AKP: కోటవురట్ల మండలం పందూరు పరిధిలో గల రెవెన్యూ శాఖకు చెందిన 98 ఎకరాల జీడి తోటల వేలం పాట ఈనెల 16న స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తహసీల్దార్ తిరుమల బాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025-26 సంవత్సరానికి ఫల సాయం అనుభవించేందుకు నిర్వహిస్తున్న వేలంపాటలో పాల్గొనేవారు రూ. 10,000 డిపాజిట్ చెల్లించాలన్నారు.