Vijay Deverakonda-Rashmika's engagement... a team that responded
Vijay Deverakonda: అర్జున్ రెడ్డితో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda).. ప్రజెంట్ కెరియర్ పైనే కంప్లీట్ ఫోకస్ పెట్టారు. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika) కూడా తన ప్రాజెక్ట్‌లపై దృష్టిపెట్టారు. వీరిద్దరు గీతాగోవిందం చిత్రంలో కలిసి నటించారు. ఆన్ స్క్రీన్ పెయిర్ బాగుంది. దాంతో ఆఫ్ స్క్రీన్‌లో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని పుకార్లు వచ్చాయి. వాటిని ఈ నటీనటులు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఆకతాయిలు రెచ్చిపోయారు.
తాజాగా వీరి ఎంగేజ్ మెంట్ డేట్ ను ఫిక్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాంతో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా టీమ్ స్పందించింది. మాములుగే వీడీ డిజిటల్ చాలా ఫాస్ట్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరోయిన్ రష్మికతో విజయ్ ఎంగేజ్మెంట్ అంటు వస్తున్న వార్తలను కొట్టిపడేశారు. ఇలాంటి పుకార్లు నమ్మోద్దని వీడీ అభిమానులకు సూచించారు. ప్రస్తుతం విజయ్ ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నారు. గీతా గోవిందం దర్శకుడు పరసురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సీతారామమ్ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు.