Curry & Cyanide Movie Explained In Telugu HitTVTalkies
Curry & Cyanide: ఓపెన్ చేస్తే కేరళలోని కూడతాయి ప్రాంతంలో సమాజంలో గౌరవ మర్యదలు ఉన్న జాలీ జోసఫ్ అనే మహిళను, గత 18 సంవత్సరాలుగా 6 హత్యలు చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. కేరళ కోయికోడ్ జిల్లాలోని కూడతాయి గ్రామంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రాన్నే కాదు, దేశాన్నే షేక్ చేసింది. టైటిల్స్ పడుతుంటాయి. ఐపీఎస్ ఆఫీసర్ కేజీ సైమన్ ఈ కేసు గురించి మాట్లాడుతాడు. పొన్నామట్టం కుటుంబంలో చనిపోయిన రాయ్ థోమస్ రిపోర్ట్ లో అతను సైనైడ్ తీసుకున్నట్లు ఉంది, తనకు సైనైడ్ ఎలా వచ్చింది అనే విషయం ఎవరు దర్యాప్తు చేయలేదు, ఈ కేసులో కచ్చితంగా ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందనిపించింది. 2019 జాలీ జోసఫ్ అరెస్ట్ అయిన రోజు విచారిస్తే తాను నోరు విప్పదు. ఈ కేసులో 200 మందిని ప్రశ్నిస్తారు. కానీ ఎవరికి ఈ విషయం గురించి తెలియదు ఇదే విషయాన్ని సైమన్ మీడియాతో చెప్తాడు.
చదవండి:Pushpa-2 రిలీజ్ డేట్ మళ్లీ వాయిదా..?
అడ్వకేట్ అలూర్ జోసఫ్ కేసు గురించి మాట్లాడుతాడు. జాలీ ఈ నేరం చేయలేదని తనను కలిసిన్పుడు చెప్పిన మొదటి మాట. ఇన్నాళ్లు కేరళ అంటే ఎడ్యేూకేషన్ లో టాప్ ప్లేస్ లో ఉంటుందని అనుకునేవారు కానీ ఈ కేసుతో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తరువాత జర్నలిస్ట్ నిఖిల ఈ కేసు గురించి చర్చిస్తుంది. చాలా మంది జాలీ మంచిది, అలా చేసుండదు అని, కొందరు మానసిక వ్యాధికి గురయిందని అన్నారు. దాంతో జాలీ పెరిగిన ప్రాంతం కట్టప్పనకు వెళ్లి తన గురించి తెలుసుకుంటుంది జర్నలిస్ట్ నిఖిల. తరువాత రోజో థోమస్, జాలీ జోసఫ్ మరిది, రెంజి విల్సన్ జాలీ ఆడపడుచు తమ కుటుంబం గురించి, వాళ్లు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెప్తారు. వాళ్ల అన్నయ్య రాయ్ థోమస్, జాలీ జోసఫ్ భర్త చాలా మంచోడు అని అంటారు.
కేరళలోని కూడతాయి ప్రాంతంలో.. టామ్ థోమస్ విద్యారంగంలో పనిచేసేవాడు, తన భార్య అన్నమ్మ థోమస్ టీచర్ గా పని చేసేది. అందుకే వీళ్లంటే ఆ ప్రాంతంలో అందరికి గౌరవం. ఈ దంపతులకు రాయ్ థోమస్, రోజో విల్సన్, రెంజీ థోమస్ అనే ముగ్గురు పిల్లలు ఉంటారు. అందులో రాయ్ థోమస్, జాలీ జోసఫ్ తో ప్రేమలో పడుతాడు. జాలీ జోసఫ్ కట్టపన్నా అనే ప్రాంతంలో ఓ సాధరణ రైతు కుటుంబంలో జన్మించిన యువతి. తనకు సాధారణ రైతు కుటుంబంలో జీవించడం ఇష్టం ఉండదు. తాను లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అనే మైండ్ సెట్ కలది.
జాలీ జోసఫ్, థోమస్ ఫ్యామిలీకి దూరం చుట్టం అవుతుంది. రాయ్ థోమస్ మేనమామ మంచాడియల్ గృహప్రవేశంలో జాలీ జోసఫ్ ను మొదటి సారి చూస్తారు. జాలీ సోసఫ్ మంచాడియల్ బావమరిది కూతురు. ఆ ఫంక్షన్ లో జాలీ వీరికి పరిచయం అవుతుంది. అప్పటి నుంచి ఉత్తరాలు రాసుకునే వారు, అలా జాలీ, రాయ్ ఇద్దరు ప్రేమల్లో పడ్డారు అని రెంజి విల్సన్ చెప్తుంది. ఈ పెళ్లికి రాయ్ వాళ్ల నాన్న ఒప్పుకోలేదు. అదే సమయంలో జాలీ ఎమ్ కమ్ పూర్తి చేసింది. ఇద్దరు జాబ్ చేసుకుంటూ సంతోషంగా ఉంటారు అని రాయ్ వాళ్ల అమ్మ వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
దాంతో 1997లో జాలీ జోసఫ్ అండ్ రాయ్ థోమస్ ల పెళ్లి జరుగుతుంది. జాలీ పెళ్లిచేసుకొని తన భర్తతో పాటు కూడతాయిలోని పొన్నమట్టం ఇంట్లోనే ఉంటారు. అది చాలా పెద్ద కుటుంబం అని పొరిగింటి ఆవిడ చెప్తుంది. జాలీ చాలా మంచిది, అందరితో కలిసిపోయేది అని చెప్తుంది. జాలీ చాలా తొందర్లోనే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో గడిచిపోయిందని రెంజీ అంటుంది. తనకు షాపింగ్ చేయడం అన్నా, బంగారం అన్నా చాలా ఇష్టం. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత.. చాలా సార్లు జాలీ జోసఫ్ అత్తగారు జాలీని ఉద్యోగం చేయొచ్చు కదా అంటూ ఉండేది. మంచి చదువు ఉంది. తెలివి ఉంది. ఉద్యోగం ఎందుకు చేయకూడదు అని తన అభిప్రాయం, కానీ ఆ విషయాన్ని జాలీ నెగటీవ్ గా తీసుకునేది, ఒత్తిడికి గురయ్యేది అని యాక్టివిస్ట్ సీఎస్ చంద్రిక చెప్తుంది.
తరువాత జాలీ ప్రెగ్నెంట్ అవుతుంది. 1999లో జాలీకి రెమో అనే అబ్బాయి పుడుతాడు. రెమో పుట్టడంతో ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. అలా కొన్ని నెలలు గడిచాక రెమోను తాను చూసుకుంటాను జాలీ నువ్వు ఉద్యోగం చేయమని అత్తగారు మళ్లీ అదే పాట పాడేది. దీనంతటికిి కారణం
తాన దగ్గర డిగ్రీ పట్టా ఉండడమే అని జాలీ ఫీల్ అయ్యేది. ఇదే విషయం ఇన్విస్టిగేషన్ లో జాలీ చెప్పిందని సైమన్ అంటాడు. అసలు విషయం ఏంటంటే.. జాలీకి ఎలాంటి ఎడ్యూకేషన్ క్వాలిఫికేషన్లు లేవని, ఈ విషయం తన అత్త అన్నమ్మ థామస్ కు తెలియదు అని, అది తెలియకుండా ఉద్యోగం వెతుక్కో అని తనను వేధించే విషయం విచారణలో బయటపెడుతుంది.
2002 అన్నమ్మ థామస్ మరణం.. ఒక రోజు ఇంట్లో అంతా హడావిడీగా ఉన్నప్పుడు రెంజీ థోమస్ కిచెన్ లో చికెన్ వండుతుంది. అదే సమయంలో తన అమ్మ కిచెన్ లోకి వచ్చి నీళ్లు తీసుకొని తన రూమ్ వెళ్తుంది. ఎందుకో ఆ రోజు వాళ్లమ్మను చూడాలనిపించి కర్రీ అయిపోగానే తన రూమ్ కు వెళ్తే.. నాకు ఊపిరి ఆడడం లేదని చెప్పిందని, దాంతో కంగారు పడి వెళ్లి అందరిని తీసుకొచ్చినట్లు రెంజి చెప్తుంది. బాడీ అంతా ఎర్రగా మారినట్లు వెంటనే వాళ్ల అన్న రాయ్ ను డాక్టర్ కు ఫోన్ చేయమన్నట్లు రోజో థోమస్ చెప్తాడు. డాక్టర్ వచ్చి వెంటనే తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో వేగంగా హాస్పటల్ కు తీసుకొని పోయినట్లు అక్కడ తనను పరీక్షించిన డాక్టర్ అన్నమ్మ చనిపోయినట్లు చెప్తాడు.
అన్మమ్మ మరణంతో కూడతాయి ప్రాంతం మొత్తం కన్నీరు మున్నీరు అయిందని రోజో ఏడుస్తాడు. వాళ్ల అమ్మ చావుపై ఎలాంటి అనుమానం రాలేదని, కేవలం బ్రైన్ స్ట్రోక్ వచ్చిందేమో అని ఎలాగో వయసులో పెద్దది కాబట్టి పోస్ట్ మార్టం కూడా చేయలేదని చెప్తాడు. అన్నమ్మ చనిపోయిన 18 సంవత్సరాల తరువాత తాను హత్యకు గురయినట్లు ఆఫీసర్ చెప్తాడు. ఇక వాళ్ల అమ్మ చనిపోయిన తరువాత జాలీలో చాలా మార్పు వచ్చిందని, పనులు చాలా శ్రద్దగా చేసేదని తమ కుటుంబంలో తాను ప్రధాన పాత్ర వహించేది అని రేంజీ చెప్తుంది. వాళ్ల అమ్మ డైరీలో తన కోసం కొంత డబ్బును, బంగారాన్ని బ్యాంకులో వేసినట్లు చెప్పి.. నీకు రావల్సింది ఇదే ఆస్తిలో ఇంకేమి అడగడానికి వీళ్లేదని జాలీ ఒక రోజు తనతో అన్న విషయం రెంజీ చెప్తుంది. అలాగే తన పర్మిషన్ లేకుండా ఇంట్లో ఏం చేయొద్దని చెప్పేది అని అలా అన్నప్పుడు చాలా బాధేసేదని రెంజీ అంటుంది.
నెక్ట్స్ తాను చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి ఇంట్లో పనులు చూసుకునేది. అత్తగారు పోయారు కాబట్టి ఇంటిని తానే లీడ్ చేయాలి అని ఫిక్స్ అయినట్లు యాక్టివిస్ట్ చంద్రిక చెప్తుంది. పొన్నమట్టం కుటుంబం అధికారం తన చేతుల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇంట్లో పెత్తనం చేసేది. అందరూ తనను గౌరవంగా చూడాలని భావించేది. తన అత్తగారిని అందరూ గౌరవించడానికి కారణం తాను చేసిన టీచర్ ఉద్యోగం అని అందుకే జాలీ ఎన్ఐటీలో గెస్ట్ లెక్చరర్ ఉద్యోగంలో జాయినట్లు అందరిని నమ్మించింది. దాంతో తనను చాలా మంది గౌరవించేవారు. ఇదే విషయాన్ని రెమో చెప్తాడు. వాళ్ల నాన్న టామ్ థోమస్ తరఫు చుట్టాలు వచ్చినప్పుడు వదిన జాలీ అందరికి కనపడేలా తన బట్టలు ఐరన్ చేసేది. ఇక 2005లో రెంజీ పెళ్లి చేసుకొని కొలొంబో వెళ్తుంది. 2008లో వాళ్ల నాన్న కొలొంబో వచ్చినప్పుడు తాను మానసికంగా బలహీనంగా ఉన్నట్లు గమనించానని రేంజీ చెప్తుంది.
అదే సమయంలో జాలీ ఇంటికి వాళ్ల మామ కొడుకు ఎమ్ఎస్ మ్యాథ్యూ తరచు వచ్చేవాడని, అతను ఒక నగల కొట్లో సేల్స్ మ్యాన్ గా పనిచేసేవాడని చెప్తాడు. తరువాత జాలీ బిహేవియర్ లో చాలా మార్పులు వచ్చినట్లు వాళ్ల నాన్న తనతో ఫోన్లో చెప్పినట్లు రెంజీ చెప్తుంది. ఒక చోటకు వెళ్తున్నా అని చెప్పి వేరే చోటుకు వెళ్లడం, ఫోన్ వచ్చినప్పుడు రహస్యంగా మాట్లాడడంలాంటి పనులు చేస్తుందని చెప్పేవాడు.
2008లో టామ్ థోమస్ మరణం.. ప్రతీ రోజు సాయంత్రం కాఫీ తాగిన తరువాత మష్రూమ్ క్యాప్సెల్ వేసుకోవడం టామ్ తోమస్ కు అలవాటు. అది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎప్పటిలాగానే సాయంత్రం కాఫీ తాగిన తరువాత ఆ టాబ్లెట్ ను జాలీ ఇచ్చి డోర్ పెట్టి బయటకు వెళ్తుంది. దాన్ని వేసుకున్న తరువాత అతను కాస్తా అస్వస్థతకు గురి అవుతాడు. చాలా సేపు తరువాత పక్కింట్లో వాళ్లు గమనించి అతన్ని ఆటోలో ఆసపత్రికి తీసుకుపోతుంటే దారి మధ్యలో టామ్ థోమస్ మరణిస్తాడు. జాలీ చెప్పినదాన్ని బట్టి అతనికి గుండె పోటు వచ్చిందని అందరూ నమ్ముతారు. తరువాత అంత్యక్రియలు జరిగేటప్పుడు ఎమ్ఎస్ మ్యాథ్యూ, జాలీ ఇద్దరూ కాస్త దూరంగా నిలబడి మాట్లాడుకుంటుంటే రోజో థోమస్ చూసి వాళ్ల అన్నయ్యను అడిగినట్లు చెప్తాడు. వాళ్ల మధ్య ఏవో డబ్బు వ్యవహారాలు ఉన్నాయని బహుషా దాని గురించేమో అని అన్నాడు అని రోజో చెప్తాడు.
రెండు మరణాలకు కారణం జాలీ థోమస్ కానీ వీటి మధ్య 6 సంవత్సరాల గ్యాప్ ఉంది. దీంతో ఎవరికీ ఎటువంటి అనుమానం కలుగలేదు. దాంతో పాటు ఎలాంటి క్లూస్ కూడా లేవు. జాలీ చాలా తెలివిగా విషాన్ని ప్రయోగించింది. అని మీడియా మిత్రలు చెప్తారు. తరువాత అంత్యక్రియల సమయంలో టామ్ థోమస్ ను బాడీని పట్టుకొని జాలీ ఏడ్చిందని రెంజీ విల్సన్ చెప్తుంది. తరువాత ఒక రోజు ఎదురింటి ఆవిడను పిలిచి ఈ బావి వాస్తుకు లేదని అందుకే ఈ మరణాలు అని చెప్పినట్లు ఆవిడ చెప్తుంది. మొత్తం ముగ్గురు చనిపోతారని జాలీ చెప్పిందని, నీకు ఎవరు చెప్పారు అంటే చర్చీ ఫాదర్, ముస్లీం బాబాలు అని చెప్పింది. ఆ సంఘటనతో ఆ ఇంటికి వెళ్లేదాన్ని కాదని తను చెప్తుంది.
తరువాత కొద్ది నెలలకు రెమోకు, ఉచ్చు అనే తమ్ముడు పుట్టినట్లు చెప్తాడు. దాంతో కుటుంబం చాలా సంతోషంగా ఉందని చెప్తాడు. తాను పెరగుతున్నకొద్ది ఇంట్లో సమస్యలు పెరుగుతూ వచ్చాయని ఆ సమయంలో అమ్మ నాన్నల మధ్య మాటలు సరిగా లేవని చెప్తాడు. రాయ్ బిజినెస్ సరిగ్గా సాగడం లేదు, దాంతో సమస్యలు ఎక్కువయ్యాయి. ఒక రోజు రెంజీ, రోజో వాళ్ల నాన్న గదిలో ఉన్నప్పుడు ఒక వీలునామను తీసుకొని వచ్చి మీకు నాన్న రాసిచ్చిన ఆస్తి ఇదే అని రాయ్ అన్నయ్య అంటాడు. అదేంటి వీలునామలో స్టాంప్ పేపర్లు లేవు, సాక్షి సంతకాలు లేవని రెంజీ అంటాడు. దాంతో ఇవే నాన్న ఇచ్చాడు అని రాయ్, జాలీ చెప్తారు. ఇద్దరు కలిసే అబద్దం చెప్పారు అని వీళ్లకు తరువాత అర్థం అవుతుంది. అదే సమయంలో మ్యాథ్యూ గురించి కూడా ఇంట్లో గొడవలు జరిగుంటాయి, రాయ్ జాలీని అనుమానించడం మొదలుపెట్టాడు సైమన్ చెప్తాడు. దాంతో అతన్ని వదిలించుకోవాలని స్కెచ్ వేసింది జాలీ.
2011 రాయ్ థోమస్ మరణం… సెప్టెంబర్ 30 వ తేదీనా జాలీ తన ఇద్దరి పిల్లలకు అన్నం తినిపించి నిద్రపుచ్చింది. తరువాత రాయ్ వచ్చి పిల్లలతో కాసేపు గడిపి కిందికి వచ్చి అన్నం తింటాడు. శనగల కూర తింటున్న కాసేపటికే తీవ్ర ఆయాసం వస్తుంది. వాష్రూమ్ కు వెళ్తాడు. అక్కడే పడిపోయి చనిపోతాడు. పక్కింటి వాళ్లు వచ్చి డోర్ ను పగలగొట్టి ఆసుపత్రికి తీసికెళ్లినట్లు అదే సమయంలో అక్కడ మ్యాథ్యూ కూడా ఉన్నాడని రెమో చెప్తాడు. ఇక రాయ్ మరణంపై మంచిడియల్ కు అనుమానం వస్తుంది. పోస్ట్ మార్టం చేయాలని పట్టుబడుతాడు. జాలీ వద్దని వాదిస్తాడు. అయినా వినకుండా చేయాల్సిందేనని అనడంతో పోస్ట్ మార్టం చేస్తారు. ఆ రిపోర్ట్ లో రాయ్ సైనైడ్ తో చనిపోయినట్లు తెలుస్తోంది. దాంతో రాయ్ చాలా అప్పులు చేశాడు అందుకే సూసైడ్ చేసుకున్నాడు అని అందరిని నమ్మిస్తుంది జాలీ.
మాములుగా సైనైడ్ బాడీలో ఉందంటేనే దాన్ని హత్యలా చూడాలి అనేది బెసిక్. ఆ తరువాతే సూసైడా లేదా అనే కోణంలో చూడాలి అని టాక్సీకాలజిస్ట్ పిల్లయ్ అంటాడు. అసలు సైనైడ్ ఎలా వచ్చింది. దాన్ని అతను ఎలా తీసుకున్నాడు అనే బెసిక్ ఇంటారాగేషన్ కూడా చేయలేదని ఆఫీసర్ అంటాడు. బహుషా తన హస్బెండ్ పోయిన తరువాత ఇవన్ని ఎందుకు అని జాలీ అని ఉంటుంది అందుకోసమే తదుపరి దర్యాప్తు కొనసాగలేదేమోనని సైమన్ అంటాడు. తరువాత సైనైడ్ కొనడం అనేది సాధారణమైన విషయం కాదు. అది మాములు వ్యక్తులకు అమ్మరు. దాన్ని ఎక్కువగా బంగారాన్ని శుభ్రం చేయడానికి మాత్రమే వాడుతుంటాడు. దానికోసం వాల్లు లైసెన్స్ తీసుకుంటారు. మరీ రాయ్ థోమస్ కు సైనైడ్ ఎక్కడి నుంచి వచ్చినట్లు అని పిల్లయ్ అంటాడు. తరువాత గోడపై రాయ్ చిత్రపటం చేరుతుంది.
వాళ్ల నాన్న చనిపోవడం జీర్ణించుకోలేదని రెమో అంటాడు. ఆ తరువాత వాళ్ల జీవితంలో అసలైన ఇబ్బందులు ఎదురైనట్లు చెప్తాడు. 2012లో ఇంటిని తన పేరు మీద రాసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది జాలీ. విషయం తెలుసుకున్న మరిది రోజో థోమస్ ఓల్డ్ డాక్యూమెంట్స్ చూపించి మళ్లీ వాళ్ల నాన్నగారి పేరుమీదనే ఉండేటట్లు చేస్తాడు. దీన్ని ఉపయోగించుకొని జాలీపై కేసు పెట్టొచ్చు కానీ పిల్లలు గురించి ఆలోచించి అదే ఇంట్లో వారిని ఉండనిచ్చినట్లు రోజో చెప్తాడు. అదే సమయంలో మంచిడియల్ అన్ని విషయాలు రెంజీతో చెప్పేవాడు అని జాలీకి తెలుసు. అప్పుడప్పుడు చుట్టపు చూపుకు జాలీ ఇంటికి వచ్చేవాడు. ఒక రోజు మ్యాథ్యూతో సంబంధం పెట్టుకోవడం తప్పు హెచ్చరిస్తాడు. అది జాలీకి నచ్చలేదు.
2014 మంచాడియల్ మరణం… ఎప్పటిలాగే ఒక రోజు మంచాడియల్ జాలీ ఇంటికి వస్తాడు. మాటల్లో అతన్ని తాగడానికి డ్రింక్ ఇస్తుంది. తాను తాగేసి పడిపోతాడు. తరువాత చనిపోతాడు. ఇదే విషయాన్ని రెంజీ థోమస్ కు ఫోన్ చేసి చెప్తుంది జాలీ. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. తాను మొదటి హత్యకు రెండవ హత్యకు చాలా గ్యాప్ తీసుకుందని కానీ తరువాత జరిగే హత్యలకు గ్యాప్ తగ్గుతూ వచ్చిందని అంటాడు.
తాను సీరియల్ కిల్లర్ కాదని పిల్లయ్ అంటే క్రిమినల్ స్పెషలిస్ట్ మేఘన శ్రీవాస్తవ్ మాత్రం రెండు హత్యలు అంతకు మించి చేస్తే అది కచ్చితంగా సిరీయల్ కిల్లర్స్ అవుతారని చెప్తుంది. వాళ్లకు ఒక సపరేట్ సిగ్నేచర్ కూడా ఉంటుంది అని అంటుంది. జాలీ విషయానికి వస్తే తానలో రెండు షేడ్స్ ఉన్నాయి. ఒకటి ఈ సమాజానికి నచ్చేలా నడుచుకుంది. మరోటి ఈ మర్డర్స్ ప్లాన్ చేస్తుంది. తాను సీరియల్ కిల్లర్ అవునో కాదో పక్కన పెడితే వారందరిని చంపడానికి సైనైడ్ వాడింది. సంపాదించడం కోసం లేదా ఆస్తి కోసమే ఈ మర్డర్లు చేస్తుంది.
ఇక మరో ట్విస్ట్ ఏంటంటే రాయ్ థోమస్ వాళ్ల అన్న కొడుకు షాజును పెళ్లి చేసుకోవాలని జాలీకి ఉండేది. అతనిది టీచర్ ఉద్యోగం, మంచి సాలరీ తనను పెళ్లి చేసుకుంటే బాగుండేది అని ఫీల్ అయ్యేది. షాజు జక్రియాకు, సిలీ సెబస్టియన్ తో పెళ్లై అబెల్, అల్ఫైన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సిలీ చనిపోతే కానీ జాలీ షాజును పెళ్లి చేసుకోలేదు. దాంతో మరో మర్డర్ చేయడానికి చెయడానికి ప్రిపేర్ అయింది. 2014లో షాజు ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. జాలీ జోసఫ్ తన పిల్లలతో అక్కడికి వెళ్తుంది. అదే సమయంలో అల్ఫైన్ కు ఒక అవిడా అన్నం తినిపిస్తుంది. అందులో సైనైడ్ కలుపుతుంది జాలీ. అంతలో పాప సృహ తప్పుతుంది. ఆసుపత్రికి తీసుకెళ్తారు. 2 సంవత్సరాల పాపకు విషం విస్తారు అని ఎవరు అనుకుంటారు. తన బిడ్డ మరణంతో సిలీ బాగా కుంగిపోయింది. అదే సమయంలో జాలీ తనకు తోడుగా ఉంటూ ఓదార్చేది. దాంతో సిలీకి జాలీ అంటే నమ్మకం కలిగింది. సిలీ డిప్రెషన్ నుంచి బయటపడాలంటే వాళ్ల మామ గారు వాడే మష్రూమ్ క్యాప్సిల్స్ ను కొనిపిస్తుంది.
2016 సిలీ మరణం.. సిలీ ఒక డెంటిస్ట్ ను కలువడానికి ఆసుపత్రికి వెళ్తుంది. అక్కడే షాజు, జాలీ ఇద్దరు హాల్ లో వెయిట్ చేస్తుంటారు. అదే సమయంలో ఒత్తిడికి గురికాకుండా ఉంటావు అని సయనైడ్ కలిపిన మష్రూమ్ క్యాప్సిల్స్ ను సిలీకి ఇస్తుంది జాలీ. అది వేసుకున్న వెంటనే సిలీ వెనక్కి పడిపోయి చనిపోతుంది. దాంతో ఆసుపత్రివారు పోస్ట్ మార్టం చేయాలి అంటారు. దానికి షాజు అస్సలు ఒప్పుకోడు. వాళ్ల కుటుంబంలో ఇలాంటి అలవాట్లు లేవని చెప్తాడు. షాజుపై కూడా లాయర్ అనుమానపడినట్లు చెప్తాడు. బహుషా జాలీని పెళ్లిచేసుకోవడానికి సిలీని వదిలించుకోవడంలో తన పాత్ర ఉందా అనే కోణం కూడా ఉంది అనేది లాయర్ అనుమానం.
సిలీ చనిపోయినప్పుడు రెంజీ వెళ్లినట్లు చెప్తుంది. అదే సమయంలో జాలీ అన్ని పనులు చకచక చేస్తుందని, సిలీని రెడీ చెయడం చూస్తుంటే జాలీపై అనుమానం వచ్చింది అని రెంజీ అంటుంది. ముందు పాపను చంపి, ఆ తరువాత సిలీని హతమార్చిందా అనే అనుమానం ఉన్నట్లు రెంజీ చెప్తుంది. కొన్నాళ్లకు సిలీ మరణాన్ని అందరూ మరిచిపోయారు. అదే సమయంలో జాలీ, షాజుల పెళ్లి చేయాలని అందరూ మాట్లాడుకుంటుంటారు. ఇదే విషయాన్ని తనను వాళ్ల అమ్మ అడిగినట్లు రెమో చెప్తాడు. 2017లో షాజు, జాలీ ల పెళ్లి జరుగుతుంది. చివరికి తన లక్ష్క్ష్యాన్ని నెరవేర్చుకుంది అని రెంజీ అంటుంది. రహస్యం ఎప్పటికీ దాగదు అనేది బైబుల్ ఉందని రెంజీ చెప్తుంది.
ఒక రోజు రాయ్ అన్నయ్య పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలని రెమోను అడిగి తీసుకొని చూశాను. అందులో తాను శనగలు కర్రీ తిన్నాడు అని ఉంటుంది. రాయ్ చనిపోయినప్పుడు జాలీని అడిగితే తాను రాత్రి ఏం తినలేదు అని చెప్పింది. కానీ రిపోర్ట్ లో అతను తిన్న కర్రి ఇంకా జీర్ణం కాలేదు అని రాసుంది. దాంతో అనుమానం బలపడింది. వెంటనే ఐపీఎస్ సైమన్ సార్ ను కలిశాను అని రెంజీ చెప్తుంది. తరువాత తన అనుమానాలను అన్ని సైమన్ కు చెప్పాను అని దాంతో ఈ కేసును క్రైమ్ బ్రాంచికి అప్పజెప్పినట్లు చెప్తుంది. తరువాత పది మంది టీమ్ గా ఈ కేసును దర్యాప్తు చేపట్టాము. మొదట తాను పనిచేసిన ఎన్ఐటీ కాలేజీలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. జాలీ అనే పేరుతో ఏ టీచర్ లేదని వారు చెప్పారు. అంటే జాలీ అసలు ఎన్ఐటీలోనే పనిచేయలేదు. అసలు అమె ఎమ్ కమ్ కూడా చదవలేదు. తన దగ్గర ఉన్న సర్టిఫికేట్ ఫేక్. అసలు ఇదంతా ఎలా చేయగలిగింది.. దీనికి కారణం టామ్ థామస్.
టామ్ థామస్… ఎడ్యూకేషన్ డిపార్ట్ మెంట్ లో అడ్మినిస్ట్రేటర్ గా ఉండేవాడు. అతను రిటైర్డ్ అయిన తరువాత ఒక కన్సల్టెన్సీని మొదలు పెట్టాడు. చాలా మంది పిల్లల సర్టీఫికెట్ తన దగ్గరకు వస్తాయి. ఆ విషయం జాలీకి తెలుసు. దాంతో తన సర్టిఫికెట్ తయారు చేసుకుంది. నిజానికి తాను అండర్ డిగ్రీ చదివింది అని సైమన్ చెప్తాడు.
తరువాత ఒక రోజు వాళ్ల అమ్మ ఫోన్ చేసి ఒక విషయం చెప్పింది. మీ బాబాయ్, అత్త నా మీద మర్డర్ కేసు పెట్టారు. పొన్నమట్టం ఫ్యామిలీలో వరుస హత్యలు నేనే చేశాను అంటా.. నువ్వే వాళ్లతో చెప్పి కేసును వాపస్ తీసుకొమను అని అంది. ఇన్ని మర్డర్లు ఒక్కర్తే ఎలా చేయగలుగుతుంది అమ్మను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు అని అనుకున్నా.. దాంతో మేనత్తకు కాల్ చేసి కేసు వాపస్ తీసుకో అని చెప్పాను. అది కుదరు నీకు ఏం తెలియదు అని స్ట్రాంగ్ గా చెప్పా అని రెంజీ చెప్తుంది.
తరువాత కొన్నాళ్లుకు 6 డేడ్ బాడీలను రీ పోస్ట్ మార్టం కోసం బయటకు తీస్తున్నట్లు వార్తలు వస్తాయి. అదే సమయంలో 6 డెడ్ బాడీలను తవ్వి తీస్తారు. అప్పుడు వాళ్ల చుట్టాలు చాలా మంది రెంజోని, రోజోని తిట్టారని చెప్తుంది. అయినా సరే మొత్తం ప్రాసెస్ జరగాలి అని చెప్పాను అని రెంజీ అంటుంది. తరువాత రెమో కేరళకు వస్తాడు. ఇంటికి వెల్లగానే వాళ్ల అమ్మ జాలీ ఎదురుగా వస్తుంది. ఏమైంది, అందరూ నువ్వే చేశావు అంటున్నారు అని గట్టిగా అడిగాను. తాను నిజం చెప్పింది. తరువాత ఇదే విషయం రెమో నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు వెన్నులో వనుకు పుట్టింది అని, అయితే ఆ ఇంట్లో ఇంకా సయనైడ్ ఉండి ఉంటుంది. మీ తమ్మున్ని, నిన్ను చంపేసినా చంపేస్తుంది. ఆ ఇంట్లో ఏం తినకండి, ఏం తాగకండి అని రిపీటెడ్ గా చెప్తూనే ఉన్నానను అని రెంజీ అంటుంది. తెల్లారగానే ఎస్పీకి కాల్ చేసి విషయం చెప్పాను అంటుంది.
2019 జాలీ అరెస్ట్… జాలీ జోసఫ్ ను కూడతాయిలోని తన ఇంట్లో అరెస్ట్ చేస్తారు. అదే సమయంలో అక్కడ షాజు, రెమో ఉంటారు. తన తమ్ముడు కనిపించడు. రెంజీ భయంతో ఇంటికి వస్తుంది. తమ్ముడు ఇంకా నిద్ర పోలేదు అని రెమో చెప్పాడు. ఊపిరి పిల్చుకున్నా అని ఇంట్లో గత రెండు మూడు రోజుల నుంచి ఏం పాత్రలు కడగనట్లు అక్కడ చూస్తే అర్థం అయిందని చెప్తుంది. ఇక ఇద్దరు పిల్లలను తీసుకొని తన ఇంటికి వెళ్లినట్లు చెప్తుంది. వాళ్ల అమ్మ, నాన్నలను, అన్నను చంపినందుకు రెంజీ ఎమోషనల్ అవుతుంది.
అధికారంకోసం అత్తను, అడిగాడని మామను, అడ్డున్న భర్తను, అనుమానించాడని అంకుల్ ను, షాజు కోసం కూతుర్ని, తల్లిని మొత్తం ఆరుగురిని చంపినందుకు 16 రోజులు రిమాండ్ విధించారు. ఇక అందరికి తెలవాల్సిన విషయం ఏంటంటే ఇదంతా చేసింది జాలీ ఒక్కరేనా ఇంకా ఎవరన్నా ఉన్నారా అని. ఇదే విషయాన్ని అడిగితే అసలు విషయం బయటపెట్టింది. సైనైడ్ చాలా పవర్ ఫుల్ పాయిజన్ అని పేపర్లో చూసింది. ఎమ్ఎస్ మ్యాథ్యూతో పరిచయం పెంచుకొని ఒక కుక్కను చంపడానికి సైనైడ్ కావాలని చెప్పింది. దాంతో మ్యాథ్యూ, ప్రజీ కుమార్ అనే గోల్డ్ స్మిత్ వ్యక్తి సైనైడ్ ఇచ్చి సాయం చేస్తాడు. అతన్ని అరెస్ట్ చేసి నిజం చెప్పమని కోర్టులో నిలబెడితే నాకు ఏం సంబంధం లేదు అని మ్యాథ్యూ అబద్ధం చెప్పాడు. తరువాత జాలీ ఇంట్లో సైనైడ్ దొరికితే కేసు బలపడుతుంది. అలాగే కొన్ని రోజులకు ఆ ఇంట్లో పౌడర్ రూపంలో ఉన్న సైనడ్ దొరికింది అని కోర్టుకు సబ్ మిట్ చేస్తారు. ఇన్ని రోజుల తరువాత సైనైడ్ దొరకడం అనేది నమ్మశక్యంగా లేదని లాయర్ అంటాడు. కేసు నిలబడాలని పోలీసులే సృష్టించారు అని లాయర్ చెప్తాడు.
పోలీసు ఇన్వెస్టిగేషన్ కూడా సరిగా జరగలేదని జర్నలిస్ట్ చెప్తుంది. 6 కేసులు పూర్తి అవడానికి 6 సంవత్సరాలు పడుతుందని, కేసును పరిశీలిస్తే జాలీ అలసు ఎప్పటికీ దోషిగా నిర్ధారించబడదు అని లాయర్ చెప్తాడు. కేసు బయటపడి జాలీని అరెస్ట్ చేసిన తరువాత చాలా మంది తనకు సారీ చెప్పారని రోజో థోమస్ చెప్తాడు. ఇది తలచుకుంటే అంతా మా విధీరాత అంటాడు. తరువాత రెమో, రెంజీ ఈ కేసుగురించి మాట్లాడుతారు. విచారణ జరుగుతుందిని న్యాయం గెలుస్తుందని అంటారు.
ఇంత పెద్ద ఎడ్యూకేషన్ ఫ్యామిలీ మీది జాలీ చదువు గురించి తెలియదా అని అందరూ అడిగేవారు.. సర్టిఫికెట్లు ఎందుకు చెక్ చేస్తాము.. నమ్మకం ఉంటుంది కదా… అయినా తాను గొర్రె తోలు కప్పుకున్న తోడేలు.. అలాంటిది జాలీ చేసిన మోసం ఎవరు గుర్తుపట్టలేదు. ఇదంతా తెలియాలంటే జాలీనే చెప్పాలి అని రెంజో అంటుంది. తరువాత జైల్లో జాలీని కలిసి ఇంత మందిని చంపావు కాదా నీకు పశ్చాత్తపపడట్లేదా అని అడిగాను.. రెమోకు ఫోన్ చేసి వాన్ని డిస్టర్బ్ చేయకు అని చెప్పాను. వాడు ఇప్పుడు నా కొడుకు అని చెప్పాను. ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటారు. చుట్టు పోలీసులు ఉండడం, తనను తీసుకురావడం చూస్తుంటే జాలీ వేసిందని, అంత మందిని చంపావు కదా నీకు ఏమి అని పించడం లేదా అంటే అది అలా జరిగిపోయింది అంతే.. అని జాలీ సింపుల్ గా చెప్పింది. ఆ మాటలకు ఏం మాట్లాడలో తెలియలేదు.. 6 మందిని నిర్దాక్షిణ్యంగా చంపావు అంటే.. ఏం చేయాలి నాలో క్రిమినల్ ఉంది. అని జాలీ జోసఫ్ అంటుంది. అక్కడి నుంచి బయటకు వచ్చేప్పుడు జాలీ ఒక మాట అన్నది.. బైబుల్ ఉంది కదా ఎన్ని పాపాలు చేసిన దేవుడు క్షమిస్తాడు అని నన్ను కూడా క్షమిస్తాడు అని అంది. అవును దేవుడు మనందరినికి క్షమిస్తాడు అని జాలీతో అని అక్కడి నుంచి వచ్చినట్లు రెంజీ చెప్తుంది. ఇది డాక్యూమెంట్రీ.
2011లో రాయ్ బాడీలో సైనైడ్ గుర్తించారు. అలాగే 2020లో సిల్లి బాడీలో సైనైడ్ బయటపడింది. అలాగే మిగితా నాలుగు బాడీ శాంపిల్స్ ను పరీక్షించారు. 2023లో ఆ బాడీల్లో సైనైడ్ గుర్తించలేదు. ప్రస్తుతం ఈ కేసు కేరళ కోర్టులో కొనసాగుతుంది. జాల్లీ జోసఫ్, ఎమ్ ఎస్ మ్యాథ్యూ కోయ్ కోడా జైల్లోనే ఉన్నారు. అనే టైటిల్స్ తో ఈ డాక్యుమెంట్రీ ఫిల్మ్ అయిపోతుంది.