడుతాయి. ఈశ్వర్ చూస్తూ ఉంటాడు. ఏకరాజును అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఈశ్వర్ సంతోషపడుతుంటాడు.
తరువాత సీన్లో అతిక న్యూస్ చూస్తుంటే ఈశ్వర్ వస్తాడు. ఇదంతా నువ్వే చేశావు కదా అంటే కాదు అంటాడు. అసలెం ఏ జరుగుతుంది. ఇదంతా నువ్వే చేశావు కదా అని అతిక అడుగుతుంది. తన బిడ్డమీద ప్రమాణం చేసి చెప్పమంటే అవును అంటాడు. వాల్ల ఫ్యామిలీ గురించి ఆలోచించావా, అతనికి పెళ్లి కావాల్సిన కూతురు ఉందని అంటే తనవళ్లే కదా నేను జైల్లో ఉన్నాను అని కోపంతో అరుస్తాడు. అదే సమయంలో ఏకరాజ్ ఇంటికి వస్తాడు. అవమానంతో కూర్చుంటాడు. కట్ చేస్తే ఈశ్వక్ కారు టైర్ లూజ్ చేస్తాడు ఏకరాజు. అదే సమయంలో కారు సౌండ్ చేస్తుంది. ఈశ్వర్ కు మెలుకువ వచ్చి ఆఫ్ చేసి కారు దగ్గరకు వచ్చి చూస్తాడు. అక్కడ ఎవరు ఉండరు. ఏకరాజ్ వెనుకాల దాచుకుంటాడు. తరువాత అతను వెల్లిపోతాడు.
ఉదయం ఈశ్వర్ నిద్ర లేచి హాల్ లోకి రాగానే అతిక ఆసుపత్రికి రెడీ అవుతుంది. తాను ఫీల్ అవుతుందని తానే తీసుకెళ్తా అంటాడు. క్యాబ్ కాన్సెల్ చేయమంటాడు. ఇద్దరు కలిసి కార్లో వెళ్తుంటారు. అది ఏకరాజ్ చూస్తాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్లుంటే బోల్టులు ఊడిపోతుంటాయి. కొంత దూరం వెళ్లిన తరువాత కారు కంట్రోల్ తప్పుతుంది. ఈశ్వర్ సడెన్ బ్రేక్ వేస్తాడు. కాస్తలో ప్రమాదం తప్పుతుంది. తరువాత ఆసుపత్రిలో ఈశ్వర్ ఉంటాడు. తల్లిబిడ్డకు ఏం కాలేదు అని డాక్టర్ చెప్తుంది. కట్ చేస్తే ఈశ్వర్ ఇంటికి వచ్చి బ్యాట్ తీసుకొని కారు మిర్రర్ బ్రేక్ చేస్తాడు. తరువాత అద్దాలు అన్ని బ్రేక్ చేస్తాడు. ఎందుకు అని కూమారి తిడుతుంటే కారు టైర్ బోల్టులు బ్రేక్ చేసీ చంపాలని చూశాడు అని చెప్తాడు.
తరువాత అలా ఎలా చేస్తారు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అనే ఆలోచనకూడా లేదా నీతో ఉండలేము అని తల్లి కూతుర్లు ఇద్దరు వెళ్లిపోతారు. మరో సీన్లో అతిక తన డ్రెస్ లను ప్యాక్ చేసుకుంటుంటే ఈశ్వర్ అడుగుతాడు. వద్దని చెప్తున్నా తనను బయటకు పంపంచి డోర్ వేస్తుంది. తరువాత ఈశ్వర్ వేరే అపార్ట్ మెంట్ ను చూడడానికి వెళ్లీ, అక్కడే తన ఫ్రెండ్ తో తాగుతుంటాడు. అదే సమయంలో వర్షం పడుతుంది. కిటీకిలు పెట్టడానికి అతిక వచ్చి జారీ కిందపడుతుంది. నెక్ట్స్ సీన్లో ఈశ్వర్ ఇంటికి వచ్చి పైకీ వెళ్దామననుకొని, ఆలోచించి ఏకరాజ్ ఇంటి బెల్ కొడుతాడు. ఏకరాజ్ తీస్తాడు. నేను ఇళ్లు కాళీ చేసి వెళ్తున్నా, ఇక్కడితో అంతా ఆపేద్దాం, ఈ టూ డేస్ నీ వలన నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు, ఈ సారీ ఏదైనా తేడా వస్తే పెద్దవాడివని కూడా చూడను అంటాడు. ఆ మాటలకు కోపంతో ఏకరాజ్ బాటిల్ తో ఈశ్వర్ తలపై కొడుతాడు. ఈశ్వర్ సృహతప్పి పడిపోతాడు. అతన్ని లోపలకి లాక్కెళ్తుండగా తన వైఫ్ ఫోన్ చేస్తుంది. అతను కట్ చేద్దామనే లోపు లిఫ్ట్ అవుతుంది. తాను ఏడుస్తుంది. దాంతో ఏకరాజు పైకి వెళ్లి తనను చూస్తాడు.
నెక్ట్స్ సీన్లో ఏకరాజు ఇంటికి రాగానే అక్కడ ఈశ్వర్ ఉండడు. అతని కోసం వెతుకుతుంటే సాంగ్స్ ఆన్ చేసి డోర్స్ లాక్ చేస్తాడు. ఏకరాజును కొడుతాడు. ఏకరాజు సృహతప్పి పడిపోతాడు. తరువాత గ్యాస్ ఆన్ చేసి, ఓవెన్ లో ఫోన్ వేసి దాన్ని ఆన్ చేసి లాక్ వేసి బయటకు వెళ్తాడు. నెక్ట్స్ తన రూమ్ కు వెళ్తే అక్కడ బ్లడ్ కనిపిస్తుంది. అతిక అంటూ అరుచుకుంటూ వస్తాడు. అక్కడ ఒక ఫుడ్ డెలివరీ బాయ్ దగ్గర ఫోన్ తీసుకొని అతికకు కాల్ చేస్తే నర్సు ఫోన్ లిఫ్ట్ చేసి తాను ఆసుపత్రిలో ఉందని తన తండ్రి అడ్మిట్ చేసినట్లు చెప్తుంది. కట్ చేస్తే… ఏకరాజు అతికను ఆసుపత్రిలో చేర్పిస్తాడు. తను ఎవరు అంటే తండ్రి అని అంటాడు. ఇదే విషయం నర్సు చెప్పి అతని పేరు ఏకరాజు అంటుంది. దాంతో ఈశ్వర్ తాను తప్పుచేసినట్లు రిలైజ్ అయ్యి ఇంటి తాళం కోసం వెతుకుతాడు. దొరకదు. తలుపులు తెరవాడిని ట్రై చేస్తాడు. గ్యాస్ లీక్ అవుతుంది. ఓవెన్ హీట్ అవుతుంది. వెంటనే వెళ్లి పవర్ మెయిన్ బంద్ చేస్తాడు.
తరువాత సీన్లో ఈశ్వర్ ఆసుపత్రిలో తన బిడ్డను ఎత్తుకుంటాడు. నెక్ట్స్ ఏకరాజు దగ్గరకు వెళ్లి సారీ చెప్తాడు. దాంతో కుమారి మళ్లీ ఎందుకు వచ్చావు అని అంటుండగా.. అతనికి 28 ఏళ్లు ఉంటాయి. నేను 60కి దగ్గర పడుతున్నా నేనే కాస్త ఆలోచించాల్సింది అని సారీ బాబు అంటాడు. ఈశ్వర్ వెళ్లిపోతూ.. తన భార్యను ఆసుపత్రిలో అడ్మిట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తాడు. కట్ చేస్తే ఇల్లును వేరే వాల్లకు చూపించడానికి హౌస్ బ్రోకర్ వస్తాడు. కారు ఉన్న వాళ్లకు ఇంటిని ఇవ్వద్దు అని ఓనర్ చెప్పినట్లు చెప్తాడు. పార్కింగ్ టైటిల్ పడుతుంది.