Polimera 2: పొలిమేర 1 విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా పొలిమేర 2 వచ్చింది. పార్ట్ 1 లో చేతబడి చేసి చంపిన కొమురయ్య పారిపోతాడు. అక్కడినుంచి పార్ట్ 2 మొదలౌతుంది. చేతబడి పేరుతో జరిగే అనుమానపు హత్యలన్నింటికి సమాధానాలు కావాలి, న్యాయం కావాలి అనే కొమురయ్య తమ్ముడు జంగయ్య కోర్టులో కేసువేస్తాడు. వాళ్లది జాస్తిపల్లి, చిన్న కుటుంబం. వాళ్ల అన్నయ్య కొమురయ్య ఆటో డ్రైవర్, అందరి బాగుకోరే మంచివాడు అని, ఇక అమ్మాలాంటి వదిన లక్ష్మీ అని, స్నేహితుడు బలిజ, తన భార్య రాముల అని చెప్తాడు. ఇక వాళ్లింట్లో ఉన్న చిన్నోడు వాళ్ల అన్న కొడుకు అని అంటాడు. ఊర్లో సర్పంచ్ ఉన్నా అతనికి ఆడవాళ్ల మీద మోజు తప్ప ఊరు బాగుచేయాలనే సోయి లేదని చెప్తాడు. ఊరును బాగు చేసి, అన్యాయాలను అరికట్టాలని తాను పోలీసు అయినట్లు బలిజ చెప్తాడు. తాను పోలీసులు అయిన తరువాత తన మొదటి కేసు వాళ్ల అన్న మర్డర్ కేసు అని దానికోసం జంగయ్య చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తే కొన్ని నిజాలు తెలిసినట్లు వాళ్ల వదినతో, ఫ్రెండ్ జంగయ్యతో చెప్తాడు. న్యాయం కోసం కోర్టులో కేసు వేసి తీర్పు ఇచ్చే సమయంలో కేసును వెనక్కు తీసుకుంటాడు జంగయ్య. ఎందుకంటే వాళ్ల అన్న నిజంగానే చేతబడి చేసినట్లు చెప్తాడు. ఇదే తన దర్యాప్తులో బయటపడిందని వారికి చెప్తాడు.
చదవండి:Hanuman: అది హనుమాన్ స్ట్రాటజీ నా..?
ఒక స్వామిజీ రేణుక అవతారం గురించి చెప్తాడు. అది చేయాలంటే మాములు వ్యక్తుల వల్ల కాదు, ఆరితేరిన మంత్రగాడు అయితేనే ఇది సాధ్యం అవుతుందని చెప్తాడు. అది వాళ్ల వదిన, బలిజ నమ్మరు. దాంతో వాళ్ల అన్నయ్య స్టోరీని చెప్తాడు. చిన్నప్పుడు వాళ్ల అన్న కవితను ఇష్టపడడంతో వాళ్ల వాళ్లు కొట్టారని, తరువాత కొమురయ్య స్కూల్ మానేశాడు. దాంతో అతని బతుకుదెరువు కోసం వాల్ల పెదనాన్న మంత్రాలు నేర్పించాడని అంటాడు. మరిచిపోయిన కవిత చాలా రోజుల తరువాత కనిపించడంతో తనను ఎలాగైనా దక్కించుకోవాలని కొమురయ్య తనపై రేణుక అవతారం ప్రయోగించి చేతబడి చేసిండని చెప్తాడు. ఇదే క్రమంలో వాళ్ల ఊరు సర్పంచ్ ను చంపింది కూడా వాళ్ల అన్నే అని చెప్తాడు. ఇదే విషయాన్ని కోర్టులో చెబితే ఈ దేశంలో జరిగిన అన్ని అనుమానపు చావులు, మంత్రాలతో చనిపోయినట్లు అవుతాయని వాళ్లతో జంగయ్య చెప్తాడు. ఇన్ని తప్పులు చేశాడు, తరువాత చనిపోయాడు అనుకొని వాళ్ల వదిన ఏడుస్తుంది. అన్న ఇంకా బతికే ఉన్నాడు అని జంగయ్య అంటాడు. ఆ రోజు జరిగిన పెనుగులాటల చితిలో పడింది కొమురయ్య కాదు కాటికాపరి అని,
తప్పు ఎవరు చేసినా చట్టం దృష్టిలో అందరు సమానమే కొమురయ్యకు శిక్ష పడేలా చూస్తా అంటూ జంగయ్య సైకిల్ పై వెళ్తాడు.
తరువాత సీన్ లో ఉత్తరాఖండ్ లోని నందికుండ్ హిమాలయ ప్రాంతంలోని సాధువు ఒక అతనికి భారతదేశం గొప్పతనం గురించి భోదిస్తుంటాడు. మన దేశంలో చాలా విజ్ఙానం, సంపదను నాగబంధనం, జలబంధనం లాంటి వాటితో భద్రపరిచారు అని చెప్తాడు. ఆ నాగబంధనాన్ని విడిపించడం ఎలా అని అతను అడుగుతాడు. సాధువు అలా చూస్తాడు.
నెక్ట్స్ సీన్లో రోడ్డు సైడ్ ఉన్న ఒక హోటల్లో కొమురయ్య పనిచేస్తూ పక్కనే ఉన్న కవితకు వాటర్ బాటిల్ ఇస్తూ ఏంది అలా ఉన్నావు అంటాడు. దానికి ఇంటి ముందు పిల్లి చనిపోయిందని కవిత చెప్తుంది. చిన్న వాటికే అలా భయపడకు అని, నువ్వు ఇంటికి వెళ్లు నేను వస్తా అంటాడు. తరువాత పాల క్యాన్ తీసుకొని పాలు తీసుకురావాడనికి వెళ్తాడు. అక్కడ పాలు పోసే వ్యక్తి ఆవుపాలు పోస్తున్న అని చెప్తాడు. ఆవు పేరు లక్ష్మీ అంటాడు. దాంతో కొమురయ్యకు తన భార్య గుర్తుకు వస్తుంది.
జాస్తిపెల్లిలోని పున్నమి ఇల్లు అని టైటిల్ పడుతుంది. అక్కడ లక్ష్మీ తన బొట్టు, తాళి తీసేసి నల్లతాడు వేసుకుంటుంది. తన కొడుకును తీసుకొని తన ఇంటికి వస్తుంది. ఇంటిదగ్గర బలిజ కూర్చొని ఉంటాడు. ఇంత పొద్దున్నే ఏంది బలిజ అని లక్ష్మి అడుగుతుంది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటాడు. నిన్న పున్నమి కదా, కొమురయ్య ఉన్నప్పుడు ప్రతీ పున్నానికి అక్కడికి తీసుకెళ్లేవాడు, అందుకే వెళ్లి వచ్చా అంటుంది. మాలా వేశావు కదా ఇప్పుడు ఎలా ఉంది అని లక్ష్మీ అడుగుతుంది. నా తాగుడుతో రాములను చాలా ఇబ్బంది పెట్టిన, మాల వేస్తే తాగుడు ఆగుతుందని వేసినా అని చెప్తాడు. తన భార్య పుట్టింటికి పోయిందని, వాల్ల తల్లిదండ్రులకు బాగా లేదని డబ్బులు కావాలంటుందని. నా దగ్గర డబ్బులు లేవని బాధ పడుతాడు. దాంతో లక్ష్మి ఒక్క నిమిషం అని ఇంట్లోకి వెళ్లి తన కమ్మలు తీసుకొని వస్తుంది. అవి బలిజకు ఇచ్చి వీటిని కుదవపోట్టి రాములకు డబ్బులు పంపించు అంటుంది. అతను వద్దన్న చేతులో పెడుతుంది. అంతలో బలిజకు రాముల ఫోన్ చేస్తుంది. ఫోన్ తీసుకొని లక్ష్మీ విషయం చెప్తుంది. నీకు కష్టంలో నేను తోడు లేకున్నా నాకు సాయం చేస్తున్నవు అక్కా అని రాముల అంటుంది. బలిజ కమ్మలు తీసుకొని వెళ్లిపోతాడు. లక్ష్మీ ఆలోచనలో పడుతుంది.
కొమురయ్య ఆ కమ్మలు తీసుకొచ్చి తనకు ఇచ్చినట్లు కలగంటుంది. పొలంలో ప్రేమగా అన్నం కలిపి పెడుతుంది. పోలీసు అయిన జంగయ్యకు కొమురయ్య టోపీ పెడుతాడు. కట్ చేస్తే స్టేషన్ కు కొత్తం ఎస్ఐ వస్తున్నట్లు మాట్లాడుకుంటారు. బుల్లెట్ పై ఎస్ఐ వచ్చి స్టేషన్లో కూర్చుంటాడు. అక్కడి స్టాఫ్ వచ్చి పరిచయం చేసుకుంటారు. అదే సమయంలో రమేష్ బోకే తీసుకొని వస్తాడు. పువ్వులు అంటే ఎలర్జీ అని చెప్పి అతనితో మాట్లాడి పంపిస్తాడు ఎస్ఐ. తరువాత తన కుర్చిలో కూర్చొని టేబుల్ పై ఉన్న రిజెస్టర్ ఓపెన్ చేస్తాడు. జంగయ్య ఎందుకు రావట్లేదు అని అడుగుతాడు. కేసు వాపస్ తీసుకున్న అప్పటి నుంచి రావట్లేదని చెప్తాడు. ఆ కేసును జంగయ్య క్యాష్ చేసుకొని ఉంటాడు, వాళ్ల కుటుంబం కూడా బాగానే సెటిల్ అయి ఉంటుందని అంటాడు. తరువాత అందరిని పనిచూస్కోండి అని చెప్తాడు. జంగయ్య అలాంటోడు కాదని హెడ్ కానిస్టేబుల్ వీరయ్య అంటాడు. అతను చాలా మంచోడు అని న్యాయం కోసం కేసు పెట్టి వెనక్కి తీసుకున్నాడంటే ఏదో తప్పు జరిగిందని అంటాడు. జంగయ్య పోలీసు సర్, వాడు కనిపించడం లేదంటే కనిపెట్టాలి కదా సార్ అని అంటాడు. ఆ మాటలు వింటున్న ఎస్ఐ చేతులో సిగరేట్ కాలుతుంది. వీరయ్య వెళ్లిన తరువాత ఎస్ఐ జంగయ్య ఫైల్ తీసుకొని స్టడీ చేస్తాడు.
అదే సమయంలో పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి ఇద్దరు భార్యభర్తలు వస్తారు. మీది హైదరాబాద్ అయితే ఇక్కడ ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారని రైటర్ అడుగుతాడు. కట్ చేస్తే ఎస్ఐ రవింద్ర నాయక్, వీరయ్య దగ్గరకు వెళ్లి జంగయ్య మిస్సింగ్ అని కేసు ఫైల్ చేసి అతని గురించి మనమే వెతుకుదాం అని చెప్తాడు. కట్ చేస్తే ఇద్దరు కలిసి లక్ష్మీ ఇంటికి వెళ్తారు. అక్కడ గ్యాంగ్ మెన్ సాంబయ్య ఉంటాడు. లక్ష్మీతో ఏదో చెప్తుంటాడు. అతను చాయి తాగి వెళ్తాడు. లక్ష్మీని ఎస్ఐ రవింద్ర నాయక్ వింతగా చూస్తుంటాడు. తరువాత ఇంటికి కట్టిన నిమ్మకాయలను, ఇంట్లో సామాగ్రిని చూసి కూర్చి వేసుకొని కూర్చుంటాడు. ఇంకా చేతికి మట్టిగాజులే ఉన్నాయి, బంగారు గాజులు చేయించలేదా అని అడుగుతాడు. జంగయ్య ఈ కేసులో డబ్బులు దొబ్బేసిండు అని మాట్లాడుతుండగా… అక్కడికి బలిజ వచ్చి ఏం అయింది అని అడుగుతాడు. అంతలో బలిజకు ఫోన్ వస్తుంది. ఎస్ఐ ఫోన్ తీసుకొని చూస్తుండగా.. కొమురయ్య ఫోన్ మాట్లాడి వచ్చి సార్ అని పిలుస్తాడు. ఎస్ఐ షాక్ అవుతాడు.
కట్ చేస్తే గుడి ముందు ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు. అక్కడే మంది గుమిగూడుతారు. అక్కడికి పోలీసులు వస్తారు. రాత్రి గుళ్లోకి పోయిండని తరువాత చనిపోయాడని మాట్లాడుకుంటారు. గుళ్లో చనిపోతే బయట ఎవరు పడేశారు అని మాట్లాడుకుంటారు. నెక్ట్స్ సీన్లో ఎస్ఐ సిగరేట్ తాగుతుంటాడు. వీరయ్య టీ తీసుకొచ్చి ఇస్తాడు. అంతలో ఎస్ఐకి ఏదో గుర్తుకు వచ్చి బైక్ తీసుకొని పోలీసు స్టేషన్ కు వెళ్తాడు. పొద్దున ఇచ్చిన కంప్లైంట్ ను తీసుకొని చూస్తాడు.
వారం రోజుల తరువాత అయ్యప్ప స్వాముల అంతా కలిసి వెళ్తుంటారు. అక్కడే బలిజ టీ కోసం ఒక కొట్టు దగ్గర ఆగుతాడు. అక్కడ కొమురయ్య కనిపిస్తాడు. తరువాత అతను చేతబడి చేసింది గుర్తుకు వస్తుంది. కొమురయ్య వెళ్లిన దారిని చూసి వెనుకాలే బలిజ వెళ్తాడు. అడవిలో కొమురయ్య వెళ్తుండగా అతన్నే ఫాలో అవుతాడు బలిజ. ఒక సారి డౌట్ వచ్చి వెనక్కి చూస్తే బలిజ దాక్కుంటాడు. తరువాత చీకటి పడుతుంది. మళ్లీ కొమురయ్యను ఫాలో అవువతూ బలిజ వస్తాడు. అంతలో కొమురయ్య మాయం కనిపించకుండా పోతాడు. అతన్ని కాసేపు వెతికి ఒక కొట్టు దగ్గర కూర్చుంటాడు. అక్కడికి కొమురయ్య వస్తాడు. బలిజ కనిపించకూడదని టవాల్ అడ్డు పెట్టుకుంటాడు. కొమురయ్య వెళ్లిపోయాడు అనుకుంటాడు బలిజ. అంతలో ఊర్లో అందరు మంచిగున్నార్రా అని అంటాడు కొమురయ్య. దాంతో బలిజ కొంచెం బయపడుతూ దగ్గరకు వెళ్తాడు. ఏం అయిపోయావురా.. అక్కడ నీ భార్య నువ్వు బతికే ఉన్నావన్నా నిజాన్ని ఎవరికి చెప్పలేక చస్తోంది. నీకు ఒక్క సారన్నా వాళ్లు గుర్తుకు రాలేదా అని అడుగుతాడు. అసలు ఇక్కడ ఏం చేస్తున్నావురా అని గట్టిగా అడుగుతాడు. కొమురయ్య బీడీ తాగుకుంటూ యుద్ధం చేస్తున్నా అంటాడు.
కట్ చేస్తే స్కూల్లో టీచర్ పిల్లలకు పాఠాలు చెబుతుంది. ఒక అమ్మాయిని పాఠం చదువమంటుంది. ఇద్దరు అసురల మధ్య యుద్ధం మొదలైందని చదువుతుండగా రమేష్ మనుషులను వేసుకొని పాఠశాలలోకి వస్తాడు. హెడ్ మాస్టర్ ఎదురుగా వస్తాడు. కొమురయ్య కొడుక్కు చదువు చెప్పడం కరెక్ట్ కాదు, వాడి బాబు చేతబడులు చేశాడని అని క్లాస్ రూమ్ కు వెళ్తాడు. చదువు లేని వాడికి సంస్కారం ఎట్టిది అని కొటేషన్ ఉంటుంది. క్లాస్ రూమ్ లోకి పోయి కొమురయ్య కొడుకుని తీసుకొని బయటకు వస్తాడు. వీడికి టీసీ ఇయ్యమని చెప్పి గేట్ బయటకు నెట్టేస్తాడు. అమ్మఒడి మొదటి బడి అనే క్వోట్ గేటుకు ఉంటుంది. ఇంటికి వెళ్తే అప్పుడే వచ్చావేంది అని లక్ష్మీ అడుగుతుంది. జరిగిన విషయం చెప్తాడు. దాంతో లక్ష్మీ బాధపడుతుంది. బ్యాగ్ సర్దుకొని బస్సు ఎక్కుతుంది. కొరవకొండకు టికెట్ తీసుకుంటుంది. తన చెవునుంచి బ్లడ్ కారుతుంది.
తరువాత హైదరాబాద్ ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ ఆఫీస్ లో దేవ్ పటేల్ తో ప్రకాశ్ మాట్లాడుతూ జాస్తిపల్లి టెంపుల్ లో చాలా మిస్టీరీయస్ థింగ్స్ ఉన్నాయని చెప్తాడు. దానికి అతన్ని మెచ్చుకుంటాడు దేవ్. అంతలో అతనికి సాబ్ నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ.. ప్రకాశ్ ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు అని అంటాడు. అదేంటి సర్ ఇది గవర్నమెంట్ కు చెప్తే పెద్ద న్యూస్ అవుతుందని అంటాడు. దాంతో గవర్నమెంట్ కు ఎప్పుడు చెప్పాలో నాకు తెల్సు నువ్వు హుషారు లెక్కలు చేయకు, సాయంత్ర దుబాకి టికెట్టు బుక్ చేస్తా సరదాగా రెండు నెలలు వెళ్లిరా అంటాడు. ప్రకాశ్ షాక్ అవుతాడు.
మరో సీన్లో తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి ప్రకాశ్ దుబాయ్ వస్తుండు వాన్ని అక్కడే చంపేయ్ అంటాడు. తన అసిస్టెంట్ షాక్ అవుతుంది.
తరువాత ఎస్ రవింద్ర నాయక్ ఈ ఊర్లో ఏదో నడుస్తుందని, సర్పంచ్ బిడ్డగా చెప్పిన సిమ్రన్ ఎవరో కాదు మన స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ల కూతురు, అందుకోసం హైదరాబాద్ వెళ్లీ ఏదైనా క్లూస్ కోసం చూసినా, సర్పంచ్ చనిపోయిన రోజు సిమ్రస్ కొమురయ్య ఆటో ఎక్కింది, తను బతికుందో లేదో అనేది కేవలం కొమురయ్యకే తెలియాలి అని అంటాడు. కట్ చేస్తే తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్మామి గుడి బయట బలిజ, కొమురయ్య ఇద్దరు నడుస్తుంటారు. బలిజ ఫోన్లో ఏదో చేస్తుంటే ఒక అతనితో కొమురయ్య మాట్లాడుతుంటాడు. బలిజ మొబైల్ చార్జ్ పెట్టి వాళ్ల దగ్గరకు పరుగెత్తుకు వెళ్తాడు. తరువాత ఇడుక్కి అటవి ప్రాంతం అని టైటిల్ పడుతుంది. ఆ అడవిలో ఇద్దరు వెతుక్కుంటూ ఒక స్వామిజీ దగ్గరకు వెళ్తారు. అతన్ని ఏదో అడుగుతారు. ఆయనకు నమస్కారం పెట్టి వెళ్తారు. చీకటి పడుతుంది. టార్చ్ లైట్ వేసుకొని వెతుక్కుంటూ వెళ్తారు. ఉర్లమ్ తండా అనే టైటిల్ పడుతుంది. అక్కడ ఒక స్వామిజీని చూసి షాక్ అవుతారు. దగ్గరకి వెళ్లి నమస్కారం పెడితే ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు అని చెప్తాడు. బలిజ ఫోన్ చూస్తుండగా, కొమురయ్య పూజలో కూర్చుంటాడు. అది చూసి బలిజ భయపడుతాడు. స్వామిజి పూజ చేస్తూ అతని చేవులో ఏదో చేప్తాడు. తన చేతితో బొక్కలతో గీస్తుంటాడు కొమురయ్య. ఉదయం అవుతుంది. బలిజకు మెలుకువ వస్తుంది. కొమురయ్యను వెతుకుతూ పోతాడు. అదే సమయంలో కొమురయ్య ఏదో చెట్ల ఆకులను తెంపుతూ బీడీ కాలుస్తుంటాడు. ఊర్లో చేతబడులు ఏంది, ఇక్కడ పూజలు ఏంది. అసలు ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్తావా అంటాడు.
గుడిలో బంగారం, వజ్ర వైడుర్యాలుతో పాటు పాములు తిరుగుతుంటాయని కొమురయ్య కల కంటుంటాడు. ఒక్క సారిగా లేచికూర్చుంటాడు. బోనాలకు ఓ నెలముందు జాస్తిపల్లి అని టైటిల్ పడుతుంది. లక్ష్మీ కుండలో నీళ్లు పోస్తుంది. లేచి బయటకు వస్తాడు జంగయ్య సైకిల్ తూడుస్తుంటాడు. అక్కడి బలిజ వస్తాడు. కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్ కు వెళ్తుంటారు. కొమురరయ్య ఆటో తీస్తాడు. దారిలో ఉన్న నిమ్మకాయలు, గుమ్మడి కాయలను తొక్కుకుంటూ పోతాడు. అది బలిజ, జంగా చూసి అలా తొక్కుకుంటూ పోతున్నాడేంటి అని మాట్లాడుకుంటారు. కొమురయ్య ఆటో తీసుకొని గుడిదగ్గరకు వెళ్లి మెక్కుతాడు. అదే సమయంలో ఆకాశంలో మెరుపు వస్తుంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. సైకిల్ కిందపడుతుంది. ఒక రేకు గాలికి లేచి గుడికి తాకుతుంది. దాన్ని చూస్తాడు. తరువాత వాళ్ల పెద్దనాన్న దగ్గరకు వెళ్లి మూసేసిన గుడి కలలోకి వస్తుందని, బంగారం, పాములు వస్తున్నాయని చెప్తాడు. దాంతో అలాంటిది ఏం మనుసులో పెట్టుకోకు అవి ఉత్త కలలే అని అంటాడు.
తరువాత సీన్లో ఆకాలి అవుతుందని అన్నం తింటుండగా, ఆ గుడికి ఎందుకు పోయావు అని లక్ష్మీ అరుస్తుంది. ఆ గుడికి శాపం ఉంది కదా ఎవరు మొక్కరు అంటుంది. గుడికి శాపం ఏందని వాదిస్తాడు. ఇంకోసారి అక్కడికి వెళ్లోద్దు అని అంటుంది. తరువాత నీళ్లు తీసుకొని బయటకు పోయొస్తా అంటాడు. తరువాత అన్నం తింటూ ఫోన్ మాట్లాడి వెంటనే ఆటోలో పెద్దనాన్న దగ్గరకు వెళ్తాడు. నువ్వు మొన్న చెప్పినప్పుడు మీ నాన్న చావు గుర్తుకు వచ్చింది. మనం ఈ పూజలు చేసిది ఆ గుడి గురించే అని చెప్తాడు. ఏం అంటున్నావు పెద్దనాన్న అని కొమురయ్య అంటాడు. దాంతో గుడి చరిత్ర చెబుతాడు. పాండవులు అజ్ఙాతవాసంలో ఉన్నప్పుడు వాళ్లను చూడడానికి శ్రీ కృష్ణుడు వచ్చాడని, ఆ సమయంలో ఒక రాత్రి జాస్తిపల్లిలో శ్రీకృష్ణుడు సేదా తీరాడని పూరాణాల్లో ఉంది. దాన్ని నమ్మిన కేరళ రాజు మార్తండ వర్మ అక్కడ గుడి కట్టించి అందులో లెక్కపెట్టలేనంత సంపద దాచిపెట్టాడు. దానికి ఎన్నో క్షుద్ర పూజలతో నాగబంధనాలు వేశారు. ఆ బంధాలు తీసే క్రమంలోనే మీ తాతా, మీ నాన్న మరణించారు. అందుకే నిన్ను ఆ గుడికి దూరంగా పెంచాలని చదువు చెప్పిస్తే.. నువ్వే చేతులారా నాశనం చేసుకున్నావు. బతుకుదెరువు కోసం నీకు పూజ చెప్పినా, ఇన్నాళ్లకు కూడా నీకు ఆ గుడి కలలో వస్తుందంటే. నీవ్వు దాన్ని సాధించగలవు అని అంటాడు. అయితే దానికి నీవు అర్హత పొందాలి అని నువ్వు ఇష్టపడ్డవాళ్లను బలి ఇవ్వాలి, వాళ్లు కూడా నిన్ను అంతే ఇష్టపడాలి. ఆ బలి ఇడుక్కి అడవి ప్రాంతంలో ఇవ్వాలి అని చెప్తాడు. తరువాత కొమురయ్యకు ఫోన్ వస్తే పోలీసుస్టేషన్ కు వెళ్తాడు.
ఈ స్టోరీ విన్న బలిజ నిధి ఏంది, నరబలి ఏంది అయినా ఒక మనిషిని చంపేంతా డబ్బుందా ఆడా అని అంటాడు. ఆ నిధి గురించి నీకు పెద్దనాన్నకు కాకుండా ఇంకాఎవరికన్నా తెలుసా అంటాడు. ప్రస్తుతం వర్షంలో లక్ష్మీ తన కొడుకుతో పెద్దనాన్న ఇంటికి పోతుంది. రెండు రోజులు ఉండిపోదామని వచ్చిన అని చెప్తుంది. తరువాత వంట చేస్తా అంటుంది. కూరగాయలు కట్ చేస్తూ.. బావ వెళ్లిపోయే ముందు నీ దగ్గరకు వచ్చిండు కదా, నాకు ఎందుకు చెప్పలేదు అని అంటుంది.
కొన్ని నెలల క్రితం.. బలి ఇవ్వడానికి కొడుకునా, భార్యనా అని కొమురయ్య ఆలోచిస్తుంటే ఆ సమయంలో కవిత కనిపిస్తుంది. తనంటే అందరికన్న ఇష్టం అని గుర్తించి తన మనుసులో కూడా తాను ఉన్నాడో లేడో కునుక్కోవాలి అనుకొని గుడిలో కవిత పూజ చేస్తుంటే అక్కడ కనిపిస్తాడు. కవిత కలిసి మంచి చెడు మాట్లాడుతుంటే నేను అంటే నీకు ఇష్టం ఉండేనా అని అడుగుతాడు. దానికి చిన్నప్పుడు చాలా ఇష్టం ఉండే అంటుంది. దాంతో కొమురయ్య సంతోషపడి అక్కడనుంచి వెళ్లిపోతాడు.
బోనాలకు 4 రోజుల ముందు కవితను బలి ఇవ్వాలని డిసైడ్ అయిన కొమురయ్య వాస్తుపూజ చేయడానికి గుళ్లోకి వెళ్తాడు. అదే సమయంలో సర్పంచ్, సిమ్రన్ గుడి గురించి మాట్లాడుకుంటారు. అదే సమయంలో కొమురయ్య వింటాడు. కాలుకు రాయి తాకి శబ్దం వస్తుంది. సర్పంచ్ ఎవర్రా అని అంటాడు. మెళ్లిగా కొమురయ్య బయటకు వచ్చి గుళ్లో నిధి ఉన్న విషయం సర్పంచ్ కు తెలిసిందని కొమిరికి అర్థం అయ్యింది. ఊరి జనాలకు తెలియకుండా కవితను ఎలా బయటకు తీసుకురావాలని ఆలోచించాడు. క్షుద్రపూజలు చేస్తాడు. కవితతో పాటు సర్పంచ్ బిడ్డమీద కూడా రేణుక అవతారం ప్రయోగిస్తాడు. కట్ చేస్తే సర్పంచ్ బిడ్డ ఆటో ఎక్కుతుంది. అదే సమయంలో డాక్టర్ కు డబ్బులు ఇచ్చి కవిత కడుపులో బిడ్డను తీపించాడని పెద్దనాన్న చెబుతుంటాడు. తరువాత సర్పంచ్ బిడ్డ సిమ్రన్ ను కవిత స్థానంలో పెట్టి కవితను తీసుకొని వెళ్తాడు కొమిరి.
ఈ విషయం విని బలిజ షాక్ అవుతాడు. కవితను అలా తీసుకొచ్చి రేణుక అవతారానికి విడుగురు చేసి బతికించుకున్నా అని చెప్తాడు. తరువాత ఆసుపత్రిలో ఉన్న సర్పంచ్ బిడ్డ చనిపోతుంది. తన చితి దగ్గర చివరిగా ఒక పూజ ఉంటుంది. దాన్ని చేసి నువ్వు పక్కూరు రైల్వే స్టేషన్ కు రా, నేను కవితకు వశీకరణ చేసి అక్కడికి తీసుకొస్తా అని పెద్దనాన్న చెప్తాడు. కొమిరి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సర్పంచ్ బిడ్డనే కవితా అనుకొని వాళ్లు అంత్యక్రియలు చేస్తారు. చివరి పూజ చేస్తుండగా.. రమేష్ వచ్చాడు అక్కడ కాటికాపారి చితిల పడ్డాడు నేను తప్పించుకున్నా అని కొమిరి బలిజకు చెప్తాడు. అక్కడి నుంచి పోచారం రైల్వే స్టేషన్ కు వెళ్తాడు. అక్కడ వాళ్ల పెద్దనాన్న కలిసి చేతికి తాయత్తు కట్టి దీన్ని తీయకు అని చెప్తాడు. తరువాత ఒక తీర్థం ఇచ్చి తాగు అంటాడు. అక్కడికి కవిత వస్తుంది. వింతగా చూస్తుంది. కొమరి చేతులో చేయి వేసి వెళ్లండి అని చెప్తాడు. కేరళకు వస్తారు. అక్కడ ఒక ఇంట్లో ఉంటారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో అర్కియాలిస్ట్ దేవ్ మందు తాగుతుంటాడు. మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది. మన వాల్లను కూడా చంపేస్తున్నావు అసలు ఏం ఉంది జాస్తి పెల్లిలో అని తన అసిస్టెంట్ అండుగుతుంది. ఆరు నెలల క్రితం టైటిల్ పడుతుంది. దేవ్ ఆర్కియాలజి ఆఫీస్ లో ఒక లేడీ ప్రజెంటేషన్ ఇస్తుంది. పద్మనాభ స్వామి టెంపులలో చాలా బంగారం ఉండడం మూలన అక్కడ మట్టిలో చాలు మార్పు వచ్చింది. అందుకే అక్కడ కొత్తరకాలైన మొక్కలు, పాములు ఉంటాయి. సరిగ్గా అలాంటి లక్షణాలే జాస్తిపల్లి పొలిమెరలో ఉన్న గుడి పరిసర ప్రాంతంలో కనిపిస్తున్నాయి. మార్తండ వర్మ మొత్తం 8 గుళ్లు కట్టించాడు. జాస్తిపల్లిలో ఒంటికాలితో నిలబడలి ఉన్న విగ్రహాన్ని ప్రతిష్టించాడు. కచ్చితంగా అక్కడ కూడా సంపద దాచిపెట్టాడు. అనంత పద్మనాభ ఆలయం కన్న ఎక్కువే ఉంటుంది అని చెప్తుంది.
మరో సీన్లో దేవ్ పటేల్ ను కలుడానికి జాస్తిపల్లి సర్పంచ్ ఆఫీస్ కు వస్తాడు. మీ ఊరు గుల్లో మాకు పని ఉంది నీకు డబ్బిస్తాము జనాలు లొల్లి చేయకుండా చూసుకోవాలని అంటాడు. ముందు ఒప్పుకోడు 20 కోట్లు ఇస్తాను అనే సరికి సర్పంచ్ ఒప్పుకుంటాడు. అన్ని కోట్లు ఇచ్చేంత పని ఆ గుడిలో ఏం ఉందంటాడు. లక్ష్మీ దేవి తలుపు తడితే డోర్ తీయాలి కానీ ప్రశ్నలు వేయకూడదు అని అక్కడే ఉన్న స్వామి అంటాడు.
బోనాలకి 10 రోజుల ముందు సర్పంచ్ పాటలు వింటుంటాడు. అదే సమయంలో దేవ్ కాల్ చేసి తన స్టూడెంట్ ఒకరు వస్తున్నారు తాను ఆ గుడిలోకి పోయేలా చూడాలి అని చెప్తాడు. సరే అని చెప్పి సైదులును పిలిచి సిటీనుంచి ఒక అమ్మాయి వస్తుంది నువ్వు ఏం చేస్తావో తెలియదు అది నా బిడ్డ అని ఊరంతా నమ్మాలి అని చెప్తాడు. కట్ చేస్తే అమ్మాయి వస్తుంది. ఆటో ఎక్కమని కొమురయ్య అంటుంటే సర్పంచ్ మనిషి తనను తీసుకెళ్లాడు. ఎవరు అంటే సర్పంచ్ కూతురు అని చెప్తాడు.
తరువాత ఆ అమ్మాయిని తీసుకొని గుళ్లోకి వెళ్తాడు. అక్కడ ఆమె లేసర్ పెట్టుకొని గుడి గోడలను పరిశీలిస్తుంది. సర్పంచ్ తననే చూస్తుంటాడు. తనకు గోడమీద కొన్ని గుర్తులు కనిపిస్తాయి. వాటిని చూసి ఎగ్జైట్ అవుతుంది సిమ్రన్. ట్రావెన్ కోర్ వాళ్లు ఈ గుడిని కట్టించారు అనడానికి ఇదే మంచి ఎగ్జాంపుల్ అని చెప్తుంది. అదే సమయంలో తన మీద చేయి వేస్తాడు సర్పంచ్. తాను కంగారు పడుతుంది. అందే సమయంలో కొమురయ్య కాలు తాకి రాయి కిందపడుతుంది. దాంతో ఎవర్రా అని సర్పంచ్ అంటాడు. అదే సమయంలో అమ్మాయి వెళ్లిపోతుంది.
బోనాలకి ఒక్కరోజు ముందు పటేల్ ఫోన్ చేశాడు గుళ్లో ఏదో తొవ్వుతా అంటున్నాడు, పక్కూర్లో నుంచి కూలోల్లను తీసుకురా అని సర్పంచ్ సైదులకు చెప్తాడు. తరువాత సిటీ నుంచి వచ్చిన అమ్మాయి ఎక్కడా అని తన బెడ్ రూమ్ కు వెళ్తాడు. అక్కడ తనను చూసి టెంప్ట్ అవుతాడు. తనకు ఫీవర్ గా ఉందని, రాషేస్ కూడా వచ్చాయి అని చెప్తుంది. దాంతో సర్పంచ్ నేను డాక్టర్ కు చెప్తా అని వెళ్లిపోతాడు. నెక్ట్స్ సీన్లో కూలోల్లను తీసుకొని గుడి కాడికి రమ్మని సైదులుకు ఫోన్ చేసి సర్పంచ్ కార్లో వెళ్తాడు. అదే సమయంలో కారుకు గేదే అడ్డం వచ్చి కారు అదుపుతప్పి సర్పంచ్ చనిపోతాడు. తరువాత సీన్లో కొమురయ్య ఆటోలో ఎక్కి సిటీ అమ్మాయి స్టేషన్ కు అని వెళ్తుంది.
3 నెలల తరువాత అని టైటిల్ పడుతుంది. దేవ్ పటేల్ తన అనుచరుడితో కలిసి మామిడి తోటలో ఒక అతనితో మీ ఊరి పొలిమెరలో మాకు పని ఉంది అని చెప్తాడు. దానికి ఖర్చు అయితుందని అతను అంటాడు. ఎంత కావాలంటే 5 కోట్లు కావాలంటాడు. 10 కోట్లు తీసుకో అనే సరికి చాలా ఎగ్జైట్ అవుతాడు. తరువాత అతను కూడా గుడి ముందు రక్తం కక్కుకొని చనిపోతాడు.
ఆ గుడి విషయంలో మనకు పనికొస్తాడు అనుకున్న పత్రి ఒక్కడు చనిపోతున్నారు, ఈ విషయం సాబ్ కు తెలిస్తే మనల్ని చంపేస్తాడు అని దేవ్ అరుస్తాడు. దానికి ఒక్కడు ఉన్నాడు అని స్వామి అంటాడు. ప్రస్తుతం అని పడుతుంది. కొమురయ్య నడుచుకుంటూ వస్తాడు. బలిజ కొమురయ్యను ఆగమని కవితను ఇంత కష్టపడి తీసుకొచ్చింది చంపడానికా అని అంటాడు. అల్రెడీ చంపేసినా అని చెప్తాడు. . తన రక్తాన్ని ఒక మట్టిపాత్రలో పడుతాడు. పున్నమి రోజు తన రక్తంతో బలిపూజ మొదలు పెడుతాడు. రక్తం తాగుతాడు. పూజ చేస్తాడు. రక్తం తన ఒంటికి పూసుకుంటాడు. తన తలమీద పోసుకుంటాడు. ఒక్కసారిగా అరుస్తాడు.
ఇడుక్కి అటవి ప్రాంతంలో ఈ విషయాన్ని బలిజకు చెప్తుండగా ఎస్ఐ రవింద్ర నాయక్ అక్కడే ఉంటాడు. క్లాప్స్ కొడుతూ వస్తాడు. తన జాస్తిపల్లి నుంచి ఇక్కడి వచ్చినట్లు చెప్తాడు. నీ తమ్ముడు కూడా నీలాగే మిస్ అయ్యాడు అతన్ని వెతుకుతుంటే నువ్వు దొరికావు అని చెప్తాడు. చేసిన పూజలు చాలు ఇక స్టేషన్ కు పోదాం పదా అని తన గల్ల పట్టుకుంటాడు ఎస్ఐ. కొమురయ్య తన చేయిని తీస్తాడు. ఎస్ఐ గన్ పెడుతాడు. తన గన్ విసిరేసి అతన్ని కొడుతాడు కొమిరి. ఇంకో తప్పు చేయకు అని ఎస్ఐ అంటాడు. నేను ఏం చేస్తున్నానో మీకు తెలియదు అని వెళ్లిపోతాడు. ఎస్ఐ కట్టేతో అతన్ని కొడుతాడు. కొమిరి కిందపడుతాడు. నువ్వు ఆ నిధికోసమే ఇదంతా చేస్తున్నావు అని తెలుసు అని అంటాడు. కొమిరిలేచి ఎస్ ఐ ని కొడుతాడు. ఆ గుడిలో నిధి తీసి ఊరివాళ్లకు మంచి చేస్తా అని అంటాడు. ఇద్దరు కలిసి ఫైట్ చేసుకుంటారు. ఆకాశంలో మెరుపులు వస్తాయి. వర్షం మొదలు అవుతుంది. బలిజ వాళ్లనే చూస్తుంటాడు. ఇద్దరు కొట్టుకుంటారు. తరువాత ఎస్ఐ కిందపడుతాడు. ఆ నిధికోసమే పుట్టిన, నేనే తీస్తా.. అని నాగబంధం, గుడి అని ఏవో మంత్రాలు చదివి కిందపడి తప్పించుకుంటాడు. ఎస్ఐ అతన్ని వెతుకుతాడు. బలిజ కూడా అక్కడే ఉంటాడు.
కట్ చేస్తే తరువాతి రోజు బలిజ, ఎస్ ఇద్దరు కొండ మీద మాట్లాడుకుంటారు. వాడు నిన్ను కలుస్తాడు అని నాకు తెలుసు అందుకే నీ ఫోన్లో ఒక యాప్ ఇన్ స్టాల్ చేసినా అని, నువ్వు ఫోన్ ఆన్ చేయగానే నీ లొకేషన్ నాకు తెలిసింది అని చెప్తాడు. వాడు చాలా మారిపోయాడు సర్. కవితను చంపాడు సర్ అని బలిజ అంటాడు. ఆ మాటలకు.. నువ్వు గుండే రాయి చేసుకో బలిజ, కొమిరి చంపింది కవితను కాదు నీ భార్య రాములను అని చెప్తాడు. బలిజ షాక్ అవుతాడు.
రేణుక ప్రయోగానికి విరుగుడు పూజ చేస్తున్నప్పుడు అక్కడికి ఒక గద్ద వస్తుంది. దాంతో కొమిరి మంత్రాలు ఆపుతాడు. వెంటనే కవిత అక్కడే చనిపోతుంది. ఈ విషయం తెలిసిన పెద్దనాన్న కొమరికి చెప్పకుండా తన స్థానంలో రాములను పంపించాలనుకుంటాడు. పూజ ముగసిందని కొమరిని ఇంటికి పంపుతాడు. కవిత వెట్రుకలతో వసీకరణ పూజ చేసి రాములను రప్పిస్తాడు పెద్దనాన్న. ఎందుకు పిలిచినవు అని అడుగుతుంది. కొమరిని నిన్ను ఒకటి చేస్తా అని వానితో నువ్వు రేపు ట్రైన్ లో పోవాలి అని చెప్తాడు. కొమిరికి తాయత్తు కట్టి మంత్రించిన జలం ఇస్తాడు. దాంతో రాముల కొమిరికి కవితలా కనిపిస్తుంది. తనను కేరళ తీసుకపోయి అక్కడ కవితా అను రాములతో ఇష్టంగా గడిపాడు, సమయం చూసి తనను చంపేశాడు అని చెప్తాడు. రక్తం మట్టిపాత్రలో పడుతాడు.
ఇది విని బలిజ ఒక్క సారిగా కంగారు, భయంతో ఎస్ఐ షర్ట్ పట్టుకుంటాడు. రాములను కొమిరి ఎందుకు చంపుతాడు. పెద్దనాన్నకు రాములకు ఎంటి సంబంధం అని బలిజ అడుగుతాడు. రాముల పెద్దనాన్న మేనకోడలు, నెలలు నిండకముందుకే రాముల పుట్టడంతో తల్లి మరణించింది. దాంతో తన మానసిక పరిస్థితి బాగలేదని తనను ప్రత్యేక ఆసుపత్రిలో చేర్పిస్తాడు. తాను పెద్దగా అయ్యాక ఒక సారి కొమిరిని చూసి అతన్ని ప్రేమించడం మొదలు పెట్టింది. సడెన్ ఒకరోజు రాముల చేయి కోసుకుంది అని పెద్దనాన్న కంగారు పడుతాడు. పెద్దనాన్న తన మెనకొడలు దగ్గరకు వెళ్తే బావ వచ్చాడా అని అడుగుతుంది. బావకోసమే తన పేరు చేతిమీద రాసుకుంటుంటే ఇలా జరిగింది అని చెప్తుంది. మంచిగా చదువుకుంటే నేను బావను తోలుకొస్తా అని చెప్తాడు. దాంతో రాముల సంతోష పడుతుంది. పది సంవత్సరాల తరువాత కొమిరి లక్ష్మిని పెళ్లిచేసుకొని పెద్దనాన్నకు షాక్ ఇస్తాడు. విషయం తెలిసిన రాముల పిచ్చిగా ప్రవర్తిస్తుంది. దాంతో ఎప్పటికైనా కొమిరిని నీకు దగ్గర చేస్తా అని బలిజకు ఇచ్చి పెళ్లి చేసి, తన ఇంటి పక్కనే పెడుతాడు.
ఇవన్ని మీకు ఎలా తెలుసు సర్.. ఏది నమ్మబుద్ది అవట్లేదు అని చెప్తాడు బలిజ. దాంతో హైదరాబాద్ నుంచి వచ్చిన వారు మన స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కదా. సిమ్రన్ మిస్సింగ్ కేసు. ఆ విషయంలో హైదరాబాద్లో తన ఫ్రెండ్ ను కలువవడానికి వెళ్లా, అక్కడ తనతో పాటు పొలిమెర గుడి గురించి చెప్తుంది. ఆ గుడిలో మాగ్నైట్ మెటల్ ను వాడారు అందుకే మీ ఊర్లో పిడుగు పడలేదని చెప్తుంది. తరువాత వీటన్నింటికి సమాధానం గుడిలోనే ఉందని అక్కడి వెళ్లాను అని చెప్తాడు. గుడిలో ఒక గవ్వ కనిపిస్తుంది. ఆ గవ్వను తీసుకొని కొమిరి పెద్దనాన్నను దగ్గరకు వెళ్తే అసలు విషయం తెలిసింది. నువ్వు రాములకు పంపిన డబ్బులు కేరళలో విత్ డ్రా అయింది. ఇక వీరు కేరళలోనే ఉన్నారు అని తెలిసింది అని ఎస్ఐ చెప్తాడు. ఇంకో రెండు రోజుల్లో పున్నమి ఉందని ఈ లోపు కొమిరి ఒంకో తప్పు చేయకుండా చూసుకోవాలని చెప్తాడు.
శాకాంబరి పున్నమి రోజు అర్థరాత్రి కొమరి గుడిలోకి వస్తాడు. కంపాస్ తో వాస్తు చూసి గుడి మధ్యలో ముగ్గు వేసి నాగబంధనం పూజ మొదలు పెడుతాడు. పాములు అన్ని వస్తుంటాడు. నిండు పున్నిమి, పాములు కోపంతో వస్తాయి. తరువాత కొమిరి పూజతో పాములు బంధీ అవుతాయి. కొమరి చేతులో ఉన్న మంత్రదండం ఒకటి విరిగి పోతుంది. పాములు కోపంగా ఉంటాయి. వెంటనే వేరొకటి విరిచి దానితో మళ్లీ పూజ కొనసాగిస్తాడు. పాములు బంధీ అవుతాయి. వాటిని చూస్తాడు కొమిరి. లేచి గుళ్లోకి వెళ్తాడు. చీకటి గదిలోకి మంత్రాలు చదువుకుంటు వెళ్లి కాగడ ముట్టిస్తాడు. తనచేతులో ఉన్న మంత్రించిన నీళ్లు గొడలపై పోస్తూ నిధిని వెతుకుతాడు.. ఒక చోట ఆగి అక్కడ మ్యాప్ చూస్తాడు. అండర్ గ్రౌండ్ కాళ్లకు తగలడంతో ఆ కప్పును తీసి లోపలికి వెళ్తాడు. ఒక డోర్ ఉంటుంది. గది అంతా పాడుబడ్డట్టు ఉంటుంది. ఒక చోట ఆగి సంతోషపడుతాడు.
పున్నమి ఇంట్లో లక్ష్మీ ఒక్కతే కూర్చొని ఆలోచిస్తుంది. అక్కడికి కొమిరి వస్తాడు.. బయట నిలబడి చూస్తాడు. లక్ష్మీ చూసి కొమిరిని పట్టుకొని ఏడుస్తుంది. అన్నం తిని రెండు రోజులు అవుతుందని చెప్తాడు. దాంతో ఒక్క పదినిమిషాలు ఇప్పుడే వండుతా అని వంట స్టార్ట్ చేస్తుంది. అబ్బాయి గురించి అడిగితే పెద్దనాన్న దగ్గర ఉన్నాడు అని చెప్తుంది. తురువాత వడ్డిస్తుంది. కొమరి కలుపబోతే చేయి కాలుతుంది. లక్ష్మీ కలుపుతుంది. బొట్టు చూసి మళ్లా గుడికి పోయినవా అని అడుగుతుంది. దాంతో అతను కంగారు పడి.. వస్తుంటే దేవుడికి మొక్కొచ్చిన అని చెప్తాడు. మళ్లి నిధి కనిపించిందా అని అడుగుతుంది. దాంతో కొమిరి కంగారు పడుతాడు. లక్ష్మీకి వాళ్ల పెద్దనాన్న నిధి గురించి, దానికోసం అన్ని బంధాలు తెంచుకొని బలి గురించి చెప్తాడు. ఇష్టమైన వాల్లను బలి ఇవ్వాలంటే నన్ను చంపాలి కాని వేరే ఎవరినో చంపటం దేనికి అని అడుగుతుంది లక్ష్మి. దాంతో కొమిరికి పొలమారుతుంది. వాటర్ తాగుతాడు. తాను అన్నం కలుపుతుంది. నా కంటే కవితనే ఎక్కువైంది కదా అని అంటుంది. దాంతో తాను ఏం తప్పుచేయలేదని నిధికి ఏం కావాలో అదే చేసినా అంటాడు. నువ్వు చేసింది తప్పు కాదు పాపం అని అంటుంది. ఏం పాపం చేసిందని కవితను, సిమ్రన్ ను చంపావు. ఎందుకని రాములను చంపావు అని అడుగుతుంది. రాముల నీతో కలిసి ట్రైన్ ఎక్కిందని సాంబయ్య చెప్పాడు అని, అసలు ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చిదాన్ని అయ్యాను అని అంటుంది. సాంబయ్య చెప్పింది నిజం అయితే పెద్దనాన్నకు రాములకు ఏం సంబంధం, అని ఒక రోజు రాములు ఇంట్లో వెతుకుదాం అంటే బలిజ వస్తాడు. మరో రోజు బలిజ శబరి వెళ్తే, రాముల ఇంట్లో వెతికితే ఫోటో దొరికింది. ఇదే విషయాన్ని పెద్దనాన్నను అడిగితే అసలు విషయం చెప్పాడు అని అంటుంది.
తరువాత పెద్దనాన్నకు అన్నం పెట్టి రాముల చనిపోతుందని తెలిసే కొమిరితో పంపినవా అని అడుగుతుంది. కొందరి జీవితం అంతే అయినా చంపితే తప్పు కాని బలి ఇస్తే తప్పేంటి అంటాడు. రెండుంటికి తేడా లేదు రెండు ఒక్కటే అని అంటుంది లక్ష్మి. కొమిరి ఆశకోసం కాదు, ఆశయం కోసం చేస్తున్నాడు అని అంటాడు. మీరు కాదు నేను ఆశయం కోసం చేస్తున్నా అని అంటుంది. అదే సమయంలో పెద్దనాన్న రక్తం కక్కుతాడు. అన్నంలో విషం కలుపుతుంది. అదే విషయాన్ని కొమిరికి చెప్తుంది. అందుకే పెద్దనాన్నను చంపేసినా అని చెప్తుంది. తన కొడుకుని తీసుకొని వస్తుంది. కొమిరి కూడా రక్తం కక్కుతాడు. తను అడ్డం పడిపోగానే లక్ష్మి కొమిరిని పట్టుకుంటుంది. నువ్వు కవిత అనుకొని రాములను చంపినావు అని పెద్దనాన్న అనుకుంటున్నాడు, నాకు తెలుసు నువ్వు రాముల అనుకొనే చంపావు అంటుంది. ట్రైన్లో ఇద్దరు ఉన్న విషయం ఒక హిజ్రా విని తనతో చెప్తుంది. కొమిరి షాక్ అవుతాడు. తన చేతులు ఒక్కర్లు పోతాయి. వర్షం పడుతుంది. మిగిలిన అన్నం కూడా ప్లేట్ లో పెడుతుంది. గుడిసే కురిసే కాడ పాత్ర పెడుతుంది. ఇది మన బతుకు ఆ నిధి దొరికితే మన బతుకులు మారుతాయా, ఏం చేస్తే మన బతుకులు మారుతాయో తెలుసా.. చదువుకుంటే మారుతాయి అని చెప్తుంది.
కట్ చేస్తే తన కొడుకును తీసుకొని కవిత అన్న దగ్గరకు వెళ్తుంది. దండం పెడుతుంది. రమేష్ కోపంతో బయటకు వచ్చి లక్ష్మిని కొడుతాడు. లక్ష్మీ చెవు నుంచి రక్తం కారుతుంది. లక్ష్మి దండం పెట్టి చదుకోవడానికి అనుమతి ఇవ్వండి అని చెప్తుంది. దాంతో లక్ష్మి వాళ్ల అమ్మకు దండం పెడుతుంది. వదిలేయ్ దాన్ని పాపం మనకెందుకు అని చెప్తుంది. లక్ష్మి కాళ్లమీద పడుతుంది. నా కాళ్ల మీద కాదు మా ఇంట్లో ఉన్న అందిర చెప్పులు మొక్కు అని అంటాడు. దాంతో లక్ష్మి అందరి చెప్పులు మొక్కుతుంది. రమేష్ లోపలికి వెళ్లిపోతాడు. కవిత అమ్మ వచ్చి ఈ ఊళ్లో కాదు పక్కూర్లో చదివించుకో అని చెప్తుంది. ఇదే విషయాన్ని కొమిరికి చెప్తుంది. అందుకే మన అబ్బాయిని చదివిస్తున్న అని చెప్తుంది. అయినా నువ్వంటే ఎందుకు ఇష్టమో తెలుసా అని ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది.
తను చిన్నప్పుడు గాలి సోకిందని ఒక పూజ చేస్తాడు పెద్దనాన్న. ఒకదాన్ని పాతిపెట్లాలంటే అందరు భయపడ్డారు కాని నువ్వు నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు అందుకే నిన్ను ఇష్టపడ్డా అంటుంది. నిన్ను ఇలానే వదిలేస్తే ఇంకెంత మందిని చంపుతావో అంటుంది. ఒకర్ని చంపి బతకడంలో అర్థం లేదు అని తాను కూడా విషయం కలిపిన అన్నం తింటుంది. తరువాత కత్తి తెచ్చి ఇద్దరు చేతులు కోస్తుంది. తన చేతిని పట్టుకుంటుంది. ఇలా చనిపోతే మళ్లీ కలిసి పుడుతామన్నావు కదా.. నెక్ట్స్ జన్మలో పుట్టి మంచిగా బతుకుదాం అని అంటుంది. అదే సమయంలో డోర్ ఓపెన్ అవుతుంది. లక్ష్మి కత్తి పట్టుకుంటుంది. సాబ్ వచ్చి గన్ తో లక్ష్మిని కాల్చేస్తాడు. కొమిరిని బతికున్నడా లేదా అని చూసి చనిపోయాడు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే కొమిరి లక్ష్మి ఒక రోజు పున్నమి ఇంటికి వస్తారు. తనకోసం కొమిరి కమ్మలు తీసుకొస్తాడు. తను సంతోషపడుతుంది. తరువాత లక్ష్మి గుడికి వెళ్లి చూస్తుంది. కొడుకు చదువుకోసం రమేష్ కాళ్లు పట్టుకుంటుంది. అక్కడికి బలిజ, ఎస్ ఐ వచ్చి వారికి చితిపెడుతారు. ఈ విషయం జంగయ్యకు చెప్పండి సర్ అని బలిజ అంటాడు.
ఎస్ఐ బలిజ వైపు చూస్తాడు. జంగయ్య ఫోన్ చేస్తాడు. నందికుండ్, ఉత్తరాఖాండ్ లో జంగయ్య పని పూర్తి అయింది అని చెప్తాడు. అందరిని అడుగుతూ ఒక స్వామిజీ దగ్గరకు పోయి వాల్లను తీసుకొని వస్తాడు జంగయ్య. మరో సీన్లో ఎస్ఐ, దేవ్ పటేల్, సాబ్ మీటింగ్ పెట్టుకుంటారు. లెట్స్ బిగన్ ద షో అని స్యాండ్ టైమర్ ను తిప్పుతాడు సాబ్. పొలిమేర 3 అని పడుతుంది.