Toby Movie Explained: ఓపెన్ చేస్తే… ఓ గ్రామంలోని అందరూ ముక్కుపుడక అమ్మవారి గుడి దగ్గర గుమిగూడి ఉంటారు. ఈ రోజు పూజ బాగా జరిగింది ఎల్లుండి కూడా మంచిగా జరిగేలా చూడాలి అని ఆనంద్ మొక్కుతాడు. దానికి తనకు బలి ఇవ్వాల్సిన పొట్టేలు తప్పించుకుంది అని దేవత పూనిన అతను చెప్తాడు. దాంతో వాళ్లలో ఒకడు వెల్లి చూస్తాడు. తిరిగి వచ్చి పొట్టేలు అక్కడే ఉందని చెప్తాడు. లేదు పోట్టేలు తప్పించుకుందని, అది తిరిగి రాకూడదు అని అది మళ్లీ ఊర్లోకి వస్తే పొట్టేలు కాదు, అది అమ్మోరు అవుతుంది అని అంటాడు. టైటిల్ పడుతుంది. మరో సీన్లో స్టేషన్ కు కొత్త ఎస్ఐ వస్తాడు. ఊరు గురించి అడిగి తెలుసుకుంటాడు. ఇక్కడ అన్ని చిన్న చిన్న క్రిమినెల్ కేసులు మాత్రమే వస్తాయి అని హెడ్ కానిస్టేబుల్ చెప్తాడు. ఈ ఊర్లో పెద్దగా సంపాదించుకోలేమని చెప్తుండగా.. బయట జెన్ని గొడవ చేస్తుంది. రాయితో స్టేషన్ అద్దం పగల గొడుతుంది జెన్ని. టోబి ఇల్లు వదిలి వెళ్లి మూడు రోజులు అవుతుంది. తిరిగి వస్తే ఈ ముక్కు పుడక అమ్మవారికి ఇస్తాను లేదంటే, నేనే అమ్మవారు అవుతాను అంటుంది. అక్కడికి డాక్టరు కారు వేసుకొని వచ్చి జెన్నిని కారు ఎక్కమన్నా వినిపించుకోకుండా పచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తూ వెళ్లిపోతుంది. తరువాత సీన్లో ఎస్ఐ, హెడ్ తో ఆ అమ్మాయి గురించి అడుగుతాడు. దానికి వాళ్ల కుటుంబమే అదో రకం, వాల్ల నాన్న కూడా పిచ్చోడు అని హెడ్ చెప్తాడు. అతను చాలా క్రైమ్స్ చేశాడని, అతని పేరు టోబి అని, స్టోర్ రూమ్ తీసుకొని వెళ్లి ఒక ర్యాక్ ను చూపిస్తాడు. అతని ఫైల్ ఎక్కడ అని ఎస్ఐ అంటే ఆ ర్యాక్ మొత్తం టోబీ చేసిన క్రైమే అని హెడ్ అంటాడు. ఎస్ అలా చూస్తుంటాడు.
చదవండి:Vijay Deverakonda: విజయ్ దేవరకొండ-రష్మిక నిశ్చితార్థం… స్పిందించిన టీమ్
నెక్ట్స్ సీన్లో చర్చీ ఫాదర్ దగ్గరకు వెళ్లి టోబి గురంచి అడుగుతారు. అతని వల్లనే నాకు దేవుడి మీద నమ్మకం పోయిందని, టోబి గతం గురించి చెప్తాడు ఫాదర్. తాను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు క్రిష్టమస్ గిఫ్ట్ లు తీసుకొని ఓ ఆనాదశ్రమానికి వస్తాడు. అక్కడ అందరికి గిఫ్ట్ లు ఇస్తాడు. ఇంకో గిఫ్ట్ మిగిలుందని, ఇంకో అబ్బాయి ఎక్కడ అంటే రూమ్ లో పెట్టి తాళం వేసినట్లు అక్కడ వార్డెన్ చెప్తాడు. అతను ఏం చేశాడు అంటాడు ఫాదర్. ఇంతకు ముందు ఇక్కడ ఉన్న పాత ఫాదర్ అతన్ని అత్యచారం చేయడానికి ట్రై చేస్తే.. అతడు ఫాదర్ ను కొరికాడు అని చెప్తాడు. దాంతో అతన్ని నేను చూడాలి, తన దగ్గరకు తీసుకెళ్లు అని ఫాదర్ అంటాడు. డోర్ తీసీ అతన్ని చూస్తాడు. ప్రేమతో కౌగిలించుకుంటాడు. ఆ అబ్బాయి కూడా తనను కౌగిలించుకుంటాడు. కట్ చేస్తే అతను బన్ తింటూ కూర్చుంటాడు. అతని పేరు ఏంటంటే వార్డెన్ అతనికి పేరు లేదని, పాత ఫాదర్ వలన అతని మాట కూడా పోయిందని, తాను మాట్లాడలేడని చెప్తాడు. దాంతో అతని నేను పేరు పెడుతా అని టోబియా అని చెప్తాడు. ఆ పిల్లాడు తన పేరును చేతిమీద రాయమంటే.. రాస్తాడు. దాన్ని మిగితా అందరి పిల్లలకు చూపిస్తాడు. తరువాత ఫాదర్ పేరు రాయమంటాడు. కట్ చేస్తే అతని పేరు పెట్టింది నేనే అని, టొబియా అంటే దేవుడు మంచి వాడు అని అర్థం, కానీ అతడు సైతాన్ లాంటి వాడు. గొడవలు ఆగలేదు, రిమాండ్ నుంచి జైల్ కు వెళ్లాడని చెప్తాడు. తరువాత జైళ్లోనే పెద్దవాడు అవుతాడు. ప్రతీ రోజు అతని పేరు, తన ఫాదర్ పేరును కానిస్టేబుల్ తో చేతిపై రాయించుకుంటాడు.
నెక్ట్స్ సీన్లో ఫాదర్ దగ్గరకు ఆంటోనీ వచ్చి స్కూల్, చుట్టు ఉన్న ఆస్తిని తనకు రాసి ఇవ్వమని గొడవ చేస్తాడు. ఫాదర్ దానికి ఒప్పుకోడు. అదే సమయంలో సంతకాలు పెట్టమని పేపర్స్ ఇస్తుంటే వర్షం పడుతుంది. మరో సీన్లో టోబి వేలుముద్ర వేసి, జైల్ నుంచి విడుదల అవుతాడు. ఫాదర్ ను సంతకం పెట్టమని మొకాళ్లమీద కూర్చుబెడుతాడు టోనీ. అదే సమయంలో అక్కడికి టోబి వస్తాడు. అతని చేతులో ఉన్న ఇంగ్లేసియా అనే పేరును చూపిస్తే.. ఓ పిల్లాడు ఫాదర్ ఇంగ్లేసియా అని అరిచి ఫాదర్ ను చూపిస్తాడు. అదే సమయంలో ఫాదర్ ను కాపాడే మొగాడు ఉన్నాడా అని ఆంటోనీ గ్యాంగ్ అరుస్తుంది. పిల్లాడు అరుస్తాడు. అందరూ పక్కకు తప్పుకోగానే టోబి కనిపిస్తాడు. ఆ సమయంలో ఫాదర్ తాను దేవుడిని చూడలేదని, టోబిని చూశాను కానీ అతను సైతాన్ అని చెబుతాడు. ఆంటోని మనిషి టోబి దగ్గరకు వెళ్లి ఎవడ్రా నువ్వు అంటే తన పేరును చూపించి రాయితో అతన్ని కొడుతాడు. అలా అందరిని కొట్టి స్కూల్ ను ఫాదర్ ను కాపాడుతాడు. తరువాత ఫాదర్ ను పైకి లేపి, తన పేరును చూపిస్తాడు. ఫాదర్ సంతోషపడుతాడు.
టోబి సైతాన్ అని.. ఏ ఆపద వచ్చినా తానే చూసుకుంటాడు. తాను ప్రేమతో కౌగిలించుకుంటాడు. కానీ చచ్చేదాక వదిలిపెట్టడు అని చెప్తాడు. మరో సీన్లో టోబి చర్చీ బయట గేట్ కీపర్ గా వర్క్ చేస్తుంటే అక్కడికి చైర్మెన్ ఇమ్మాన్యూయల్ కార్లో వస్తాడు. కారును కర్రతో కొట్టాడని టోబిపై అరిస్తే టోబి చేయి చేసుకుంటాడు. ఫాదర్ అతనికి సారీ చెప్తాడు. తరువాత బిడీ తాగుతున్నాడని మరో వ్యక్తి చెబితే అతన్ని కూడా చెంపమీద కొడుతాడు. ఫాదర్ ను చూసి వినయంగా ఉంటాడు టోబి. మరో సీన్లో టోబి తాగి పడిపోతే ఫాదరే డబ్బులు కడుతాడు. తరువాత అతన్ని పనిలోంచి తీసేశాను అని, చర్చీకి కూడా రావద్దు అన్నాను అని చెప్తాడు. కానీ అతను సైతాన్ ఎవరి మాట వినేవాడు కాదు. ఒకరోజు చర్చీలో ప్రేయర్ చేస్తుంటే అతను చేపలు పట్టుకొని వస్తాడు. అందరు నవ్వుతారు. అతనికి చేపలు పట్టడం వచ్చా అంటే నేను నేర్పించాను అని దామోదరం ఎస్ఐతో చెప్తాడు. తరువాత టీ తాగుతూ… తనకు టోబి ఎలా పరిచయమో వివరిస్తాడు.
ఒక రోజు రాత్రి ఏట్లో చేపలు పడుతుంటే పక్కనే టోబి కూడా చెరువులో గాలం వేసుకొని కూర్చుంటాడు. అతన్ని బీడీ అడిగితే ఇస్తాడు. తన పేరు అడిగితే మాట్లాడలేనని చెప్పి తన పేరును చూపిస్తాడు. తరువాత టోబికి చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తాడు. నా దగ్గర పనిచేస్తావా అని అడుగుతాడు. తాను మార్చురీలో పని చేస్తా అని చెప్తాడు. అక్కడ ఒక బాడీ ఉంటుంది. దానికి పోస్ట్ మర్టం ఎలా చేయాలో టోబికి చెప్తాడు. డాక్టర్ రాగానే చకచక పని చేస్తాడు టోబి. తరువాత మళ్లీ చేపలు పట్టడానికి వెళ్తారు. ఇక్కడికి ఒంటరిగా రావద్దు అని ఇది ముక్కుపుడక అమ్మోరు తిరిగే స్థలం అని చెప్తాడు. ఒక రోజు చేపలు పట్టడానికి వచ్చాను ఎంత టైమనా చేపలు పడలేదు. దాంతో పీతలు పట్టడానికి చెరువలోకి దిగాను అదే సమయంలో ముక్కుపుడక కనిపించింది. ప్రాణం పోయినట్లు అని పించిందని ఆ రోజు నుంచి అమవాస్య వచ్చిందంటే ఇటువైపు రాను అని చెప్తాడు. అదే సమయంలో ఓ పాప ఏడుపు వినిపిస్తుంది. దామోదరం చూడడానికి వెళ్తాడు. ఆ పొదల్లో ఒక పాప కనిపిస్తుంది. టోబి కోసం వెళ్తాడు. అతను అక్కడ ఉండకపోడవడంతో దామోదరం గ్రామంలో అన్ని తలుపులు కొట్టి పాప పొదల్లో ఉంది అని చెప్తాడు. అదే సమయంలో టోబికి నీటిలో ముక్కుపుడక దొరుకుతుంది. కట్ చేస్తే అందరూ గుమిగూడి పాపను ఏం చేద్దాం, పోలీసులు అప్పజెప్పుదామా, చర్చీ ఫాదర్ కు ఇద్దామా అని మాట్లాడుకుంటుండగా.. అక్కడికి టోబి వచ్చి పాపను ఎత్తుకుంటాడు. అందరూ అలానే చూస్తూ ఉంటారు. పాపను తీసుకొని టోబి వెళ్లిపోతాడు. ఇదే విషయాన్ని ఎస్ఐతో చెప్తాడు. అయితే జెన్ని సొంతకూతరు కాదా అంటాడు ఎస్ఐ.
తరువాత టోబి వంట చేస్తుంటే పాప ఏడుస్తుంది. పాపకు అన్నం పెట్టాలని చూస్తాడు. అదే సమయంలో అక్కడికి నర్సు వచ్చి టోబిని తిట్టి పాలు పట్టిస్తుంది. టోబి పాపకు పాలు పడుతాడు. స్నానం చేయిస్తాడు. పాపను తీసుకొని చేపలు పట్టడానికి వెళ్తాడు. మార్చురీలోనే పాపకు ఊయల కట్టి లాలిస్తాడు. ఇద్దరూ అక్కడే ఉంటారు. ఫాదర్ దగ్గరకు వెళ్ళి పేరు పెట్టమని అడిగితే జెన్ని అని పేరు పెడుతాడు. తరువాతన తనను స్కూల్ లో చేర్పిస్తాడు. అడ్రస్ చెప్పమంటే మార్చురీ అడ్రస్ చెప్తాడు దామోదరం. దాంతో టీచర్ ఆశ్చర్యపోతాడు.
నెక్ట్స్ పాప చదువుకుంటుంది. తనతో ప్రేమగా ఉంటుంది. తన పేరును రాస్తుంది. అది చూసి టోబి ఎమోషనల్ అవుతాడు. తరువాత టోబిని తీసుకొని సారా కొట్టుకకు వెళ్లి అందరికి ఇవ్వమని అడిగితే ఓనర్ లేదు అంటాడు. డబ్బులు ఇస్తే సారా ఇస్తా అంటాడు. తరువాత ఇంటికి వచ్చి ముక్కుపుడకను చూపిస్తాడు. ఇదెక్కడ దొరికింది అంటే గాలం వేసినప్పుడు దొరికింది అని టోబి చెప్తాడు. దాన్ని జెన్ని లాక్కొని పెద్దయ్యగా పెట్టుకుంటా అని అంటుంది. ఇది నకిలిది అని వేరేది ఏదైనా ఉంటే చెప్పు అని దామోదరం అంటాడు. కట్ చేస్తే ఇంటిబైట సారా కాస్తారు. ఇదెక్కడ నేర్చుకున్నావు అంటే ఒక సారి చూశాను అని చెప్తాడు. సారా పాత్ర సౌండ్ వస్తుందని దామోదరం వెనక్కి వెళ్తాడు. టోబి ముందుకు కదులుతాడు. అదే సమయంలో ప్రెషర్ ఎక్కువై పాత్ర పేలుతుంది. కట్ చేస్తే ముగ్గురు పోలీసు స్టేషన్లో ఉంటారు. చిన్నపిల్లను ఎందుకు తీసుకొచ్చారు అని ఎస్ఐ అంటే వద్దన్నా జీపు ఎక్కింద సర్ అని కానిస్టేబుల్ చెప్తాడు. ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది అంటే నీళ్లు అనుకొని టర్పంటాయిల్ ను వేడి చేసినట్లు చెప్తాడు. తాగితే పీడ పోవు అని అంటుండగా.. స్టేషన్లోకి ఒక వేశ్యను తీసుకొస్తారు. తనను టోబి అదోలా చూస్తాడు. ఊర్లో బిజినెస్ చేస్తున్నావా అంటే పోలీసుల దిక్కు అదోలా చూస్తుంది సావిత్రి. టోబీ తనను అలానే చూస్తుంటాడు. తరువాత సావిత్రిని వెళ్లిపొమ్మంటాడు ఎస్ఐ. వీళ్లను కూడా వెళ్లిపొమ్మంటాడు.
నెక్ట్స్ సీన్లో టోబి జెన్ని పడుకొని ఉండగా.. టోబి వింతగా ప్రవర్తిస్తుంటాడు. దానికి జెన్ని ఏం అయింది నీకు అని అడుగుతుంది. స్టేషన్లో చూసిన ఆవిడ బాగుందా.. నచ్చిందా అంటే అవును అంటాడు. కట్ చేస్తే ఎస్ఐ సావిత్రి దగ్గరకు వెళ్లి టోబి గురించి అడుగుతాడు. ఒక రోజు టోబి తన ఇంటి దగ్గర ఉంటాడు. తన చేతులో జెన్ని రాసిన ఉత్తరం ఉంటుంది. దాన్ని ఇవ్వమంటే ఇవ్వడు. దాంతో జెన్ని ఆ లెటర్ తీసుకొని వెళ్తుంది. అక్కడ ఒక అతను ఉంటే అతని వెళ్లిపో అంటుంది జెన్ని. తరువాత ఆ లెటర్ ఇచ్చి నువ్వు టోబికి ఇష్టం అని వెనక్కి చూపిస్తే అక్కడ టోబి ఉండడు. ఒకసారి మాట్లాడుదాం అని సావిత్రి అంటుంది. కట్ చేస్తే ముగ్గురు కలసి ఒక వంతెనపై నిలబడి ఉంటారు. పెద్దవాళ్లము మాట్లాడుకుంటాము అంటుంది సావిత్రి. అతను మాట్లాడలేడు అని టోబిని పెళ్లిని చేసుకుంటావా అంటుంది. తాను పెళ్లి చేసుకోలేనని, తాను ఒక వేశ్య అని చెప్తుంది. పెళ్లి కుదరదు, ఫ్రెండ్ షిప్ అయితే ఒకే అని సావిత్రి చేయి ఇస్తుంది. జెన్ని వద్దంటుంది. టోబి చేయి కలుపుతాడు.
తరువాత ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు. సరదాగా గడుపుతుంటారు. పాట మొదలు అవుతుంది. ఐస్ క్రీమ్ తింటుంటారు. సావిత్రి టోబిని అదోలా చూస్తుంది. తరువాత ఒక రోజు సావిత్రి ఇంకో మగాడితో ఉంటుంది. దానికి టోబి కోపంగా ఉంటాడు. నేను అంతా ముందే చెప్పాను కదా అని వెళ్లిపోతుంది. తరువాత టోబి ముందే మరో వ్యక్తితో బైక్ లో వెళ్తుంది. టోబి తాగి సావిత్రి ఇంటికి వెళ్తాడు. సావిత్రి చూస్తుంది. నెక్ట్స్ సీన్లో తన ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు మాట్లాడు అని జెన్ని చెప్తుంది. సావిత్రి టోబి ఇద్దరు మళ్లి మాట్లాడుకుంటారు. సావిత్రి నవ్వుతుంది. అలా ఇంటి బయట చెప్పులను చూసి మగవాళ్ల చెప్పులు ఉంటే లోపలికి వెళ్లరు. చెప్పులు లేకపోతే వెళ్తారు.
జెన్ని పెరిగి పెద్దది అవుతుంది. స్కూల్ లో ఓ టీచర్ జెన్నితో తప్పుగా ప్రవర్తిస్తాడు. జెన్ని అతన్ని చెప్పుతో కొడుతుంది. తాను ఇక నుంచి స్కూల్ కు వెళ్లను అని సావిత్రితో చెప్తుంది. తరువాత నీటిలో నత్త గుల్లలను సేకరించి అమ్ముతుంది. అలా బిజినెస్ చేసుకుంటూ సాయంత్రానికి ఆసుపత్రికి వస్తుంది. ఓ రోజు ఆసుపత్రికి వస్తుంటే అక్కడ జెన్నిని ఒకడు టీజింగ్ చేస్తుంటాడు. ఎన్నాళ్లని ఈ శవాల గదిలో పడుకుంటావు, మా ఇంటికి ఒకసారి రా అంటాడు. అది సావిత్రి వింటుంది. నెక్ట్స్ సీన్లో సావిత్రి ఇంటికి టోబి వస్తాడు. అతన్ని కిటికీలోంచి చూసి ముహంపై నీళ్లు కొడుతుంది. ఇలా తాగి తిరగడం కాదు, ముందు ఒక ఇల్లు కట్టు, అందులో నీ కూతుర్ని పెట్టు అంటుంది. ఎందుకు అంటే ముందు ఇళ్లు కట్టు అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది. తాను ప్రామీస్ అని అడిగితే.. మళ్లీ నీళ్లు పోస్తుంది.
టోబి ఇల్లు కట్టుకోవడానికి లోన్ కావాలని మెడలో ట్యాగ్ పెట్టుకొని అన్ని బ్యాంక్స్ ను అడుగుతాడు. ఎవరు ఇవ్వరు. దాంతో టోబి ఆలోచనలో పడుతాడు. తనను ఇళ్లు కట్టుమని చెప్పడమే నేను చేసిన తప్పు అని సావిత్రి ఎస్ఐ తో అంటుంది. ఇల్లు కట్టడం కోసం తాను ఎంచుకున్న దారి తలుచుకుంటే భయమేస్తుంది అంటుంది. ఏం జరిగిందని ఎస్ఐ అడుగుతాడు. ఆనంద్ కనిపించడం లేదని పోస్టర్ ఉంటుంది. దాన్ని ఆనంద్ చూస్తాడు. ఈ ఊళ్లో ఎవరైన కనిపించడం లేదని పోస్టర్ అంటిస్టే వాళ్లు నాలుగురోజుల్లో కనిపించకుండానే పోతారు అని చెప్తుంది. ఆనంద్ ది మటన్ షాప్. తన వ్యాపారం బాగా నడుస్తుందని అతని దగ్గరకు వచ్చి మటన్ పై కిరోసిన్ పోస్తాడు సంతోష్. ఈ గ్రామంలో నేను మాత్రమే ఈ బిజినెస్ చేయాలి అని వార్నింగ్ ఇస్తాడు. తరువాత సీన్లో ఆనంద్ గొర్రెలన తెప్పిస్తాడు. సంతోష్ కు తెలిస్తే ఏం చేద్దామని తన స్నేహితులు అంటే, ఎలా తెలుస్తుంది అంటుండగా.. సంతోష్ గ్యాంగ్ చూస్తుంది. నెక్ట్స్ సీన్లో ఆనంద్ మిస్సింగ్ పోస్టర్స్ అంటిస్తారు. మరో సీన్లో ఆనంద్ తన ఫ్రెండ్స్ తో అడవిలో తింటూ సంతోష్ ను లేపెద్దాం అని మాట్లాడుకుంటారు. దానికి టోబి దగ్గరకు వెళ్లి సంతోష్ ను లేపేస్తే.. ఇల్లు కట్టిస్తా అంటారు. టోబి ప్రామిస్ అడుగుతాడు. ఆనంద్ ప్రామిస్ చేస్తాడు.
తరువాత సీన్లో మూడు లోడ్ల గొర్రెలను తీసుకురా అని దామోదరంకు చెప్తాడు. ఇదే విషయాన్ని ఎస్ఐకి చెప్తాడు దామోదరం. వాడు వేటాడంలో చాలా చురుకు అని అంటాడు. గొర్రెల లోడ్స్ దిగుతాయి. అది చూసి ఆనంద్ భయపడుతాడు. అక్కడే సావిత్రి చూస్తుంది. సంతోష్ గ్యాంగ్ విషయం తెలుసుకొని అక్కడికి వస్తారు. ఆనంద్ భయపడుతుంటాడు. తన ఫ్రెండ్స్ కత్తుల కోసం వెతుకుతుంటారు. ఆ చీటి చూసి నువ్వు తెప్పించకపోతే ఇంకెవరు తెప్పిర్రా అని సంతోష్ అరుస్తాడు. ఆ గొర్రెల మధ్యలోంచి టోబి చేయి లేపుతాడు. తన పేరు చూపిస్తాడు. అలా నడుచుకుంటూ వస్తుంటే ఒకడు తనను ఆపుతాడు. కత్తి తీస్తాడు. అతన్ని టోబి కొడుతాడు. అలా కొడుతూ.. తన ఇంటికి రాయి వేసినట్లు కల కంటాడు. తాను కూడా కత్తి తీసుకుంటాడు. ఇంటికి నీళ్ళు పోస్తాడు. వాల్లను కొడుతూనే సావిత్రిని పెళ్లి చేసుకున్నట్లు కల కంటాడు. ఆనంద్ ఫైట్ చేయడానికి వస్తే అతన్ని పొట్టలో పొడిచి తల నరికేస్తాడు. కట్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. జెన్నికి నేను వస్తా నీకు ఏం కాదు అని చెప్తాడు. ఇల్లు కట్టుకుందాం అని చూపిస్తే జెన్ని ఏడుస్తుంది.
పోలీసులు జెన్ని ఇంటికి వెళ్తారు. అక్కడ ఓపాపతో శాలిని ఉంటుంది. ఆ పాప జెన్ని కూతురు అని చెప్తుంది. ఆనంద్ ఇలాంటి ఇల్లు ఎందుకు కట్టించాడు అని ఎస్ఐ అడుగుతాడు. అధికారం వచ్చాకా ఆనంద్ చెడ్డవాడిగా మారిపోయాడు అని చెప్తుంది. ఆనంద్ చేస్తున్న స్మగ్లింగ్ బిజినెస్ పై రైడింగ్ జరుగుతుంది. అక్కిడికి ఆనంద్ వస్తాడు. ఇది చాలా పెద్ద రైడింగ్ అని చెప్పి, మిమ్మల్ని ఏదో రోజు జైల్ కు తీసుకెళ్తా అని చెప్పి కస్టమ్స్ ఆఫీసర్ వెళ్లిపోతాడు. ఆనంద్ అలానే చూస్తుంటాడు. మరో సీన్లో టోబి జైల్ నుంచి విడుదల అవుతాడు. సావిత్రి గురించి అడిగితే తాను ఇంకో పెళ్లి చేసుకుందని బోర్డ్ చూపిస్తారు. దామోదరం, టోబి ఇద్దరు తాగి సావిత్రి ఇంటి ముందు డ్యాన్స్ చేస్తుంటారు. అక్కడికి జెన్ని వచ్చి ఇద్దరిని కొట్టి పంపించేస్తుంది. సావిత్రి కిటికిలోంచి ఇందంతా చూస్తుంది.
తరువాత సీన్లో టోబి, జెన్ని ఇద్దరు నత్తగుల్లల వ్యాపారం చేసుకుంటారు. అక్కడ ప్రశాంత్ జెన్నికి లైన్ వేస్తుంటాడు. జెన్ని కూడా మురిసిపోతూ ఉంటుంది. అక్కడికి ఆనంద్ తన మనసులతో కార్లో వస్తాడు. వాళ్లను కలవడానికి టోబి లేస్తే జెన్ని వద్దంటుంది. టోబి ఆగిపోతాడు. ఆనంద్ టోబి దగ్గరకు వచ్చి ఇదేం పని, ఇంకో పని దొరకలేదా.. ఏదైనా అవసరం ఉంటే ఇంటికి రా అని చెప్తాడు. ఎం అవరసరం లేదని జెన్ని అంటుంది. తను ఎవరు అంటే నా కూతురు అని టోబి చెప్తాడు. అవసరం వస్తుంది. ఇంటి రా అని చెప్తాడు. కట్ చేస్తే.. ఇంటికి నోటిస్ అతికించి ఉంటుంది. అడిగితే… గవర్నమెంట్ ఇళ్లు అని ఒక వారం రోజుల్లో మీరు ఇల్లు కాళీ చేయాలని ప్రభుత్వ ఆఫీసర్ చెప్తాడు. నన్ను ఎవరితో మాట్లాడమంటావు అని అంటే ప్రెసిడెంట్ ఆనంద్ తో అంటాడు. తరువాత నేను అక్కడికి రాను అని జెన్ని అంటుంది. టోబి ఆనంద్ ఇంటికి వెళ్లి హెల్ప్ అడుగుతాడు. అక్కడికి టీ వస్తుంది. కప్ లో టీ టోబి తాగుతాడు. ఆనంద్ చూస్తుంటాడు. ఆధికారితో మాట్లాడుతాడు ఆనంద్, టోబి ఇంటి పట్టా ఇప్పించండి ఎంత డబ్బు అయిన నేను ఇస్తా అంటాడు. నీకు హెల్ప్ చేశాను నాకు ఒక హెల్ప్ చేయి అని అంటాడు.
తరువాత సీన్లో చెరుకు మిషన్ ఆన్ చేసి కస్టమ్ ఆఫీసర్ ను చంపమని చెప్తాడు. దాంతో అతన్ని చంపేసి చెరకు మిషన్లో వేస్తాడు. తరువాత ఆనంద్ పై పోటీ చేస్తున్న శంకర్ నాయక్ ను కూడా చంపేస్తాడు. అక్కడే చెత్తకుప్పదగ్గర మందు తాగుతాడు. మరో సీన్లో జెన్ని తన లవర్ కూర్చొని టీ తాగుతుంటాడు. మన విషయం మీ నాన్నకు తెలిస్తే నన్ను ఏం చేయడు కదా అని అంటాడు. తాను ఏం చేస్తాడు అంటుంది. మీ నాన్న తలుచుకుంటే ఎవరు కనపడకుండా పోతారట కదా అని అంటాడు. తాను నడుచుకుంటూ వస్తుంటే శంకర్ నాయక్ మిస్సింగ్ ఫోటో అతికిస్తారు. అది చూసి జెన్ని ఆనంద్ ఇంటికి వెళ్లి తిడుతుంది. ఆనంద్ అవమానంగా భావిస్తాడు. ఇంకా ఎన్ని రోజులు చిల్లర డబ్బులు ఇచ్చి టోబిని వాడుకుంటాం, అతన్ని వదిలేయ్ అని కావాలంటే
ఈ డబ్బులు తీసుకో అని తన దగ్గర ఉన్న డబ్బులు విసిరేసి వెళ్తుంది. ఆనంద్ ఆ చిల్లర డబ్బులు ఏరుకుంటాడు. తన అసిస్టెంట్ వస్తే వద్దంటాడు.
కట్ చేస్తే టోబి, జెన్ని పడుకొని ఉండగా పోలీసులు వచ్చి దొంగతనం కేసులో టోబిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇదే విషయాన్ని దామోదరం ఆనంద్ తో చెప్తే జెన్నిని వచ్చి మాట్లాడమని చెప్తాడు. జెన్ని వస్తుంది. ఆనంద్ మాట్లాడకుండా వెళ్లిపోతాడు. రాత్రి అన్న ఇంటికి వచ్చి మాట్లాడుతాడని తన అసిస్టెంట్ చెప్తాడు. జెన్ని పడుకొని ఉంటుంది. ఆనంద్ ఇంటికి వస్తాడు. జెన్నితో తన కొరికను తీర్చుకుంటాడు. తాను విసిరిన డబ్బులు ఇస్తాడు. అలా జరుగుతూనే ఉంటుంది. టోబి బయటకు వస్తాడు. మళ్లీ ఏదో కేసు అని పోలీసులు తీసుకెళ్తారు. ఆనంద్ జెన్ని ఇంటికి వస్తాడు. ఈ విషయాన్ని జెన్ని తన ప్రశాంత్ తో చెప్తుంది. తాను సపోర్ట్ గా ఉంటాడు. అలా జరుగుతూనే ఉంటుంది. టోబి ఒక రోజు తన డిబ్బి నుంచి డబ్బులు తీస్తుంటే జెన్ని తిడుతుంది. ఆ డబ్బులు ముట్టకు అని చెప్తుంది. అదే సమయంలో జెన్ని ప్రెగ్నెంట్ తో ఉంటుంది. కట్ చేస్తే కడుపుకు కారణం ఎవరు అని ఆనంద్ అంటాడు. నేనే అని ప్రశాంత్ చెప్తాడు టోబి కొపంతో కొట్టాలని చూస్తే జెన్ని తిడుతుంది. దాంతో టోబి ఏడ్చుకుంటూ తన బట్టలు సర్దుకొని మార్చురీ రూమ్ కు వెళ్లిపోతాడు.
తరువాత జెన్నికి పాప పుడుతుంది. వాళ్లు సంతోషంగా ఉంటారు. టోబికి కూడా కోపం పోతుంది. జెన్ని కూతుర్ని చూడడానికి ఇంటి వస్తుంటాడు. తనకు తాటాకు గాలిమోటర్ చేసి ఇస్తాడు. ఇదే విషయాన్ని ఎస్ఐకి చెప్తుంది. తరువాత సీన్లో ఆనంద్ సరకును పట్టుకుంటారు కస్టమ్ ఆఫీసర్స్ . ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఇవ్వమంటే.. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో చెప్పండి మీకు ఎంత కావాలో అంత తీసుకెళ్లండి అని ఆనంద్ అంటాడు. పేరు చెబితే ఒకే సారి, చెప్పకుంటే సరకు ఒచ్చిన ప్రతీ సారి అని అక్కడినుంచి వెళ్లిపోతాడు. వాళ్లకు ఇన్ఫర్మెషన్ ఇచ్చిన వాడు నాకు కావాలి అని ఎల్లుండి మాలొస్తుందని అందరికి చెప్పి వేరే వేరే అడ్రస్ ఇవ్వండి అని అంటాడు. ఇదే విషయాన్ని అందరు మాట్లాడుకుంటారు. కస్టమ్ ఆఫీసర్లు వస్తారు. ఈ సారి ఆలు గడ్డలు దొరుకుతాయి. అక్కడికి ఆనంద్ వస్తాడు. ఆఫీసర్లు వెళ్లిపోతారు. ఈ ప్లేస్ గురించి ఎవరు చెప్పారు అంటే ప్రశాంత్ అని చెప్తాడు. దాంతో టోబితో వాన్ని లేపించేద్దాం అని ఆనంద్ అంటాడు. తరువాత మర్చూరీ రూమ్ దగ్గర ఆనంద్ వెయిట్ చేస్తాడు. టోబి బయటకు రాగానే ప్రశాంత్ ను లేపెయ్యమని చెప్తాడు.
నెక్ట్స్ డే ప్రశాంత్ ను సెలవు తీసుకో అని సగం డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించేస్తారు. ఆనంద్ తన ప్లానన్ టోబికి చెప్తాడు. టోబి మందు తాకి ప్రశాంత్ ను చంపడానికి బయలుదేరుతాడు. ప్రశాంత్ ఇంటికి వెళ్తాడు. టోబి ఇంటికి వస్తాడు. ప్రశాంత్ డోర్ పెట్టి పడుకొని ఉంటాడు. టోబి తన చెప్పులు వదిలి ఇంట్లోకి వెళ్తాడు. ఆనంద్ మనుషుల కారు వస్తుంది. ప్రశాంత్ మెడకు టవాల వేస్తాడు. తనను చంపాలని చూస్తాడు. అదే సమయంలో జెన్ని వస్తుంది. అరుస్తుంది. ప్రశాంత్ తప్పించుకొని బయటకు వెళ్తాడు. జెన్ని తిట్టుకుంటూ అసలు విషయం చెప్తుంది. తన కడుపుకు కారణం ఆనంద్ అని చెప్తుంది. తన వచ్చిన ప్రతి సారి ఒక్కో కాయిన్ వేశాడని చెప్తుంది. డిబ్బి చూపిస్తుంది. అది విని టోబి ఏడుస్తాడు. లేచి కత్తిపట్టుకుంటాడు. అలా చేస్తే వాడి స్థానంలో ఇంకోడు వస్తాడు. అని అనగానే టోబి ఏడుస్తాడు. అతన్ని పట్టుకొని జెన్ని ఏడుస్తుంది. వాళ్లను చూసి శాలిని వెళ్లిపోతుంది. తరువాత జెన్ని నిద్రలేచి టోబి కోసం వెతుకుతుంది. ఇలా మూడురోజులుగా వెతుకుతూనే ఉంది. ఈ రోజు ముక్కుపుడక వేసుకొని నేను అమ్మోరు అనుకుంటూ పిచ్చిదానిలా వెతుకుతుంది అని శాలిని ఎస్ఐకి చెప్తుంది. టోబి రాడు సర్.. వాడు బతికుంటే కదా రావడానికి అని శాలిని అంటుంది.
టోబి వస్తాడు అని ఫాదర్ అంటాడు. టోబి రావాలి అని దామోదరం అంటాడు. సావిత్రి కూడా తాను వస్తాడు అని అంటుంది. అదే సమయంలో ప్రశాంత్, టోబి తన ఫ్రెండ్ బస్సు దిగి ఊర్లొకి వస్తారు. ఆనంద్ కు విషయం తెలుస్తుంది. వాళ్లిద్దరిని చంపేయమంటాడు. వాళ్లు ఇంటికి రాగానే జెన్ని కోసం వెతుకుతుండగా ఆనంద్ మనుషలు టోబిని కొడుతారు. ప్రశాంత్ ను పొడుస్తారు. టోబిని కూడా తీవ్రంగా పొడుస్తారు. వారిద్దరిని తీసుకొని శాలిని ఆసుపత్రికి వెళ్తుంది. అక్కడికి పోలీసులు వస్తారు. ప్రశాంత్ చనిపోయాడు అని టోబి కండిషన్ సీరియస్ అని మాట్లాడుకుంటారు. తరువాత ఆసుపత్రికి ఫాదర్ వస్తారు. జెన్ని కూతుర్ని జాతరకు తీసుకెళ్లండి శాలిని అంటుంది. కట్ చేస్తే టోబి ఇలానే ప్రశాంతంగా చనిపోవాలని డాక్టర్ అంటాడు. జెన్ని కోసమైనా బతకాలి అని శాలిని అంటే.. జెన్ని లేదు.. ఈ నిజం తెలస్తే టోబి తట్టుకోలేడు. అందుకే ఇక్కడే చనిపోవాలంటాడు.
టోబిని వెతుకుతూ జెన్ని ఆసుపత్రికి వచ్చి సర్జికల్ బ్లేడ్ తీసుకొని నేనే అమ్మోరు, నేను అమ్మోరు అనుకుంటూ వెళ్తుంది. తన వెనుకే డాక్టర్ వెళ్లి టోబికి ఏం కాదు, నువ్వు కారెక్కు అంటే వినకుండా వెళ్తుంది. డాక్టర్ వెతుకుతుంటాడు. షాప్ దగ్గర ఆనంద్ గాయపడుతాడు. జెన్ని తనను గాయం చేస్తే జెన్నిని కొడుతాడు. అక్కడే జెన్ని ముక్కుపుడక కనిపిస్తుంది. తనను చంపి ముఠ కడుతారు. ఆనంద్ వచ్చి ఏంటి డాక్టర్ అంటే ఏం మాట్లాడకుండా వెళ్తాడు. అందుకే చెప్తున్నా టోబి చనిపోవడమే మంచిది అంటాడు. కానీ అతను కళ్లు తెరిచాడు అని శాలిని అంటుంది.
చెత్తకుప్పలో జెన్నిని పడేసిన స్థలంలో టోబి వెతుకుతుంటాడు. అక్కడున్న వ్యక్తి బాడీ పడేసిన ప్లేస్ చూపిస్తాడు. అక్కడ ముక్కుపుడక దొరుకుతుంది. తీవ్రంగా ఏడుస్తాడు. ఇంటికి వచ్చి డిబ్బి పగలగొట్టి పైసలు తీసుకుంటాడు. మరో సీన్లో జాతర కోసం ఒక ఫ్యామిలీ వెళ్తుంటే అక్కడికి టోబి వస్తాడు. ఏంటి అని అడిగితే ముక్కు కుట్టమంటాడు. తరువాత తాను చీరచుట్టుకుంటాడు. తులసి చెట్టుదగ్గర కూర్చుంటాడు. అతను తులసి చెట్టుకు నీల్లు పోస్తాడు. టోబి కూడా తడిస్తాడు. హారతి ఇస్తాడు. ముక్కుకుడుతాడు.
మరోసీన్లో జాతరకు గుర్రం వచ్చిందని అందరూ వెళ్లగొడుతారు. దానికి ఒక స్టోరీ ఉందని, గతంలో ఇక్కడ ఉన్న నీచమైన రాజులను అమ్మోరు గుర్రం మీద వచ్చి అంతం చేసిందంట. అందుకే ఈ ఊర్లో గుర్రానికి అనుమతి లేదు అని చెప్తాడు. అక్కడే పూజ మొదలు అయింది పొట్టేలును తీసుకురా అని ఆనంద్ పంపిస్తాడు. పొట్టేలు వస్తుంటే గుర్రంపై టోబి వస్తాడు. అందరూ అలా చూస్తుంటారు. దామోదరం ఆశ్చర్యంతో చూస్తుంటాడు. ఆనంద్ భయంతో చూస్తుంటాడు. సావిత్రి ఆందోళనగా చూస్తుంది. ఆనంద్ మనుషులను టోబి కొడుతుంటాడు. ఆనంద్ తో ఫైట్ చేస్తాడు. అక్కడికి ఎస్ఐ వస్తాడు.చ గన్ తీసుకొని రా అని హెడ్ కు కాల్ చేస్తాడు. ఆనంద్ టోబి ఇద్దరు కొట్టుకుంటారు. ఆనంద్ మీద ఎగిరి కూర్చొని చెంపల మీద కొడుతుంటాడు. తరువాత ఆనంద్ ను కత్తితో నరికేస్తాడు. ఎస్ఐ గన్ తో టోబిని కాల్చేస్తాడు. ఫాదర్ పొట్టిని కిందకు దించేస్తాడు. పాప టోబిని లేపుతుంది. ఎస్ఐ బాధపడుతుంటాడు. ఫాదర్ పాపను తీసుకొని వెళ్లిపోతాడు.